చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పాలకుల వల్ల అన్ని వర్గాల ప్రజలు, రైతులు పరేషాన్ లో ఉన్నారని వారిని ఆ భగవంతుడే కాపాడాలని వేడుకున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బేల మండలం సదల్పూర్ లోని అతి ప్రాచీన శ్రీ బైరందేవ్, మహాదేవ్ జంగి జాతర సందర్భంగా సోమవారం ఆయన దేవుళ్ళను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. బేల మండలం అభివృద్ధికి, సదల్‌పూర్ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికి తెలుసన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పాలనతో ప్రజలకు విముక్తి కల్పించాలని ఆ బైరం దేవ్, మహాదేవ్ లను వేడుకునట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న ఓల్లప్వార్, సతీష్ పవార్, విపిన్ ఖోడే, ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యాంరావు, అరుణ్ కొడప, గ్రామ సర్పంచ్ మంగేష్ మర్సుకోల, నందు సిడం, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ముంబై సాహిత్య సమ్మేళనం ముంబైలో సుకుమార్ పేట్కులే కి ఘన సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కి నవి ముంబైలోని పన్వెల్లో ఆదివారం జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు. కొంకన్ మరాఠి సాహిత్య పరిషత్ పన్వెల్ (నవీ ముంబై) మరియు పంచశీల్ తరుణ్ మండల్ సావర్గం (ముంబై) లు సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమ్మేళన, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన సాహిత్యం తెలుగు, మరాఠి, హిందీ భాషల్లో అనువాద రచనలు చేస్తూ సాహిత్య సామాజికసేవ చేస్తున్నందుకు గుర్తింపుగా సుకుమార్ పేట్కులే ను ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ హిందీ, మరాఠీ, ఉర్దూ బహుభాషా కవి మధుబావల్కర్ ను సహితం కార్యక్రమ నిర్వాహకులు మెమెంటో, శాలువా, పూలమాల, బొకే, బహుజన సాహిత్యాన్ని బహూకరించి ఘనంగా సన్మానించారు. నవి ముంబై కి పన్వెల్ చెందిన కార్యక్రమ నిర్వాహకులు నాగనాథ్ డోలారే రచించిన రెండు మరాఠీ కవిత సంపుటులు మానవతే చే సింహాసన్, లావణ్యా లేని అనే పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ అవార్డును మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ తదితరులు ప్రధానం చేయగా పూణేకి చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్ తో పాటు మొత్తం 14 మందిని ఎంపిక చేసి ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన మహనీయుల ఆశయ సాధన కోసం గత 25 సంవత్సరాలుగా కృషి చేస్తున్నందుకు గాను తనకు దేశవ్యాప్తంగా వివిధ సంస్థల ద్వారా గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాగే సాహిత్య సామాజిక క్షేత్రంలో మున్ముందు పనిచేయడానికి ఈ సన్మానం దోహద పడుతుందని ఆయన తెలిపారు.
గిమ్మ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న వినతి
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ మండలం గిమ్మ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న విన్నవించారు. శుక్రవారం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్గంగా నదిపై నిర్మించిన చనాఖా-కొరటా బ్యారేజి హత్తిఘాట్ పుంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి సర్పంచ్ ప్రద్యుమ్న సమస్యలపై విన్నవించారు. గిమ్మ గ్రామంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్ర నారాయణ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, ఆలయ పునరనిర్మాణానికై నిధులు మంజూరు చేయాలని, పెన్ గంగా తీరంలోని ఓంకారేశ్వరాలయం అభివృద్ధికి కృషిచేయాలని విన్నవించారు. అర్హత కలిగిన.కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని విన్నవించారు. గిమ్మ నుంచి మాండగడ, పిప్పర్వాడ వరకు రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని వివరించారు. ఇది వరకు నిర్మించిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరారు.
వరుస దొంగతనాల కేసును చేధించిన బేల పోలీసులు
*అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
*వివరాలను వెల్లడిస్తున్న బేల ఎస్సై ఎల్ ప్రవీణ్ కుమార్
చిత్రం న్యూస్, బేల: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసును బేల పోలీసులు చేధించారు. శనివారం నిందితుడి వివరాలను బేల ఎస్సై ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అభి అలియాస్ కుంచెలవార్ అభినవ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బేల గ్రామంలో ఫర్టిలైజర్ షాపులు, బ్యాంక్, ఇతర దుకాణాల షట్టర్లు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డానని తెలిపారు. దొంగతనం చేసిన నగదును చేనులో దాచి పెట్టాడన్నారు.దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార,దుస్తులు, మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దొంగలించబడిన నగదు లెక్కించగా మొత్తం రూ.58 వేలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు నిందితున్ని రిమాండ్ కు తరలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
భోరజ్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..సీఎంకు విన్నవించిన సర్పంచ్ చిటిమెల్లి సాయివర్మ
చిత్రం న్యూస్, భోరజ్:ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండని సీఎం రేవంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ చిటిమెల్లి సాయివర్మ విన్నవించారు. శుక్రవారం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్గంగా నదిపై నిర్మించిన చనాఖా-కొరటా బ్యారేజి హత్తిఘాట్ పుంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి సర్పంచ్ సాయి వర్మ సమస్యలపై విన్నవించారు. నూతనంగా ఏర్పడిన మండలం కావడంతో సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు తాగునీటి సదుపాయాలు, డ్రైనేజి, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, స్మశానవాటికకు వెళ్లేందుకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేసేందుకు తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని విన్నవించారు.
సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్ గంగా నదిపై భోరజ్ మండలంలో నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేసేందుకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
జంగుబాయి దేవతకు పూజలు
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని దత్తగూడ జామిని పంచాయతీ దత్తగూడ గ్రామంలో అడవి తల్లి, ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి దేవతకు పూజలు చేశారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో ఆదివాసీ గిరిజనులు జంగుబాయి దేవతను ఘనంగా పూజిస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొడప రాము, చిన్న భీమా, కొడప లక్ష్మి బాయి, కొడప సోనేరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని సత్కరించిన సామ రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, భోరజ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి కలిశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్ గంగా నదిపై నిర్మించిన చనాఖా- కొరటా బ్యారేజ్ హత్తిఘాట్ పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదలకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ దగ్గర శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.
సంక్రాంతి క్రికెట్ టోర్నీ విజేత జీవైసి
చిత్రం న్యూస్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.విద్యానగర్, ఆటో యూనియన్, అంబేద్కర్ యువజనసంఘం, జ్ఞానోదయ యువజన సంఘం పేరుతో మొత్తం 4 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో జ్ఞానోదయ యువజన జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్ పోటీల్లో జీవైసి 8 ఓవర్లలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ దిగిన ఏవైసీ జట్టు ఐదు ఓవర్లలో 18 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పోటీల్లో గెలుపొందిన జట్టుకు టీపీఎల్ చైర్మన్ రత్న ప్రకాష్ ప్రైజ్ మని అందజేశారు.
శివాలయం నిర్మాణానికి రూ.21వేల నగదు విరాళం
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి పెన్ గంగ నది ఒడ్డున నిర్మిస్తున్న భారీ శివాలయ నిర్మాణానికి బేలలోని హనుమాన్ ఫెర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి, ఆయన తనయుడు సుశాంత్ రెడ్డి విరాళం అందజేశారు. గురువారం ఆ గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.21 వేలు విరాళo అందజేశారు. ఈ సందర్భంగా వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు పాల్గొన్నారు.










