Home Blog Page 96

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చలో ఆదిలాబాద్ 

కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్తున్న  వీహెచ్ పీఎస్ సభ్యులు

చిత్రం న్యూస్, బోథ్:  వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో ఆదిలాబాద్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద  నిర్వహించే దీక్షకు బోథ్ నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు  తరలివెళ్లారు. అనంతరం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ మాట్లాడుతూ.. వికలాంగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. రూ.4 వేల పెన్షన్  రూ.6 వేలు చేయాలని, వికలాంగులకు పూర్తిస్థాయిలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. వికలాంగులకు వ్యాపార నిమిత్తం సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని, వికలాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే వికలాంగులకు తగిన న్యాయం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ తో పాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు మోతే రాజేశ్వర్, కార్యదర్శి భోగ శంకర్ ఉపాధ్యక్షులు రమేష్ , సంఘ సభ్యులు ఆసిఫ్, మాల్వే రామచందర్, అనిల్ అన్నారు.

✖ Close హోం

ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే  పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు

రక్తదానం చేసిన బీజేపీ కార్యకర్తలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేదల పెన్నిధి, అలుపెరగని నాయకుడు, రైతు బాంధవుడు,  రాజకీయ దురంధరుడు, స్థిత ప్రజ్ఞుడు, నిత్య కృషీవలుడు,  ప్రజా సేవకుడు, అన్న అని పిలిస్తే  వెన్నంటే ఉంటూ ప్రజల శ్రేయస్సుకు పరితపించే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా టైగర్, జైనథ్ మండలంలోని అడ గ్రామ నివాసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు నడుమ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  బీజేపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి రక్తదానం చేశారు. జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో  ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా జైనథ్ మండల శ్రేణులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు చిలుకూరి లింగారెడ్డి ఆధ్వర్యంలో  గ్రామంలో పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామ రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నారకట్ల ప్రతాప్ యాదవ్, గౌకర్ విశాల్,  యువ మోర్చా మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నారకట్ల ప్రతాప్ యాదవ్, గౌకర్ విశాల్, యువ నాయకుడు ఏనుగు సూర్య రెడ్డి, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

నీరు వృధా..రైతులకు వ్యథ

కరత్వాడ ప్రాజెక్ట్ నుంచి వృధాగా పోతున్న నీరు

చిత్రం న్యూస్, బోథ్: ఒకవైపు వర్షాలు తక్కువ ఉండడంతో వర్షాకాలం రెండు నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు ప్రాజెక్టులు నిండలేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ కరత్వాడ ప్రాజెక్ట్ కుడి వైపు కెనాల్ గేట్ మొరాయించడంతో గత 10 రోజులుగా నీరు వృధాగా  పోతుంది. అసలే వర్షాలు లేక చిన్న చిన్న  ఒర్రెలలో, వాగులలో చుక్క నీరు కూడా లేదు. రాబోయే రబీ పంటలకి కరత్వాడ ప్రాజెక్ట్ నీరే రైతుల పంటలకు ఆధారం.  సంరంక్షించాల్సిన నీటిని ఇలా వృధా చేస్తే కరత్వాడ ప్రాజెక్ట్ లో నీరు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కరువు పరిస్థితులు రాకముందే అధికారులు వృధా నీటిని అరికట్టాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

✖ Close హోం

సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు

సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పలదారి గ్రామంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోడుసం బాబురావు ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి పెద్ద మంటలు వ్యాపించాయి . ఇంట్లో ఉన్న సభ్యులు గాయపడ్డారు. తొలుత వారిని బోథ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అదిలాబాద్ రిమ్స్  ఆసుపత్రికి తరలించారు.

✖ Close హోం

ఔట్ సోర్సింగ్ సిబ్బంది మెమోరండం అందజేత 

బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనురాధకు మెమోరండం అందజేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న నలుగురు సిబ్బంది సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధకు మెమోరండం సమర్పించారు. గత (5) నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పైఅధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో విధులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. మెమోరండం సమర్పించిన వారిలో కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ శృతి, ఆఫీస్ సబార్డినేటర్ సవిత, నైట్ వాచ్మెన్ రమేష్ ఉన్నారు.

✖ Close హోం

కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్య

          దాసరి లక్ష్మారెడ్డి (ఫైల్ ఫొటో)

చిత్రం న్యూస్, బోథ్: కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్యచేసుకున్న ఘటన బోథ్ లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీ సాయి ప్రకారం..బోథ్ కు చెందిన దాసరి లక్ష్మ రెడ్డి (76) అపెండెక్స్ చికిత్స చేసుకొని మందులు వాడుతున్నారు.  జూలై 31 న కడుపు నొప్పి తీవ్రం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తగ్గకపోగా నొప్పి భరించలేక ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్య బోజబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీ సాయి తెలిపారు.

✖ Close హోం

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో సుద‌ర్శ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో సుద‌ర్శ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ మంత్రి, బోధ‌న్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద‌ర్శ‌న్ రెడ్డి అంద‌రివాడుగా పేద‌ల పెన్నిధిగా పేరు గ‌డించిన వ్య‌క్తి అని కాంగ్రెస్ నాయ‌కులు గిమ్మ‌ సంతోష్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో శ్రేణులతో క‌లిసి సుద‌ర్శ‌న్ రెడ్డి క‌టౌట్ ప్ర‌క్క‌న‌ ఆయ‌న 77వ జ‌న్మ‌దిన వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి ఒక‌రినొక‌రు తినిపించుకొని శుభాకంక్ష‌లు తెలిపారు. వైఎస్ హ‌యాంలో  చేప‌ట్టిన జ‌ల‌య‌జ్ఞం ప‌థ‌కం స‌మ‌యంలో భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా ఆదిలాబాద్ జిల్లాకు ప్రాజెక్టులు తెచ్చి ఇక్క‌డి రైతాంగానికి ఎంతో మేలు చేసార‌ని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. ఈకార్య‌క్ర‌మంలో సీనియర్ నాయ‌కులు లోక ప్ర‌వీణ్ రెడ్డి , రావుల సోమ‌న్న‌, దొగ్గ‌లి రాజేశ్వ‌ర్ , దాస‌రి ఆశ‌న్న‌, ఎంఏ ష‌కీల్ , ర‌ఫీఖ్, అజ‌య్, శ్రీ‌లేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు.

✖ Close హోం

సెయింట్ థామస్ పాఠశాలలో మాక్ పోలింగ్

*విద్యార్థులలో ఎలక్షన్ జోష్

*విద్యార్థులకు ఓటింగ్ పై అవగాహన.

*ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు.

చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని  సెయింట్ థామస్ పాఠశాలలో శనివారం రోజున మాక్ పోలింగ్ నిర్వహించారు, విద్యార్థులకు ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించారు. .విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్ దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్లు లెక్కింపు, ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం జారీ పై అవగాహన కల్పించారు, ఎన్నికలలో స్కూల్ లీడర్ గా 10 వ తరగతి శ్రీ వర్షిత, అసిస్టెంట్ లీడర్ గా 9వ తరగతి సాయి నిఖిల్, స్కూల్ స్పోర్ట్స్ లీడర్ గా పదవ తరగతి అక్షిత్, అసిస్టెంట్ కల్చరల్ లీడర్ గా 9వ తరగతి శ్రీవిద్య ఎన్నికలలో గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కోసం మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలలో పోలింగ్ పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పీఈటీ శివానందరెడ్డి మాక్ పోలింగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

✖ Close హోం

భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’  కార్యక్రమం

భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తల్లి పేరు మీద ఒక చెట్టు’  కార్యక్రమం కింద మొక్కలు నాటుతున్న యూత్ సభ్యులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో మేరా యువ భారత్ లో భాగంగా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “తల్లి పేరు మీద ఒక చెట్టు” కార్యక్రమం కింద మొక్కలు నాటారు. మన భారత ప్రభుత్వం  “తల్లి పేరు మీద ఒక చెట్టు” అనే ప్రోగ్రాం ను 2024 లో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన అందరికి భూమి అంటే అమ్మ లాంటిది. తల్లి పేరు మీద ఒక చెట్టును నాటమని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా, తల్లులు అందించే సంరక్షణ మరియు పెరుగుదలకు ప్రతీకగా ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీవో శివ కుమార్ , గ్రామ కార్యదర్శి , భగత్ సింగ్ యువజన అధ్యక్షుడు నర్సయ్య, సభ్యులు రంజీత్ ,గణేష్, ముత్తన్న , రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఆర్టీసీ డీఎంతో మాట్లాడి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే

గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సుతో నాయకులు, గ్రామస్తులు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మంగ్రూడ్, పాటన్, కొబ్బయితో పాటు పలు గ్రామాల విద్యార్థులు జైనథ్ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించడంతో శుక్రవారం గ్రామాలకు బస్సు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్  శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.  బీజేపీ జనరల్ సెక్రటరీ సందీప్ టాక్రే, విద్యార్థులు,  గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

✖ Close హోం