Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 94

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం

0

*ప్రపంచ రికార్డ్ సాధించేలా 5 లక్షల మందితో యోగాసనాలు

*ఆర్కే బీచ్ వేదికగా యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం  అత్యున్నత స్థాయి సమీక్క్ష

*క్షేత్ర స్థాయిలో యోగా డే నిర్వహణ సన్నద్ధతను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

చిత్రం న్యూస్,విశాఖపట్టణం: ఈ నెల 21వ తేదీన విశాఖలో తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు  విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ మైదానంలో చేసిన ఏర్పాట్లనూ సీఎం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా చేస్తున్నారనే అంశంపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు. యోగా డే ను ప్రపంచ రికార్డు సాధించేలా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

0

సంస్థాగత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

చిత్రం న్యూస్ ,పెద్దాపురం: సంస్థాగత ఎన్నికల లక్ష్యంగా పార్టీ బలోపేతం  దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు చిట్టూరి శ్రీనివాసరావు, వాడ్రేవు వీరబాబులు ఆన్నారు. పెద్దాపురం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం, సామర్లకోట బడుగు శ్రీకాంత్ ఆఫీస్, పెద్దాపురం రాజా సూరిబాబు రాజు ఇంటి దగ్గర జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ లో పాల్గొని నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక తయారు చేసి తీర్మానాలు పంపించారు. కూటమి  ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతం గా ప్రజల ముందుకు తీసుకు వెళ్ళాలన్నారు. ఈ సమావేశంలో  పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు బోళ్ళ వెంకటరమణ, రాజోలు నియోజకవర్గం టీడీపీ వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి ఆయా మండల, నియోజక వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఖాప్రి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంఎల్ఏ పాయల్ శంకర్

0

ఖాప్రి గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంఎల్ఏ పాయల్ శంకర్

చిత్రం న్యూస్,  జైనథ్:  జైనథ్  మండలం ఖాప్రి గ్రామంలో ఆనారోగ్యం కారణంగా ఇటివలే మరణించిన కన్నాజి కిష్టన్న, మహిళా రైతు కుసుమ రుక్మాబాయి కుటుంబాలను MLA పాయల్ శంకర్ సోమవారం పరామర్శించి వారి కుటుంబలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.వారి ఆత్మ శాంతి కలుగాలని దేవున్ని ప్రార్థించారు. MLA వెంట జైనథ్ మండలం BJp అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు కుసుమ రామన్న, దంతెల  రవీందర్, దూర్ల సురేష్ తదితరులు ఉన్నారు.

లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ

0

లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ 

చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం, రూరల్: పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కూటమి నాయకులు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూటమి నాయకుల చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్లు పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. అదే విధంగా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందించడం తో విద్యార్థుల తల్లిదండ్రులలో మరింత ఆనందం కనిపిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆత్రేయపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

0

ఆత్రేయపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

చిత్రం న్యూస్, కొత్తపేట: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆత్రేయపురంలో రూ.20.65లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం రజకపేటలో 40 వేల లీటర్ల కెపాసిటీతో, రూ.77లక్షల అంచనా విలువతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి బండారు కాలనీలో 60వేల లీటర్ల కెపాసిటీతో, రూ.84 లక్షల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బీర్సాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

0

బీర్సాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

*అక్కడికక్కడే ఇద్దరు మృతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ పట్టణం రిక్షా కాలనీకి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులను తీసుకొని బెల్లంపల్లి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్నారు. బీర్సాయిపేట్ శివారులోకి రాగానే  కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న  ఈర్ల రాజుతో పాటు అతని భార్యకు గాయాలయ్యాయి ఈర్ల  రాజు కుమారుడితో పాటు ఆయన అత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన కూతురు పరిస్థితి విషమంగా ఉంది.

మరాఠీ వడ్రంగి సంఘం అధ్యక్షుడిగా హనుమాండ్లు 

0

మరాఠీ వడ్రంగి సంఘం అధ్యక్షుడిగా  హనుమాండ్లు 

చిత్రం న్యూస్, జైనథ్: మరాఠీ వడ్రంగి సంఘం జైనథ్ మండల అధ్యక్షుడిగా గౌకర్ హనుమాండ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఆదివారం మండల కేంద్రంలో కమిటీని ఎన్నుకున్నారు.. ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కాయర్కర్, గౌరవ అధ్యక్షులుగా తానుబ, ఉపాధ్యక్షులుగా శాస్త్రకార్ విట్టల్, వామన్ గౌకర్, కార్యదర్శులు గా చందు, గంభీర్, రాంకిషన్ ఎన్నికయ్యారు.. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, దిలీప్, నాయకుడు వెంకట్, నాగోరావ్, ప్రమోద్, గోవర్ధన్, సుధీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

0

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

*సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వృద్ధులను గౌరవించడంతోపాటు వారిని ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశ్ పాండే, లక్ష్మారెడ్డి, నరసింహులు, పోశెట్టి, హనుమంత్ రెడ్డి, శంకర్, గంగాధర్ తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి

0

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి

*ఇప్పటివరకూ 25,397 ఎస్జీటీల బదిలీ.

చిత్రం న్యూస్, అమరావతి: సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది.  ఇప్పటివరకూ 11 జిల్లాల్లో బదిలీలు పూర్తికాగా మరో రెండు జిల్లాల్లో ఆదివారం పూర్తవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. పశ్చిమగోదావరి, కృష్ణా, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం రాత్రితో బదిలీలు పూర్తయ్యాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నేడు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 31,072 మంది బదిలీలో ఉండగా శనివారం సాయంత్రానికి 25,397 మంది బదిలీ అయ్యారు. కాగా బదిలీలు పూర్తయినవారు సోమవారం కొత్త పాఠశాలలో చేరేవిధంగా వెంటనే బదిలీల ఆర్డర్లు సిద్ధంచేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని నిర్ణయించినా, ఉపాధ్యాయులు పట్టుబట్టడంతో మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టారు.

డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు

0

డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు

*ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు

*ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ

*మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి

చిత్రం న్యూస్,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC–2025 కన్వీనర్ ఎం.వి కృష్ణారెడ్డి కోరారు.