Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 92

మూడు తులాల బంగారు గొలుసు కాజేసిన కేసును ఛేదించిన పోలీసులు

0

బాధితురాలికి బంగారు గొలుసు అప్పగిస్తున్న పోలీసులు

*సీసీ కెమెరాల ఆధారంగా దొంగ గుర్తింపు

చిత్రం న్యూస్, సామర్లకోట: విశాఖపట్నం పట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు గొలుసు కేసును సామర్లకోట పోలీసులు ఛేదించారు. సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడపా గరగరావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికిపట్టుకుని బాధితురాలికి బంగారు గొలుసును అందజేశారు. విశాఖపట్నం కొత్త సాలిపేట, జగదాంబ సెంటర్ ప్రాంతానికి చెందిన కలిపిరెడ్డి నారాయణమ్మ కాకినాడ పట్టణంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చారు .బంగారు గొలుసు పెట్టిన పర్సుని సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో పోగొట్టుకున్నారు. బాధితురాలు నారాయణమ్మ దంపతులు శుభకార్యానికి హాజరయ్యేందుకు కాకినాడ బస్సు ఎక్కుతూ చూసుకోగా పర్సు లేకపోవడంతో ఆమె స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ గరగారావుకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు స్టేషన్ సెంటర్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి పర్స్ కాజేసింది ఒక సాధువుగా గుర్తించారు. సాధువు కోసం రాత్రి 8 గంటల వరకు కాపు కాసి పోలీసులు అతనిని పట్టుకుని మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసులు రికవరీ చేసి బాధితురాలు నారాయణమ్మకు పెద్దాపురం డీఎస్పీ డి. శ్రీహరి రాజు చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ. కాకినాడ శుభకార్యానికి వెళుతూ ఉదయం 8:30 గంటలకు సామర్లకోటలో బంగారు గొలుసును మహిళ పోగొట్టుకోగా సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ గరగారావులు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఎంతో చాకచక్యంగా పోగొట్టుకున్న సొత్తును గుర్తించి బాధితురాలికి అప్పగించారన్నారు. ఈ సందర్బంగా స్థానిక సీఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ గరగారావులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు .బాధితురాలు నారాయణమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి

0

*విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి

*తల్లులను గౌరవించాలి, ఇల్లు దాటే ముందు వారి ఆశీర్వాదం తీసుకోవాలి

*మనల్ని రక్షించే సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది

*ఇంకొల్లులో డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్

చిత్రం న్యూస్,ఇంకొల్లుః  బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సైనిక్ స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, బాలబాలికల వసతి సముదాయం, క్యాంటీన్, మెస్ భవనాలను డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు.

గురువులను దేవుడితో సమానంగా గౌరవించాలి

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అంటారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలకపాత్ర వహిస్తారు. నేను పదో తరగతి వరకు భారతీయ విద్యాభవన్ లో చదివాను. ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానివ్వండి, ఇంటర్ లిటిల్ ఫ్లవర్ లో చదివినప్పుడు ఆనాడు ఉన్న అధ్యాపకులు కానివ్వండి.. మా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కానివ్వండి. ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

మనం అందరం తల్లులను గౌరవించాలి, ఇల్లు దాటే ముందు వారి ఆశీర్వాదం తీసుకోవాలి

మన జీవితంలో అన్ కండిషనల్ గా మనల్ని ప్రేమించేది మన తల్లి. ఈ రోజు పెద్దలు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుందర్ పిచాయ్ గురించి చెప్పారు. నేను నిజంగానే ఆశ్చర్యపోయా. సుందర్ పిచాయ్ కోసం ఆయన తల్లి ఎన్నో త్యాగాలు చేశారు. తల్లుల త్యాగల వల్ల మనం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈ రోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనం తల్లులను గౌరవించాలి. ఇల్లు దాటే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలను కోరుతున్నా.

పేదరికం నుంచి బయటకు రావాలంటే అద్భుతమైన విద్యను అందించాలి

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఈ రోజు ఈ సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ను తీసుకురావడం జరిగింది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి బయటకు రావాలంటే అద్భుతమైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆనాడు విజనరీ వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్య  విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980ల్లోనే అద్భుతమైన విద్యా సంస్థలను ఏర్పాటుచేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలను ఏర్పాటుచేసి నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆనాడు నాణ్యమైన విద్యను అందించారన్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు మా పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి , తమ్ముడు హితేష్, చెల్లి నివేదిత పేరిట అద్భుతమైన స్కూల్స్ ను ఏర్పాటుచేశారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ కుటుంబం ఈ రోజు పనిచేస్తోంది. ఈ ఏడాది నుంచి సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేశారాన్నారు.

*నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం ఆనందంగా ఉంది

 

పెదనాన్న అధికారంలో ఉన్నా, లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలన్న మంచి ఆలోచనతో ఈ రోజు సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం జరిగింది. గతంలో ఆయన ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. ఈనాడు పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ రోజు సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మూడో తరం కూడా వచ్చింది. ఆ మూడో తరం పేరే హితేష్. తాత, తండ్రి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నారు. నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో హితేష్ పనిచేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. మీకు అండగా నిలబడతాం. ప్రభుత్వ పరంగా సహకరిస్తాం. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నామని లోకేష్ అన్నారు.

*మనల్ని రక్షించే సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది

సైనిక్ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నాకు గుర్తుకువచ్చేది పహల్గాం ఉగ్రదాడి ఘటన. శత్రువులను ప్రధాని మోదీ ధీటుగా ఎదుర్కొన్నారు. వారికి సరైన గుణపాఠం చెప్పారు. మన సైనికులు మనకోసం నిలబడుతున్నారు. మనకోసం పోరాడుతూ జవాన్ మురళీనాయక్ చనిపోయారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను నేను పరామర్శించాను. ఆ కుటుంబానికి ఆయన ఒక్కరే బిడ్డ. ఆర్మీలోకి వద్దని తల్లిదండ్రులు చెప్పినా దేశానికి సేవ చేస్తానని వెళ్లాడు. ఒకవేళ చనిపోతే దేశం మొత్తం కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. సైనికుల త్యాగాల వల్లే నేడు మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఇలాంటి అద్భుతమైన సైనికులను అందించేందుకే సైనిక్ స్కూల్ ను ఏర్పాటుచేశారు. మన ప్రాంతాల నుంచి వెళ్లిన సైనికులు తిరిగివచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సైనికులకు గౌరవంగా సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.

*విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి

ఇక్కడ పిల్లలను చూస్తుంటే దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడు. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు జయించే శక్తి కూడా ఇస్తాడు. ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనందరం రోడ్ లెస్ ట్రావెల్ ఎంచుకోవాలి. కష్టమైన మార్గమైనా ఎంచుకోవాలి. 40 ఏళ్లుగా గెలవని మంగళగిరిని ఎంచుకుని నేను పోటీచేశా. మొదటిసారి ఓడిపోయాను. రెండోసారి కసితో పనిచేసి రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో విజయం సాధించాను. నన్ను ఎంతో ఎగతాళి చేశారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశా. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు.

*బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి

రెండో సాహసోపేత నిర్ణయం విద్యాశాఖ తీసుకోవడం. చాలామంది వద్దన్నారు. ఛాలెంజ్ లు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఛాలెంజ్ లు స్వీకరిస్తా. ఏపీలో ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకువచ్చాం. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. పిల్లలు ఛాలెంజ్ లను నవ్వుతూ స్వీకరించాలి. విశాఖలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో 3 లక్షల మందికి పైగా యోగసనాలు వేసి గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఇందుకు మంత్రుల సంఘం ఛాలెంజ్ గా తీసుకుని పనిచేశాం.. యువతకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నాం. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి. దేశంలో మార్పు కోసం కష్టపడాలి. రాజకీయాల ద్వారా ఆ మార్పు తీసుకురావాలి. బాగా చదవండి. జీవితంలో సెటిల్ అయి దేశానికి సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నానన్నారు.  అంతకుముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎమ్ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ, బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటిన బీజేపీ నేతలు

0

జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాతుతున్న  బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, నేతలు

చిత్రం న్యూస్, జైనథ్: శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, నేతలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, భోరజ్ మండల అధ్యక్షులు గాజుల సన్నీ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎల్టి అశోక్ రెడ్డి, జైనథ్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నారకట్ల ప్రతాప్ యాదవ్, దళిత మోర్చ జైనథ్ మండల అధ్యక్షుడు గొడుగుల సత్యనారాయణ, ఏనుగు సూర్య రెడ్డి, పొచ్చన్న, గంగన్న మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

మరాఠీ వడ్రంగి సంఘం నూతన కమిటీ ఎన్నిక

0

మరాఠీ వడ్రంగి సంఘం నూతన కమిటీ ఎన్నిక

*అధ్యక్షులుగా లాండే విలాస్ , ప్రధాన కార్యదర్శిగా కాయర్కర్ ప్రమోద్ 

చిత్రం న్యూస్, తాంసి: మరాఠీ వడ్రంగి సంఘం తాంసి, భీంపూర్ మండలాల ను కలిపి ఒక సంఘంగా ఎన్నుకున్నారు.. ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్ ఎం. దిలీప్ సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లాండే విలాస్ , ప్రధాన కార్యదర్శిగా కాయర్కర్ ప్రమోద్ ,గౌరవ అధ్యక్షులుగా లాండే శంకర్ , ఉపాధ్యక్షులుగా గౌకర్ విలాస్, కోశాధికారిగా రాము, సలహాదారులుగా సంతోష్, రాజు, ఆకాష్ లను ఎన్నుకున్నారు.

మరాఠీ వడ్రంగి సంఘం ఎన్నిక 

0

మరాఠీ వడ్రంగి సంఘం ఎన్నిక 

అధ్యక్షులుగా  కాయర్కర్ విలాస్, ప్రధాన కార్యదర్శిగా రాకొండే దత్తు ఎన్నిక

చిత్రం న్యూస్, సాత్నాల: మరాఠీ వడ్రంగి సంఘం సాత్నాల, అదిలాబాద్ గ్రామీణ మండలాల ను కలిపి ఒక సంఘంగా ఎన్నుకున్నారు.. ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్ ఎం. దిలీప్ సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా  కాయర్కర్ విలాస్, ప్రధాన కార్యదర్శిగా రాకోoడే దత్తు, గౌరవ అధ్యక్షులుగా లాండే ఊషన్న, ఉపాధ్యక్షులుగా చత్రపతి, కోశాధికారిగా శంకర్, సలహాదారులుగా అశోక్, గణేష్ లను ఎన్నుకున్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్…

0

అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్…

*ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డిపై విమర్శలు

చిత్రం న్యూస్, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ.20 లక్షల నిధులతో చేపట్టిన సాగునీటి, త్రాగునీటి పైపులైన్ పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం స్కాంల చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో… ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కూడా చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు వేసుకున్నావంటూ ఆయన కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులు, వత్తాసు పలికితే క్షేమం. ఇదేనా పాలన అని ప్రశ్నించారు. మహిళ ఫిర్యాదుపై స్పందించకపోవడంపై కేటీఆర్, హరీష్ రావుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ప్రణవ్…కులగణన చేపట్టాం, భూభారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

0

ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

*రూ.60వేలు విలువ గల బ్యాగులు, విద్య సామగ్రి విద్యార్థులకు పంపిణీ

*గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరచిన 23 మంది విద్యార్థులకు రూ.23 వేలు నగదు ప్రోత్సాహకం అందజేత

చిత్రం న్యూస్, సాత్నాల: సాత్నాల మండలంలోని జామిని ప్రాథమికోన్నత పాఠశాలలో సామాజిక కార్యకర్త ముడుపు  మౌనీష్ రెడ్డి దాతృత్వంతో 145 మంది విద్యార్థులకు రూ 60 వేలు విలువైన బ్యాగులు, వ్రాత కిట్టు, పాఠశాలలో గతేడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థులకు 23 వేల నగదును ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు మా వంతు సహాయంగా 145 మంది విద్యార్థులకు 60,000 విలువైన బ్యాగులు, వ్రాత కిట్టు తదితర వస్తువులు అందజేశామన్నారు. ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి తరగతిలో ముగ్గురు విద్యార్థుల చొప్పున, 23 మంది విద్యార్థులకు రూ.23వేలు  సహాయం అందజేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. మౌనీష్ రెడ్డిని గ్రామస్తులు సైతం ఘనంగా సన్మానించారు. అంతకుముందు బ్యాండ్ మేళాలతో ఆయనకు విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ నైతం దేవుబాయి, రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు గోవర్ధన రెడ్డి, వీరన్న, ఆశన్న యాదవ్, సురేందర్ రెడ్డి, శ్రీకాంత్, అతర్వ, మాజీ సర్పంచ్ పెందూర్ మోహన్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ తానాజీ  తదితరులు పాల్గొన్నారు. 

సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం.

0

సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం.

చిత్రం న్యూస్, శంకరపట్నం: సెయింట్ థామస్ పాఠశాలలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ & ప్రిన్సిపాల్ ఫాదర్ శరన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  విద్యార్థులు యోగాతో ఏకాగ్రత సాధించవచ్చని అన్నారు. యోగాతో మనసు, శరీరంపై పట్టు సాధించి ఏకాగ్రత సాధించవచ్చునని తెలుపుతూ విద్యార్థులు ప్రతిరోజు కొంతసేపు యోగాకు సమయం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల పి.టి శివానంద రెడ్డి విద్యార్థులకు యోగాసనాలు త్రికోణాశనం, పాదాస్థానం, చంద్రాసనం ,ప్రాణాయామం, ధ్యానం మొదలైన వాటిపై విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖ సముద్ర తీరాన ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

0

విశాఖ సముద్ర తీరాన ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

*మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఒక్క యోగా  వల్లనే సాధ్యం

*ముఖ్యమంత్రి నాయకత్వంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవం గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించడం మంచి శుభపరిణామం

*మంత్రి కొలుసు పార్థసారధి*

చిత్రం న్యూస్, నూజివీడు:నిత్య జీవితంలో యోగా అనుసరణే ఆరోగ్య భద్రతకు మానవుని ఆధారమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. శనివారం విశాఖ సముద్ర తీరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విశాఖ తీరంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యోగా నిత్య సాధన వల్ల కలిగే మానసిక, శారీరక లాభాలు ప్రజలకు విస్తృతంగా తెలిసేలా చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజల నిత్య జీవితంలో యోగా ఒక భాగం అయినప్పుడు ప్రజల ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుందన్నారు, యోగా మన దేశ సంప్రదాయమని మన పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి అని అన్నారు, ఈ కళను నేటి తరానికి భావి తరానికి అందించాలన్నారు, తద్వారా ఆరోగ్యఆంధ్ర,, ఆరోగ్య భారత్ సాధ్యమన్నారు .పాశ్చత్య ,ఆధునిక ప్రపంచంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం యోగా వల్లనే సాధ్యం అన్నారు. మన నిత్య జీవితంలో యోగా ఒక భాగం అయినప్పుడు ప్రతీ ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తారన్నారు, యోగా వలన సమాజంలో అల్లర్లు, గొడవలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 3.5 లక్షల మంది ఏకమై యోగా చేసిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు,తెలుగుదేశం నాయకులు, రఘు, మధు, రమణ, ఆది, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

0

కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

*శక్తి కేంద్రం ఇన్చార్జి రసమల శ్రీనివాస్

చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా మండలంలోని  కరీంపేట శక్తి కేంద్రం పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఎస్టీ మోర్చ మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జి రాసమల శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్,నాయకులు మెడిశెట్టి రాజేష్, రొడ్డ స్వామి, మెడిశెట్టి రాకేష్, నాంపల్లి అజయ్, గుర్రం సదానందం, గంపల‌ శివాజీ, చింతం రాజు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.