చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో బుధవారం సర్పంచ్ మాలేగం మధుప్రీతి వీధిదీపాలకు కొత్త ఎల్ఈడీ బల్బులు అమర్చారు. రాత్రి సమయంలో గ్రామంలో వెలుతురు కొరత లేకుండా ప్రజలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పనిచేయని బల్బుల స్థానంలో నూతన బల్బులను అమర్చారు. ఉప సర్పంచ్ కో ప్లే నాగనాథ్, మాజీ సర్పంచ్ దేవేందర్, గ్రామస్తులు ఉన్నారు.
లోక ప్రవీణ్ రెడ్డికి కాంట్రాక్టు డాక్టర్ల సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. డాక్టర్లను రెన్యూవల్ చేయడంలో లోక ప్రవీణ్ రెడ్డి మంగళవారం కీలక పాత్ర పోషించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ను రిమ్స్ కాంట్రాక్ట్ డాక్టర్లు శాలువాతో సత్కరించారు. ధన్యావాదాలుతెలిపారు. కార్యక్రమంలో వినోద్ భల్ల, రవీందర్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, లర్ఫానుద్దీన్, సచిన్ రెడ్డి, మనోహర్ స్వామి తదితరులు ఉన్నారు.
పురపాలక ఎన్నికల్లో వ్యాపారుల పోటీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాబోయే పురపాలక ఎన్నికల్లో అన్ని వార్డుల్లో వ్యాపారులు పోటీచేయాలని, తమకు అనుకూలంగా ఉన్న పార్టీల నుండి టికెట్ తీసుకోవడానికి ప్రతిపాదనలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ జిల్లా అధ్యక్షులు క్యాతం శివప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు వ్యాపారస్థులను కేవలం ఎన్నికల కోసం మాత్రమే వాడుకుంటున్నాయని, సత్వర సమస్యల పరిష్కారాల కోసం వ్యాపారులు రాజకీయంలో ఉంటేనే సాధ్యం అవుతుందని అన్నారు. అందుకోసం ఆసక్తి ఉన్న వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయాలనీ, మున్సిపాలిటీ ఎన్నికల్లోపోటీ చేసే వారికి రాజకీయాలకు అతీతంగా సహకారాన్ని ఇస్తామని, వారి గెలుపు కోసం ప్రచారం చేస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆశించిన అభ్యర్థులకు తమ పార్టీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గండ్రత్ సంతోష్, కోశాధికారి పడకంటి సూర్యకాంత్, బొమ్మకంటి బాలాజీ పాల్గొన్నారు
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి:మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి మనోహర్
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్మ ఈడీ మనోహర్ అన్నారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మండల అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గ్రామ అభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఉత్తమ అధికారిగా రిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సిరాజొద్దీన్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన వేడుకలలో ఆయా ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ఉత్తమ అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిరాజొద్దీన్ సోమవారం 77 వ ఘనతంత్ర దినోత్సవ సందర్బంగా ప్రశంసా పత్రాన్ని అందుకోగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ తోపాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందించినందుకు ఎవరు సందర్బంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
చిత్రం న్యూస్, బేల: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బేల పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సామూహిక సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మండల కేంద్రంలోని 13 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని నృత్య ప్రదర్శన, స్కిట్లతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న, ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, వార్డు సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ భగవాండ్లు, వివిధ పార్టీల నేతలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి
చిత్రం న్యూస్ సాత్నాల: పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి ఉంటుందని ప్రముఖ వైద్యుడు ఎండీ జనరల్ మెడిసిన్, రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కళ్లెం వెంకట్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం కాన్ఫ మేడిగూడ (ఆర్) పాఠశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తన జన్మదినం సందర్బంగా మేడిగూడ పాఠశాలను దత్తత తీసుకొని వంద మంది విద్యార్థులకు ఉచితంగా షూలు పంపిణీ చేశామన్నారు. భవిష్యత్తులో ఏది అవసరమైన తాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు. డా.కళ్లెం వెంకట్ రెడ్డిని సర్పంచ్ పర్చకీ లక్ష్మీబాయి, వీడీసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, స్కూల్ హెచ్ ఎం ప్రకాష్ యాదవ్ సన్మానం చేశారు.
సాత్నాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాదవ్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ సాయిరాం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రంలో కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్ర రాజు, జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్ రావు, సతీష్, సుమన్, మూర్తి మాంగుర్ల గ్రామ సర్పంచ్ ఆడ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

మరోపక్క బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన గావించారు. బీజేపీ నాయకులు పోతురాజు రమేష్, అస్తక్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రం అవార్డు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీ సేవ కేంద్రం అవార్డును సోమవారం అందజేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన ఆధార్, ధ్రువపత్రాల సేవలు అందుంచినందుకుగాను జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రంగా అవార్డును అందజేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా మీసేవ నిర్వాహకుడు గడుగు సురేందర్ కు ప్రశంసా పత్రం అంజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఈడీఎం బండి రవి తదితరులు ఉన్నారు.
లోక ప్రవీణ్ రెడ్డి కి మెమొంటో అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో న్యాయవాదులకు ఇటీవల నిర్వహించిన షటిల్, బాడ్మింటన్, క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డికి సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్, ఇతర న్యాయవాదులు తదితరులు ఉన్నారు.










