Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 91

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

0

చిత్రం న్యూస్, ఇచ్చోడ;

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

_పీ హెచ్ సీ వైద్యాధికారి హిమబిందు

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ పీ హెచ్ సీ వైద్యాధికారి డా హిమబిందు అన్నారు. మండలంలోని సిరిచెల్మ గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేడిగొండ (జి) గ్రామంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మంది బాలింతలు, గర్భవతులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గర్భిణులు, బాలింతలు సీజనల్ వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బాలింతలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక చేయూత 

0

*రూ.5వేలు ఆర్థిక సాయం అందజేసిన అడా నేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మొహబ్బత్ పూర్ గ్రామానికి చెందిన సందీప్ ఠాక్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో  అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్ రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే ద్వారా బాధితుడి పరిస్థితి తెలుసుకున్న సతీష్ పవార్ బుధవారం గ్రామానికి వెళ్లి బాధితుడికి నగదును అందజేశారు .ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపదలో ఉన్నా వాళ్ళని ఆదుకున్నందుకు సతీష్ పవార్ కు విపిన్ ఖోడే ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్న ఓల్లప్ వార్, మాస్కే తేజరావు, గ్రామ మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే, విశ్వనాథ్ ఠాక్రే మరియు గ్రామస్థులు ఉన్నారు.

విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి

0

విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి 

*నేరడిగొండ మండలం లింగట్లలో విషాదం

చిత్రం న్యూస్, నేరడిగొండ (ఇచ్చోడ): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన యువరైతు సాబ్లే సుభాష్ తన వ్యవసాయ భూమిలో పత్తి పంటకు కలుపు తీస్తున్న సమయంలో అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలింది. ప్రమాదవశాత్తు అక్కడికక్కడే  మృతిచెందాడు. గత కొన్ని నెలల నుండి విద్యుత్ తీగ వేలాడుతున్న విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

కాలభైరవ స్వామి పంచామృతాభిషేకంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

0

కాలభైరవ స్వామి పంచామృతాభిషేకంలో  పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం శివాలయంలో ఉన్న కాలభైరవ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ పంచామృతాభిషేకం కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ,  మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, బడుగు శ్రీకాంత్,కుమారస్వామి, దుర్గా ప్రసాద్ తెలుగుదేశం నాయకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిడమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప

0

 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా జిల్లా పెద్దాపురం  మరిడమ్మ అమ్మవారి జాతరను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ముప్పై ఏడు రోజుల పాటు జరగనున్న  ఈ జాతరకుఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు అధికంగా భక్తులు తరలివస్తారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తిచేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, ఆలయ ఈవో విజయలక్ష్మి ఉన్నారు.

చిన్నారిపై దాడి అమానుషం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

0

 

చిత్రం న్యూస్, నెల్లూరు: నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం ఎస్టీ కాలనీకి చెందిన చిన్నారి చెంచమ్మను సర్వేపల్లి శానసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సెల్ ఫోన్ విషయంలో చిన్నారిపై గరిటె కాల్చి ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టడం దుర్మార్గమన్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చెంచమ్మకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. చెంచమ్మపై అమానుషానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టీడీపీతోనే బీసీల ఆత్మ గౌరవం పెంపు

0

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితని సన్మానిస్తున్న దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు

చిత్రం న్యూస్, అమరావతి: వెనుబడిన తరగతుల ఆత్మగౌరవం పెంపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలు గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగింపు హర్షం వ్యక్తంచేస్తూ.. మంత్రి సవితకు దాసరి సామాజిక వర్గీయులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కలిశారు. ఇటీవల బీసీ-ఏ కేటగిరిలోని దాసరి సామాజిక వర్గానికి జారీచేసే కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బీసీ-ఏ కేటగిరిలో ఉన్న దాసరి కులస్తుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా కుల ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు చేశామన్నారు. దాసరి పక్కన బ్రాకెట్లో భిక్షాటన చేసేవారు అనే పదాన్ని రాసేవారని, ఆ పదాన్ని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రి తెలిపారు. బీసీలు ఆత్మ గౌరవంతో జీవనం సాగించాలనేది సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025-26 బడ్జెట్ లో రూ.47 వేల కోట్లు నిధులు కేటాయించారన్నారు. కుల వృత్తులకు అండగా నిలుస్తూ, రూ.1000 కోట్లతో ఆదరణ మూడో విడత పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అంతకుముందు దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ, తమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, భిక్షాటన చేసేవారు అనే పదం కుల ధ్రువీకరణ పత్రాల్లో నుంచి తొలగించడంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి, సీఎం చంద్రబాబుకు తమ జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి సవితను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాసరి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పి.రవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు

0

పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో  ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం అభియాన్ ప్రముఖ్ గోరకపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహనరావు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్నయ దొర మాట్లాడుతూ ..శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమం నడిపారన్నారు. ఆయన “ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిశాన్, దో ప్రధాన్ నహీ చలేగా” అనే నినాదంతో కాశ్మీర్‌ను పూర్తిగా భారతదేశంలో విలీనం చేయాలని కోరారాన్నారు. 1953లో కాశ్మీర్‌లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ఆయనను అరెస్టు చేశారన్నారు. జూన్ 23, 1953న శ్రీనగర్ జైలులో ఆయన మరణించారన్నారు. అధికారికంగా గుండెపోటు కారణంగా మరణించినట్లు చెప్పబడినప్పటికీ, ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయని కొందరు ఆయన మరణాన్ని హత్యగా భావిస్తారని, ఈ అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉందని అన్నారు. ఈ రోజు భారతీయ జనసంఘ్ (ప్రస్తుత BJP), ఇతర సంస్థలు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయవాద ఆలోచనలను, కాశ్మీర్ ఏకీకరణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తారన్నారు. దేశవ్యాప్తంగా సభలు, స్మారక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించబడతాయని, ఆయన త్యాగం హిందూ జాతీయవాద భావజాలానికి, భారత ఏకత్వానికి ప్రేరణగా గుర్తించబడుతుందన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు, ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆయన కల నెరవేరినట్లుగా భావించబడిందదని. పేర్కొన్నారు. ఆయన బలిదాన్ దివస్ భారతదేశంలో జాతీయవాద భావనలను బలోపేతం చేయడానికి ఒక సందర్భంగా గుర్తించబడిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, దుర్గ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

0

జై బాపు ..జై భీం..జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో  మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆన్నారు.  హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన జై బాపు ..జై భీం..జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో  ఆయన మాట్లాడారు.9 రోజుల్లో 9వేలకోట్ల పైచిలుకు రైతు భరోసా కింద్ర రైతుల ఖాతాల్లో జమ చేశాం..మొత్తం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో పేదలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 16 న రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభించాం. 24 న పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి,, మంత్రులు అందరూ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ వద్ద నుండి రైతు వేదికల్లో ఉన్న రైతులకు సందేశం ఇస్తారన్నారు.ఈనెల 24 న మండల పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని సూచించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి

0

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్

చిత్రం న్యూస్,శంకరపట్నం :సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, రెండు పట్టణాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. హుజురాబాద్ మండలం -31, హుజురాబాద్ పట్టణం -18, జమ్మికుంట మండలం-22, జమ్మికుంట పట్టణం13, వీణవంక-39, ఇల్లందుకుంట -21, కమలాపూర్-54 పట్టణ మండలాలకు సంబంధించిన మొత్తం 198 మంది లబ్ధిదారులకు 75,67,000 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ క్కులను అందజేశారు.