Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 9

గిమ్మ సర్పంచ్ గాజుల సన్నీకి ఘనంగా సన్మానం

0

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ  సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ) ను  పదో వార్డు కాలనీవాసులు ఘనంగా సన్మానం చేశారు. సోమవారం కాలనీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా  సర్పంచ్ గాజుల సన్నీ,  ఉప సర్పంచ్ మంద అడెల్లు, వార్డు మెంబర్ హైమద్ తో పాటు వార్డ్ మెంబర్ అభ్యర్థి జర ప్రశాంత్ లను శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేశారు. సన్మానించిన వారిలో ఆవునూరు గణేష్, భావునే సంతోష్, కనిపెల్లి సాయి, కంచర్ల నాగరాజు గౌడ్, సిర్పూర్ బాపురావు, ఆటో భూమన్న, దశరథ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

 

కొనుగోలు చేయని సోయా పంటను ఇంటికి తీసుకెళ్ళిన రైతులు

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గత నలభై ఐదు రోజుల వరకు సోయా పంటను అమ్మడానికి మార్కెట్ యార్డ్ లో వేచి ఉన్న రైతులకు చివరికి ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలియజేయడంతో సోమవారం రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారు. మార్కెట్ సిబ్బంది రైతుల సోయా పంటను బార్ కోడ్ వారీగా తూకం చేసి వాపస్ ఇచ్చేస్తున్నారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ మోకాళ్ళ పైన కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, సినిమా ఇండస్ట్రీస్ సిబ్బంది ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే వారి జీతభత్యాలను పెంచుతారు కానీ రైతులు పండించిన పంటకు మద్దత్తు ధర కల్పించండి అంటే మాత్రం ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అప్పులు తీర్చడం కోసం, అదేవిధంగా ఇప్పుడు పంట పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అవసరం ఉండడంతో తమ పంటను ప్రైవేట్ కు విక్రయించాల్సిన సమయం వచ్చిందని  పంటను ఇంటికి  తీసుకెళుతున్నామన్నారు.

సాహితీవేత్తలు సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్ లకు జాతీయ పురస్కారాలు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బహుభాషా పండితులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్త, హిందీ పండితులు సుకుమార్ పెట్కులే,  బహుభాషా కోవిదుడు రిటైర్డ్  పోస్ట్ మాస్టర్, ప్రముఖ కవి ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన మధు బావలకర్ లకు సాహిత్య సామాజిక రంగాల్లో విశేష కృషి చేసినందుకు “భారతీయ సవిధాన్ సన్మాన గౌరవ పురస్కారం 2025” ఇరువురు సాహితీ వేత్తలకు తెలంగాణ నుండి అది కూడా అదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారికి లభించింది. ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భద్రావతి లో ఈ పురస్కారాలను కార్యక్రమ నిర్వాహకులు జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ , పూణే కి చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్, సంవిధాన్ సన్మానం గౌరవ సమితి ముఖ్య నిర్వాహకులు ఆనంద భగత్ లు అందజేశారు. పంచశీల కండువా, జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రము అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితివేత్త మధు బావల్కర్, సుకుమార్ పెట్కులే లు మాట్లాడుతూ.. సాహిత్య, సామాజిక రంగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఇదే స్ఫూర్తితో మును ముందు సాహితీ సేవ చేస్తూ సమాజ సేవలో బహుజన మహనీయుల బాటలో నడుస్తామని అన్నారు.

ఆదిలాబాద్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ  ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి, కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చౌక్ లో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశిష్ట స్థానాన్ని, త్యాగాలను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేయడం అన్యాయమని నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ ఆవిర్భావ దినోత్సవం మరింత ప్రత్యేకమైనదని, కార్యకర్తల శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.

రెడ్డి సర్పంచులు, ఉప సర్పంచులకు ఘనంగా సన్మానం

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా  గెలుపొందిన రెడ్డి బంధువులను రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రెడ్డి  హాస్టల్ వసతి గృహ ప్రాంగణంలో జిల్లాలోని మొత్తం 50 మంది రెడ్డి బంధువులు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారందరినీ శాలువా, మెమొంటోతో రెడ్డి బంధువులు  సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నల్ల నారాయణ రెడ్డి, గోపిడి రాం రెడ్డి, ఆర్థిక కార్యదర్శి ఎల్టి కిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూపతిరెడ్డి, ఆర్థిక కార్యదర్శి విఠల్ రెడ్డి, రెడ్డి యువజన విభాగం అధ్యక్షులు క్యాతం శివప్రసాద్ రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు గోపిడి సవీన్ రెడ్డి,  ఎల్మ సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా దిష్టి బొమ్మ  దగ్ధం

0

చిత్రం న్యూస్, బేల:  బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో  బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ చేపట్టి శివాజీ చౌక్ అంతర్జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా ధర్మ ప్రచార ప్రముఖ్ శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ పలు ఇతర దేశాలలో హిందువులపై పైౖశాచికంగా ఉన్మాది చర్యలకు పాల్పడడం హేయమన్నారు. బంగ్లాదేశ్ లో హిందూ యువకుడిని పెట్రోల్‌పోసి తగలబెట్టడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని ఐక్యంగా ఉంటూ ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్,బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు అగర్కార్ ఆకాష్ ,నాయకులు పొత్ రాజ్ నవీన్, రాము బర్కాడే, ప్రఫుల్, గేడం ప్రవీణ్, ఓం ప్రకాష్, తరుణ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు

సర్పంచ్ సన్మాన సభలో ఫొటోగ్రాఫర్ గా మారిన ఎంపీ నగేష్

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో  సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సర్పంచుల సన్మానం కొనసాగుతుండగా ఓ సర్పంచ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానిస్తుండగా  ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తన సర్పంచి కోసం ఫొటోగ్రాఫర్ గా మారారు. తన పార్టీ మద్దతుదారు సర్పంచి కోసం ఎంపీ స్వయంగా  ఫొటో తీయడంతో అక్కడికి వచ్చిన వారందరూ ఆయన్ను మెచ్చుకున్నారు.

ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వాగతం పలుకుతున్న లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు.  శుక్రవారం విమానాశ్రయ మైదానాన్ని, ఆదిలాబాద్ రిమ్స్ ఆవరణలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవన సముదాయాన్ని ప్రారంభించడానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆది భోజారెడ్డితో కలిసి ఆయన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.

 

బేలలో  రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయా వాపస్

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన సోయా పంటను ప్రభుత్వం నిరాకరించింది. నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరించారు. మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన రైతు సునీల్ రెడ్డితో పాటు ఇతర రైతుల సోయా మొత్తం 450 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. సొసైటీ అధికారులు మంచి నాణ్యత గల సోయాను కొనుగోలు చేసి మూడు లారీలో దాదాపుగా 220 క్వింటాళ్ల సోయాను లోడింగ్ చేసి జిల్లా కేంద్రానికి పంపించారు. పంట నాణ్యత సరిగా లేదంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరస్కరించారు. దీంతో  శుక్రవారం మూడు లారీల్లో దాదాపుగా 220 క్వింటాళ్ళ సోయా బస్తాలను తిరిగి బేల మార్కెట్ యార్డు కు పంపించారు. విషయం తెలుసుకున్న రైతులు మార్కెట్ యార్డ్ కి వచ్చి తమ పంటను చూసి నిరాశ చెందారు. ఈ సందర్బంగా రైతు మాట్లాడుతూ ప్రకృతి కారణంగా పంట నష్టం జరిగితే తామేమి చేయగలమని రైతు వాపోయాడు. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం దండగా అని,  ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తుల అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అని అంటున్నారు. కానీ రైతులని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తిరిగొచ్చిన సోయా పంటను తాము ఏమి చేయాలంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఆదిలాబాద్ లో డీసీసీ కార్యాలయం ప్రారంభం

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవితేజ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయాన్ని ఘనంగా  ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ డిసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్,  టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన, రైతు, కార్మిక, NSUI శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పార్టీ జెండాను ఎగురవేసి కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.