Home Blog Page 89

బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ 

0

 బైక్ ర్యాలీలో పాల్గొన్న సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి

చిత్రం న్యూస్, మునగాల:  కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మైలార్ శెట్టి నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయడం ప్రతి ఒక్కరికి గర్వకారణం అన్నారు. ఈ పతాకం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక. యువత, పిల్లలు, మహిళలు అందరూ దేశభక్తి భావంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మునగాల మండలంలో ప్రతి గ్రామం, ప్రతి వీధి, దేశభక్తి వాతావరణంతో మార్మోగాలని, అందరూ వారి వారి ఇండ్లపై జెండాలు ఎగురవేయడం ద్వారా మన జాతీయ ఐక్యతను మరింత బలపరచాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు భద్రం రాజు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పల్స రమేష్, బీజేపీ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, వెంకటేశ్ బాబు, కపిల్ రెడ్డి, రానబోతు శ్రీనివాసరెడ్డి, రెడ్డిపల్లి శృతి, దొంగరి జ్యోతి, తాళ్ల నరేందర్ రెడ్డి, వినోద్, మధు, గుండు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

దహిగావ్ లోలేవెల్ వంతెన పరిశీలించిన తహసీల్దార్

దహిగావ్ లోలేవెల్ వంతెనను పరిశీలిస్తున్న  బేల తహసీల్దార్ రఘునాథ్ రావు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహిగావ్ గ్రామాన్ని బేల  తహసీల్దార్  రఘునాథ్ రావు, ఎస్ఐ మహేందర్, పోలీసు సిబ్బంది బుధవారం సందర్శించారు.  రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు  సలహాలు సూచనలు చేశారు. దహిగావ్ గ్రామంలోని లోలెవల్ వంతెనపై  వరద నీరు పొంగిపొర్లడంతో  ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగకుండా రోడ్డును దిగ్బంధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి రెవెన్యూ,పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు. ఆర్ఐ సాజిద్ తదితరులు ఉన్నారు. ప్రజలేమైన ఇబ్బందులు ఏర్పడితే తమకు సమాచారం అందజేయాలని, సహాయక చర్యలు చేపడతామని సూచించారు.

✖ Close హోం

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు

0

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో నేరాల నియంత్రణకే సీసీ కెమెరా లను మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఆర్.రమేష్ అన్నారు. బుధువారం ముదోల్ మండల కేంద్రంలోని తానూర్ భైపాస్ రోడ్డు, హనుమాన్ మందిరం, భోగడ వాడకట్టులో ఏర్పాటు చేసిన 4 సీసీ కెమెరాలను ముధోల్ మండల కేంద్రం లోని ఆవరణలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు ఆర్. రమేష్ సంఘా సభ్యులతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆర్.రమేష్ మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. నేరాలు జరిగిన సందర్భంలో దర్యాప్తునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయన్నారు ఆర్.బాలాజీ, టి.ధర్మన్న, హంగీర్గ లక్ష్మణ్, వెంకటపూర్ పోతన్న, హంగీర్గ భోజన్న, టి.భూమన్న, బి.పోతన్న, కే.గంగాధర్, పీ.సాయిలు, టి.రాములు, ఇ.సురేష్, హెచ్.ఈరన్న, యు.సాయినాథ్, బి.గంగాధర్, పీ.పోశెట్టి, హెచ్.శంకర్, సీ.దత్తు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ

0

మాదకద్రవ్యాల నిరోధకంపై కళాశాలలో ప్రతిజ్ఞ 

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండల కేంద్రంలోని గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలంగా పేద ప్రజల కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయని ప్రిన్సిపాల్  కర్రోల్ల బుచ్చయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా మొదలైనటువంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు. గ్రామాలలో గంజాయి, క్లోరోహైడ్రేట్ గురించి అవగాహన కల్పిస్తూ అరికట్టడానికి కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విద్యార్థులు వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ సంధర్భంగా మాదక ద్రవ్యాల నిరోధకంపై అధ్యాపకులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, ఎన్ఎస్ఎస్ ఓం ప్రకాష్, లెక్చరర్లు పవన్ కుమార్ ,భీమ్ రావ్, రవి కుమార్,శంకర్, పీజీ రెడ్డి, సంతోష్ కుమార్, కల్పన, నహీదా, మజర్అబ్దుల్లా, సురేందర్, కిషన్, శ్రావణ్య, అర్షియ,రామ్మోహన్, ఉజ్మ సమరిన్, వాహిద్ ,ఇర్ఫాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

బోథ్ మండలంలో భారీ వర్షం

బోథ్ మండలంలో భారీ వర్షం

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని గ్రామాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. జిల్లా కలెక్టర్ ఈ మండలంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కరత్వాడ ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి పొంగిపొర్లుతూ ఆహ్లాదాన్ని పంచుతోంది. పొచ్చర జలపాతం వద్ద భారీగా వరదనీరు రావడంతో ప్రజలు జలపాతానికి వెళ్లరాదని,  భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్, పోలీసు, అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఇబ్బంది ఉంటే సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

✖ Close హోం

అతి భారీ వర్షాలు..72 గంటలు అలర్ట్‌గా ఉండాలి

0

అతి భారీ వర్షాలు..72 గంటలు అలర్ట్‌గా ఉండాలి

*ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

* వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో  మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పక్కన. ఎస్పీ జానకి షర్మిల

చిత్రం న్యూస్, నిర్మల్: రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రమాదకర వంతెనలు, రహదారుల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్ని శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేసి, కాజ్‌వేలు, చెరువుల వద్ద జాగ్రత్తలు, శిథిల భవనాల ఖాళీ, టామ్‌టామ్ ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. 24/7 కంట్రోల్ రూమ్ (91005 77132) ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఆలయ హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్‌     

0

ఆలయ హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్‌

చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోటి దేవుని ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భైంసా పోలీసులు తెలిపారు. సీఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం..కుంబి గ్రామానికి చెందిన నర్వడే దిగంబర్ (45) ఆగస్టు 11న భైంసా పట్టణం లోని కోతి దేవుడి ఆలయంలో చొరబడి అక్కడ ఉన్న హుండీ చోరీ చేశాడు. దీంతో పోలీసులు విచారణలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి గుర్తించారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

✖ Close హోం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

మాకోడ గ్రామంలో బోర్ వేసేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి 

చిత్రం న్యూస్, జైనథ్: గ్రామాల అభివృద్ధే లక్ష్యమని బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆదిలాబాద్ జిల్లా  జైనథ్ మండలం మాకోడ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.లక్షతో బోర్ వేశారు. గిరిజన ప్రాంతాలకు త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో బోర్ వేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జైనథ్ మండల ఉపాధ్యక్షులు కుంట వెంకట్ రెడ్డి, మాకోడ బూత్ కమిటీ అధ్యక్షులు అడ్డి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ పెద్దలు ఉషరెడ్డి,గంగరెడ్డి లింగన్న, భగవాన్ రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

బేలలో హర్ ఘర్ తిరంగా ప్రచారం

బేలలో జాతీయ జెండాలతో  యూత్ సభ్యులు

చిత్రం న్యూస్, బేల: హర్ ఘర్ తిరంగా ప్రతి పౌరుడిలో లోతైనా దేశభక్తిని రగిలిస్తోందని భాజపా ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాము బర్కడే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పాతబస్తీ, ఇంద్రనగర్, పలు కాలనీ వాసులతో కలిసి జాతీయ జెండాలను మంగళవారం పంపిణి చేశారు. ఆగష్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఖోడే సాయి, నివల్కర్ యోగేష్, నీపూంగె భైరవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

విద్యార్థులకు దుస్తులు, షూ ల పంపిణీ

0

విద్యార్థులకు దుస్తులు, షూ లను పంపిణీ చేస్తున్న హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతేఖాబ్ ఆలం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ దుస్తులు, షూ లను పంపిణీ చేసి ఉదారత చాటుకుంది. ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతేఖాబ్ ఆలం, ప్రధానోపాధ్యాయురాలు సిమ్రాన్ బేగంతో కలిసి వీటిని అందజేశారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా ఉందని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.  సంస్థ ఆధ్వర్యంలో ఒక విద్య వాలంటరీ నియమించామన్నారు జిల్లాలో చాలా వరకు ఉర్దూ మాద్యమ పాఠశాలలో ఉర్దూ బోధించడానికి ఉపాధ్యాయుల కొరతతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ భాను,కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

✖ Close హోం