Home Blog Page 88

బెల్లూరి గ్రామానికి బస్సు సౌకర్యం ప్రారంభం

0

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలంలోని బెల్లూరి గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది. రవాణా సౌకర్యాల మెరుగుదలే ధ్యేయంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ర్ శంకర్ సహకారంతో బెల్లూరి గ్రామానికి సోమవారం నుండి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం వల్ల ముఖ్యంగా పైచదువులకు వెళ్లే విద్యార్థులకు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే కూలీలకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బస్ సౌకర్యం కోసం సహకరించిన డిపో మేనేజర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సర్పంచ్ ,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జైనథ్‌లో రాస్తారోకో

0

చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని, బాన్సువాడలో చెలరేగిన అల్లర్లను నిరసిస్తూ సోమవారం బీజేపీ నాయకుల, కార్యకర్తలు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటకు పైగా బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిపై, ఆయన కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని, బాన్సువాడలో సామాన్యుల ఆస్తుల విధ్వంసానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపి పార్టీ అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ సంతోష్ యాదవ్, బీజేపీ నాయకులు వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు 

0
JADHAV RAJESH BABU
JADHAV RAJESH BABU

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలో పాల్గొన్న భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు

చిత్రం న్యూస్, ఖానాపూర్: బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బంజార సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బంజార నాయకులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బాసరలో గోదావరి నది తీరాన 45 రోజులపాటు దీక్షలో కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాసరలో 5 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది బాసరలో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా మంత్రి సీతక్క, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీ విధంగా బాసరలో 5 ఎకరాల భూమిని, గుడి నిర్మాణానికి రూ.5 కోట్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు.

వైభవంగా సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ విగ్రహాల ప్రతిష్టాపన

0

చిత్రం న్యూస్,బేల: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పిట్ గావ్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. హోమం, వేద మంత్రోచ్ఛరణల నడుమ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన బంజారాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. బంజారాల మండల అధ్యక్షులు జాదవ్ విలాస్ మాట్లాడుతూ.. గ్రామస్థులందరి సహాయ సహకారంతో రూ.40 లక్షలతో మందిరం నిర్మించుకున్నామన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరికి భక్తి అవసరమని ఆయన సూచించారు.శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆశీస్సులు తమ గ్రామం పై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరారు. అనంతరంఏర్పాటు చేసిన మహా అన్నదానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

దీపాయిగూడలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని, స్థానిక యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.ఈ వేడుకల్లో భాగంగా దీపాయిగూడలోని చిన్నారులు కాషాయ కండువాలు ధరించి, “జై భవాని.. జై శివాజీ” అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ చూపిన ధైర్యం, దేశభక్తి, ఆయన పరిపాలన దక్షతను చిన్నారులకు వివరించారు. హిందూ ధర్మ రక్షణ కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.గ్రామంలో కాషాయ జెండాలతో అలంకరించి, పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్బంగా గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..చిన్నతనం నుండే పిల్లల్లో దేశభక్తిని, వీరత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ: చిలుకూరి జ్యోతి రెడ్డి 

0
CHILUKURI JYOTHI REDDY
CHILUKURI JYOTHI REDDY

ఆదిలాబాద్, చిత్రం న్యూస్: భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేస్తుందని, పదవుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ నాయకురాలు చిలుకూరి జ్యోతి స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ..ఆదిలాబాద్ మున్సిపాలిటీ పీఠం అనూహ్య పరిణామాల మధ్య చేజారిపోవడం పట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆమె పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం బీజేపీకి మున్సిపల్ పీఠం దక్కాలని ఆశించిన వారు ప్రస్తుతం బాధలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో డబ్బులకు అమ్ముడుపోయే సంస్కృతి లేదని జ్యోతి రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. “డబ్బుకు ఆశపడి సిద్ధాంతాలను వదులుకునే వారు మా పార్టీలో లేరు. కేవలం నమ్మిన ఆశయాల కోసం, ప్రజా సేవ కోసం నిరంతరం శ్రమించే నిబద్ధత గల కార్యకర్తలే బీజేపీ బలగం” అని ఆమె కొనియాడారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్  అడుగుజాడల్లో నడవాలి 

0
Boranchu sreekanth reddy
Boranchu sreekanth reddy

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సుంకిడి లో ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి డప్పు చప్పుళ్ల నడుమ వైభవంగా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా శివాజీ మహారాజ్ నిలిచిపోయారన్నారు. శివాజీ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడని,స్వరాజ్య స్థాపనకు పునాది వేసిన గొప్ప యోధుడని కొనియాడారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా ఆయన చరిత్రలో నవతరానికి ఒక స్ఫూర్తిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత ముందుకు వెళుతూ,వారి ఆదర్శాలను అనుసరించాలని, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్, ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష

0
MLA PAYAL SHANKAR
MLA PAYAL SHANKAR

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (IAS) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్,  ఇండస్ట్రియల్ పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా (IAS) తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అధికారులు ప్రాజెక్టులకు సంబంధించిన తాజా నివేదికలను సమర్పించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక అంశాలపై చర్చించారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రైతుల భూముల సేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే అంశాన్ని కలెక్టర్ వివరించారు. రైతులకు నష్టం కలగకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన ఇండస్ట్రియల్ పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రం మారిపోతుందని అభిప్రాయపడ్డారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని, తద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

 

ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుపేద ఖైదీలు డిఫెన్స్ కౌన్సిల్ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్ అన్నారు.శనివారం జిల్లా జైలును జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో సందర్శించారు. న్యాయాన్ని పొందే విధానాన్ని ఖైదీలకు వివరించారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఉమేష్ రావు డోలె, రూపేష్, డిప్యూటీ జైలర్ ప్రకాష్ ఉన్నారు.

34వ వార్డు కౌన్సిలర్ గా గోక దేవారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

0
Tummala venkat reddy
Tummala venkat reddy

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గోక దేవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యులు తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి కోరారు. శనివారం శాంతినగర్, గందేవార్ తోట, వెంకట్రావు కాలనీలో  ముమ్మర చేపట్టారు. గోక దేవరెడ్డి, తుమ్మల వెంకట రెడ్డి, అప్సర్ , అజ్గర్, నజీర్, జగదీష్ రెడ్డి, వామన్ రెడ్డి, అఖిల్,సునీల్ రెడ్డి,వెంకట్ రెడ్డి, గంగాధర్, సాంబశివ, గోక రజిత, వెంకటమ్మ, వీణ, తరంగిణి, సునంద, సుశీల, లక్ష్మితో పాటు కాలనీ మహిళలు స్వచ్ఛందంగా ఇంటి ఇంటికే వెళ్ళి ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, వార్డు అభివృద్ధి జరగాలంటే చేయి గుర్తుకు ఓటువేసి గోక దేవా రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఓటు అభ్యర్తించారు.

 

[