Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 87

ఘనంగా సెయింట్ థామస్ జన్మదిన వేడుకలు

0

*ఆటపాటలతో అలరించిన విద్యార్థులు

చిత్రం న్యూస్, జమ్మికుంట: సెయింట్ థామస్ పాఠశాలలో థామస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండ్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెయింట్ థామస్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు


.

ఎస్టీ హాస్టల్ లో  నాణ్యమైన భోజనం అందించాలి

0

ఎస్టీ హాస్టల్ లో  విద్యార్థులతో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ బోథ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్ 

చిత్రం న్యూస్,బోథ్:  విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు రావడం చాలా బాధాకరమని, నాణ్యమైన భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ బోథ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్  అన్నారు. బుధవారం బోథ్ ఎస్టీ హాస్టల్ ను సందర్శించారు.  ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నీళ్ల పప్పు పెట్టడం ,అన్నము సుద్ద సుద్దగా ఉడకడం ఈ విషయాన్ని ఓ విద్యార్థి హాస్టల్ ఇంచార్జిని ప్రశ్నించగా, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గల అధికారి ఆయనకు టీసీ ఇస్తానని బెదిరించడం శోచనీయమన్నారు.  ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) బోథ్ యూనిట్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యార్థులు తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలన్నది ప్రాథమిక హక్కు. విద్యార్థులను భయపెట్టడం, టీసీ ఇస్తానని బెదిరించడం పూర్తిగా అన్యాయమైనదన్నారు. ఎస్టీ హాస్టల్ లో భోజన నాణ్యతపై తక్షణమే విచారణ జరపాలన్నారు. విద్యార్థిని బెదిరించిన హాస్టల్ ఇంచార్జ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత  ఉన్నతాధికారులు వారంలోగా చర్యలు తీసుకోకపోతే, AISF ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, హెచ్చరించారు. ఎల్ .నరేష్. శ్రీకాంత్, నితీష్ పాల్గొన్నారు

మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు కొలతలు చేపట్టిన అధికారులు

0

మార్కెట్ చీఫ్ ఇంజినీర్ గణేష్ ను సన్మానిస్తున్న మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సెక్రటరీ విఠల్

చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ అధికారులతో కలిసి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ.  మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం రూ. 3.72 కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే పంపిన ప్రతిపాదనలను గురువారం మార్కెట్ యార్డ్ ను సందర్శించిన మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ కొలతలు చేపట్టిపరిశీలించారాన్నారు. అనంతరం మార్కెటింగ్ చీఫ్ ఇంజనీర్ గణేష్ ను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,  వ్యవసాయ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ సెక్రటరీ విఠల్ తదితరులు ఉన్నారు.

పెద్దాపురం మరిడమ్మ దర్శనానికి స్పెషల్ బస్సులు

0

బస్సు డ్రైవర్ కు ప్రసాదం అందజేస్తున్న ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిణి కే. విజయలక్ష్మి 

చిత్రం న్యూస్, పెద్దాపురం: మొట్ట మొదటి సారిగా మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తుల సౌకర్యం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ స్పెషల్ బస్సలను ఏర్పాటు చేసింది. బుధవారం తుని బస్ డిపో నుండి పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి భక్తులతో స్పెషల్ బస్ వచ్చింది. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిణి కే. విజయలక్ష్మి బస్సు డ్రైవర్ కి ప్రసాదం, భక్తులకు శ్రీ అమ్మవారి ఫోటోలను అందజేశారు. ఇతర సిబ్బంది పాల్గొన్నారు

బేల మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎక్కడ..?

0

బేలలో మాట్లాడుతున్న రెడ్డికా యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మాడవార్ హరీశ్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: బేల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ వ్యాపారులు డీఏపీ, యూరియా కొరత చూపెట్టి రైతులకు ముప్పతిప్పలు పెడుతున్నరన్నారని రెడ్డిక యువజన మండల సంఘం ప్రధాన కార్యదర్శి మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. బేలలో  రైతులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా.. ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున మండల వ్యవసాయ అధికారి  సాయి తేజ రెడ్డి మండలంలో ఎక్కడ కూడా డీఏపీ, యూరియా కొరత లేదని విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి చెప్పారన్నారు. మండల కేంద్రంలో ఫర్టిలైజర్ వ్యాపారస్తులు మాత్రం డీఏపీ మరియు యూరియా కొరత చూపెట్టి రైతులకు ముప్పతిప్పలు పెడుతున్నారని. అన్నారు. ఓ పక్క అధికారులు ఎరువుల కొరత లేదని ఇటు వ్యాపారస్తులు కొరత ఉందని అనడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుందన్నారు. వ్యాపారస్థులకు దగ్గర ఉన్న రైతులకు లింక్ పేరు మీద ఎరువులు అమ్ముతున్నారని వాపోయారు. వెంటనే టాస్క్ ఫోర్స్ కమిటీ అయినా మండల తహసీల్దార్, ఎస్ఐ, వ్యవసాయ అధికారీ తనిఖీలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలనీ కోరారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఎరువులు ఇవ్వాలని లేని యెడల రైతులతో కలిసి దర్నలు చేపడతామణి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాడావార్ హరీష్, నిక్కందత్త, ఆకాష్ ఆగార్కర్  తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

0

సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న పద్మశాలి సంఘం నేతలు

చిత్రం న్యూస్, బోథ్: పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33కోట్లు విడుదల చేయడంతో  ఆ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. చేనేత రంగం హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్స్, ఎక్స్పోర్ట్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని నేతన్నల వెంట మేమున్నామని సీఎం  భరోసా ఇవ్వడంతో చేనేత పద్మశాలీలమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేర్గు భోజన్న,గౌరవ అధ్యక్షులు గంగుల మల్లేష్, వడ్లకొండ సురేందర్, సిరిపురం చంద్రమోహన్, కొండా స్వామి, ఆడెపు కిరణ్ కుమార్, తౌటు మల్లేష్, కడేరుగుల గోవర్ధన్, తాళ్ల బుచ్చన్న, వడ్లకొండ శ్రీనివాస్, జక్కుల మురళి, మార్కండేయ, కడేరుకుల శేఖర్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు,

చౌక ధరల దుకాణాలలో రాయితీపై నిత్యావసర సరకులు ఇవ్వాలి

0

బోథ్ లో తహసీల్దార్ సుభాష్ చంద్ర కు వినతిపత్రం అందజేస్తున్న నేతలు

చిత్రం న్యూస్, బోథ్: చౌక ధరల దుకాణాలలో ప్రభుత్వం రాయితీపై నిత్యావసర సరకులు ఇవ్వాలని ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ అన్నారు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాలలో బియ్యం మాత్రమే ఇవ్వడంతో నిత్యావసర సరకుల కోసం పేద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. సంపాదనంతా నిత్యావసర సరకులు కొనుగోలు చేయటానికి సరిపోవటంతో పేద ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారని, రాయితీపై నూనె, చక్కెర, గోధుమ పిండి, జొన్నలు, పప్పు దినుసులు తదితర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వమే ప్రజలకు పంపిణీ చేయాలని తహసీల్దార్ సుభాష్ చంద్రకు వినతి పత్రం ఆందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ డైరెక్టర్ వెంకటరమణ గౌడ్, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు భీమ బుచ్చన్న ,మాజీ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భీంరావు, బండారి యానప్ప,  బీరం పోశెట్టి, కుమ్మరి భోజన్న  తదితరులు పాల్గొన్నారు.

పట్టా రద్దు చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు

0

చిత్రం న్యూస్, శంకరపట్నం: అక్షరాస్యత లేని తమకు మోసపూరితంగా భూమిని పట్టా చేసుకున్నారని సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి శాంతమ్మ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శాంతమ్మ మంగళవారం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది.  శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి పుల్లారెడ్డి-శాంతమ్మ కు సంతానం లేక పోవడంతో దగ్గరి బంధువైన గూడెపు సంతోష్ రెడ్డి తండ్రి వీరారెడ్డిలు జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారన్నారు. దీంతో బ్యాంకులో రుణం తీసుకునేందుకు మార్టిగేజ్ చేసుకుంటానని నమ్మబలికించి ఇద్దరికీ చెందిన భూములు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం పుల్లారెడ్డి మరణించగా ఒంటరిగా ఉంటున్న శాంతమ్మ ఆలనా పాలన చూసుకోకుండా భార్య భర్తల పేరిట ఉన్న 7 ఎకరాల భూమిని సంతోష్ రెడ్డి అనే వ్యక్తి పేరిట పట్టా చేయించుకున్నాడు.  చదువురాని తనకు అక్షరాలు వచ్చినట్లు దొంగతనంగా పట్టా మార్పిడిలో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. మోసపూరితంగా అక్రమంగా సంతోష్ రెడ్డి చేసుకున్న పట్టాను రద్దు చేసి తన పేరిట పట్టా అమలు పరచాలని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో శాంతమ్మ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల‌లో క‌మ‌లం బ‌లం చూపిస్తాం

0

*స్థానిక సంస్థ‌లే తొలి టార్గెట్ 

*ఉమ్మ‌డి ఏపీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్స్ ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు గొర‌క‌పూడి చిన్న‌య్య దొర

చిత్రం న్యూస్, సామర్లకోట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ బ‌లాన్ని చూపిస్తామ‌ని ఉమ్మ‌డి ఏపీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్స్ ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు గొర‌క‌పూడి చిన్న‌య్య దొర అన్నారు. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక‌యిన పి.వి.ఎన్. మాధవ్ ని విజ‌య‌వాడ‌లో మంగ‌ళ‌వారం చిన్న‌య్య‌దొర అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో అధికారంలోకి రాగల శక్తి బీజేపీకి ఉంద‌ని, అయినా ఏపీలో బీజేపీ జెండా, కూటమి అజెండాతో ముందుకెళ్తామ‌ని అన్నారు. ముఖ్యంగా తాము తెలంగాణాలో తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని చిన్న‌య్య‌దొర చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక‌యిన మాధవ్ తో క‌లిసి తాము త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తామ‌న్నారు. ముఖ్యంగా తాము న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల స్థాయిలో బీజేపీ స్వ‌యంగా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లలో విజ‌యం సాధించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని చిన్న‌య్య దొర తెలిపారు.

వేదం  పాఠశాలలో ఘనంగా జాతీయ వైద్య దినోత్సవం

0

వేదం  పాఠశాలలో ఘనంగా జాతీయ వైద్య దినోత్సవం

చిత్రం న్యూస్, బోథ్:  వేదం పాఠశాలలో జాతీయ వైద్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్  వైద్యులు చేసే సేవల గురించి వివరించారు. పిల్లలు వైద్యుల వేష ధారణ ధరించి వైద్యం అందించే విధానాన్ని ప్రదర్శించారు.  విద్యార్థులు డాక్టర్స్ సేవల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. 24 గంటలు వారు సేవలో నిమగ్నం అవుతారని కొనియాడారు . తరువాత విద్యార్థులు బోథ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాణ లకు వెళ్ళి వైద్యులకు పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.