చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని అధికారులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 వ సంవత్సరపు డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. అధికారులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం పట్ల టీజీవో నాయకులను కలెక్టర్ అభినందించారు. అనంతరం అయన మాట్లాడుతూ జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మత్తుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శివకుమార్, రామారావు, సలహాదారులు రాజేందర్ దేశ్ పాండే,ఉపాధ్యక్షులు రాజేష్, వామన్ రావు, రజనీకాంత్, సంయుక్త కార్యదర్శులు అనిల్, నరేష్, మహేష్ ప్రచార కార్యదర్శులు సంతోష్, క్రీడల నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు సంతోష్, భగత్ రమేష్, సరోజ,నగేష్ రెడ్డి రమణాచారి పాల్గొన్నారు.
ఇంటి ముందర పార్కు చేసిన బైక్ చోరీ
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఉప్పుకుంటగల్లీలో ఆదివారం రాత్రి పల్సర్ బైక్ దొంగతనానికి గురి అయింది. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన పిల్లివార్ కిరణ్ ఇంటి ఆవరణ ముందు పల్సర్ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. సోమవారం వేకువజామున లేచి చూసేసరికి పల్సర్ బైక్ నెంబర్:TG18A9896 చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దొంగతనాల నివారణను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై నవనీత్ రెడ్డి గ్రామస్తులను కోరారు.
బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
చిత్రం న్యూస్, సిద్దిపేట : అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ద్యావర మల్లేశం కుటుంబానికి మహిపాల్ యాదవ్ 50 కిలోల బియ్యం అందజేసి ఉదారత చాటారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ సూచన మేరకు 3వ వార్డు సభ్యులు మహిపాల్ యాదవ్ బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు
చిత్రం న్యూస్, సిద్దిపేట: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు తోడ్పడుతుందని సిద్ధిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్ గ్రామంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ భద్రతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బొప్పాపూర్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటు జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ రాజేష్ భూంపల్లి, ఎస్‌ఐ హరీష్పా గౌడ్,.ఉప సర్పంచ్ కోనాపురం పద్మ, వార్డ్ సభ్యులు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్న ముంగర ఉమాదేవి
చిత్రం న్యూస్, కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలోని ” శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మ” జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం కళ్యాణ మహోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి చైర్ పర్సన్ ముంగర ఉమాదేవి శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకుని బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంగా ఉండాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని ఆమె తెలిపారు.
బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్’ అండ
రూ.34,780 ఆర్థిక సాయం అందజేస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ చైర్మన్ బద్దే నాయక్
చిత్రం న్యూస్, కళ్యాణదుర్గం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మరోసారి నిరూపించుకున్నారు.కంబదూరు మండలం పి.వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కరియప్ప అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కరియప్ప అనారోగ్యానికి గురైనప్పటి నుండి అనంతపురం పట్టణంలోని సన్ రే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించామని, ఆర్థిక భారం మితిమీరిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావాలంటే కట్టాల్సిన రూ.34,780 బకాయి చెల్లించలేని స్థితిలో వారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టును ఆశ్రయించారు.
స్పందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
కుటుంబ దీనస్థితిని గమనించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తక్షణమే స్పందించింది. ఆసుపత్రి యాజమాన్యం పేరు మీద రూ. 34,780 చెక్కును అందజేసి, బకాయిలను క్లియర్ చేయడమే కాకుండా కరియప్ప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయించి క్షేమంగా ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి, హరీష్, అబ్దుల్ వాహబ్, సభ్యులు తిప్పేస్వామి, మహేష్, రాము, ఓబులేష్, రామాంజినేయులు పాల్గొన్నారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కరియప్ప కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దిరాజు పెద్దమ్మ కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
చిత్రం న్యూస్, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం గంబీర్ పూర్ గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటయ్యను ముదిరాజ్ సంఘ కులస్తులు, అంబేద్కర్ సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ బాణాల శ్రీనివాస్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైసయ్య, లింగం,,మాజీ ఉపసర్పంచ్ బాలయ్య, పరుశరాములు,బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
స్మశానస్థలాలకు రక్షణ కల్పించండి
*ఎమ్మార్వో చేతుల మీదుగా స్మశానస్థలాల రక్షణ సాధన యాత్ర కరపత్రాలు విడుదల
చిత్రం న్యూస్, కల్యాణదుర్గం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్చి 5న స్మశాన స్థలాల రక్షణ సాధన యాత్ర కళ్యాణదుర్గం నుండి ప్రారంభించే కరపత్రాలను కుందుర్పి ఎమ్మార్వో చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చెలమప్ప మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ఆధ్వర్యంలో జరుగు యాత్రను విజయవంతం చేయడానికి భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలో ఉన్న స్మశానస్థలాలను రక్షించి ఆక్రమునకు గురైన స్థలాలను గుర్తించి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలమప్ప ఎమ్మార్వోకు జేఏసీ మండల కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ మండల ఇన్చార్జి మారుతి, తాలుకా జేఏసీ నాయకులు గంగాధర, అనుబంధ సంఘాల నాయకులు జాకీ నరసింహులు, రుద్రమని, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి అనురాగ్ రెడ్డిని అభినందించిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సైన్స్ డే పురస్కరించుకొని సాత్నాల మండలం మేడిగూడ గ్రామానికి చెందిన రిసోనెన్స్ స్కూల్ విద్యార్ధి క్యాతం అనురాగ్ రెడ్డి స్వహస్థాలతో తయారు చేసిన అగ్రికల్చర్ ఫీల్డ్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థితో మాట్లాడుతూ.ఉపయోగ విధంగా కరెంట్, డీజిల్ అవసరం లేకుండా రైతులకు ఉపయోగం ఉన్న వాటిని తయారు చేసే ప్రయత్నంచేయాలని సూచించారు .సెలవుల్లో మీ వ్యవసాయ భూముల్లో ఇలాంటి వాటిని ప్రయత్నం చేస్తూ సమాజానికి ఉపయోగపడే విదంగా ఉండాలని అనురాగ్ రెడ్డిని ప్రశంసించారు.
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చిత్రం న్యూస్, తొగుట: మండలంలోని జెప్తి లింగారెడ్డిపల్లె గ్రామంలో యెన్నం నాగవ్వ కిష్టారెడ్డి దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నాగవ్వ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదవాడికి ఇళ్లు అందించడమే మా ప్రజా పాలన లక్ష్యం అని, విడతలవారీగా నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చూడటమే నా కర్తవ్యం అని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్),మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, సర్పంచులు కనకయ్య, పాగల శోభా కొండల్ రెడ్డి,గొడుగు జయమ్మ నర్సింలు,ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిక్షపతి,చందా సత్తయ్య,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి,బుస నిరంజన్ రెడ్డి,పంది రాజు, బండారు రమేష్ గౌడ్,సోలిపేట ప్రసాద్ రెడ్డి,బక్కన్న గారి సంపత్ రెడ్డి, మహ్మద్ షఫీ,స్వామి గౌడ్,చందా రవి,బాలరాజు,తిరుమల్జ, ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.










