Home Blog Page 86

పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు

 పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులోని పెన్ గంగా నదిని రఘునాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, ఎగువలో ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్ట్ లో నీటిని విడుదల చేయడంతో ప్రవాహం పెరిగిందన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో పంట పొలాల్లో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో  ప్రజలు ఆత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చిన సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన బెదోడ, కాప్సి గ్రామాలను నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐ సాజిద్ ఖాన్, గ్రామ కార్యదర్శి వేణుగోపాలరావు, వీడీసీ అధ్యక్షుడు, భూపతి రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కదరపు ప్రవీణ్, సతీష్ గేడాం తదితరులున్నారు.

బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు

బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పీఏసీఎస్ గోదాములో యూరియా బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో ఎగువ నుండి వచ్చిన నీరు గోదాంలోకి అధికంగా వరద నీరు రావడంతో యూరియా బస్తాలు తడిసిపోయాయి. తడిసిన యూరియా బస్తాలని  కార్మికులు తీసే ప్రయత్నం చేశారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

0

సీఎం సహాయనిధి చెక్కు అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా మండలం లోకేశ్వరం నగర్ గ్రామానికి చెందిన సావిత్రి, సామ్రీన్ బేగం అనే లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను ( CM Relief Fund ) శనివారం అందజేశారు.ఆసుపత్రి  ఖర్చులకోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ముస్తాఫ్ సహకారంతో నగర్ గ్రామపంచాయతీ కి చెందిన సావిత్రికి రూ.30 వేలు, సామ్రీన్ బేగంకు రూ.26 వేలు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన చెక్కును బాధితులకు శనివారం మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ..సీఎం సహాయనిది పథకం పేదలకు వరం లాంటిదన్నారు. ఎమ్మెల్యే జీ.విఠల్ రెడ్డి,మాజీ ఉపా సర్పంచ్ ముస్తాఫ్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జన్మదిన వేడుకలు

టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అత్రం సుగుణక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సొనాల మండల కాంగ్రెస్ శ్రేణులు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ముద్దుబిడ్డ, అనునిత్యం ప్రజల కోసం ముందుండి హక్కులకై పోరాడే నాయకురాలు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క  జన్మదినం సందర్భంగా సొనాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గాజుల పోతన్న, రమేష్ బత్తుల మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి నుండి, నేడు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎదగడం చాలా గర్వకారణం అని, ఎన్నో ఆదివాసీ ఉద్యమాలు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెట్ల పెల్లి అనిల్,  మండల నాయకులు పాల్గొన్నారు.

తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు

తిలక్ నగర్ కాలనీలో జలమయమైన ఇళ్ళు

తిలక్ నగర్ కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు చేసి ఉదారత చాటిన సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోనితిలక్ నగర్ కాలనీవాసులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి భోజనాలు ఏర్పాటు చేయించారు. భారీ వర్షాల కారణంగా కాలనీలో ఇండ్లు నీట మునగడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న  ఆయన వెంటనే కాలనీకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి నుండి వర్షం కారణంగా శనివారం ఉదయం నుండి చాలా కుటుంబాలు వంట చేసుకోలేని పరిస్థితి ఉండడంతో వెంటనే దాదాపు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయించి ఉదారత చాటారు సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి.

రోడ్లు, కల్వర్టు నిర్మిస్తాం_బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ 

*పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

*కాలనీవాసుల ఇబ్బందులను తొలగించిన సామాజిక సేవకుడు చట్ల ఉమేష్

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాయి నగర్ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఇండ్లను, తెగిన కల్వర్టును ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సందర్శించారు. కాలనీవాసులకు ధైర్యం చెప్పి పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. త్వరలోనే రోడ్లు, కల్వర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ఉన్నారు.

బోథ్ లోని సాయినగర్ కాలనీలోని రాత్రి నుంచి అతి భారీ వర్షం కురుస్తున్న బ్రిడ్జ్ కొట్టుకుపోయి వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి చేరింది.  దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని సామాజిక సేవకుడు చట్ల ఉమేష్ దృష్టికి సాయి నగర్ యువత తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన అక్కడికి చేరుకొని  జేసీబీతో వరద నీరు ఇళ్లలోకి రాకుండా చేయించారు. రోడ్లపైన నిలిచిన వరద నీరు వెళ్లేందుకు దారి చేయించారు. కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

కుండపోత  వర్షం.. గ్రామాలు అతలాకుతలం

కుండపోత  వర్షం..గ్రామాలు అతలాకుతలం

*జలమయమైన రోడ్లు, నీట మునిగిన ఇళ్ళు, పంటలు, గ్రామాలకు నిలిచిన రాకపోకలు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి జైనథ్, భోరజ్ మండలాల్లోని గ్రామాలు అతలాకుతంగా మారాయి. జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలోని పలు ఇళ్ళు, పంట చేలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.  రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన కుంచపు గణేష్, ఓల్లేపు మారుతి, మంజుల రమేష్, భూతం భీమయ్య  ఇళ్ళ లో వరదనీరు చేరింది. ఇంట్లోని వస్తువులు, నిత్యవసర సరకులు తడిసిపోయాయి. ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వాపోయాయి.

భారీ వర్షంతో పత్తి, సోయా పంటలు నీట  మునిగిపోయాయి.  ప్రభుత్వం స్పందించి పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

దేశానికి వాజపేయి చేసిన సేవలు మరువలేనివి

0

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా:  భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..రహదారుల నిర్మాణంతో దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించి, ప్రజల గుండెల్లో గొప్ప నాయకుడిగా కీర్తి గడించిన దార్శనికుడు, మాజీ ప్రధాని అటల్ జీ అని కొనియాడారు. వారు దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు

0

వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు

చిత్రం న్యూస్, విజయవాడ: పింఛన్ దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ సమస్యలను 95523 00009 నంబర్‌కి “మన మిత్ర” ద్వారా  వాట్సాప్ లో మెసేజ్‌ ద్వారా పంపించే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. ఈ డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకి చేరతాయి.  తర్వాత జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDs) లాగిన్‌లో చూసి సమస్యను పరిష్కరిస్తారు. ఫిర్యాదు పరిష్కారం అయిన వెంటనే సంబంధిత నిర్ధారణ పత్రాలను తిరిగి సిస్టమ్‌లో అప్లోడ్ చేస్తారు. అవి మళ్లీ అభ్యర్థుల వాట్సాప్ లోకి వస్తాయి. దీంతో పింఛన్ దారులు తమ ఫిర్యాదు స్థితి, పరిష్కారం వివరాలు ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. అందువల్ల అధికారులు అన్ని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కొత్త డిజిటల్ సదుపాయంతో పారదర్శకత, వేగవంతమైన సేవలు, ప్రజలకు సౌకర్యం కలుగుతున్నాయి.

వరద నీటిలో ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల

వరద నీటిలో  మునిగిన ఇచ్చోడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ 

చిత్రం న్యూస్ బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఇచ్చోడ మండల కేంద్రంలో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వరద నీటితో మునిగింది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తక్షణమే పాఠశాలకు చేరి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. బోథ్ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరిస్థితులను తనకు అందజేయాలని సూచించారు. వీరి వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.