Home Blog Page 81

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

0

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

చిత్రం న్యూస్, భైంసా: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తౌసిఫ్ ఆధ్వర్యంలో వాలేగాం లో వైద్య శిబిరం నిర్వహించారు. 69 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ తౌసిఫ్ మాట్లాడుతూ.. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించి, వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగహన కల్పించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్న పల్లె దవాఖానాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని గ్రామ ప్రజలకు తెలిపారు. వైద్య శిబిరములలో అసంక్రిమిత వ్యాధులు అనగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీఎచ్ఓ వంశీ, డాక్టర్  హెచ్ ఈవో అబ్దుల్ సలీమ్, డాక్టర్ విజయ్ కుమార్,ఏఎన్ఎంలు లక్ష్మి,మంజుల, గ్రామ కార్యదర్శి పోతన్న, స్వయం సహకార సీసీ లక్ష్మణ్,గ్రామ సమైక్య విఓఏ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, ప్రజలు తదితరులు ఉన్నారు.

గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ధి

పనులు జాతర కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న జిల్లా పంచాయితీ అధికారి రమేష్ 

చిత్రం న్యూస్, జైనథ్: గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా పంచాయతీ అధికారి రమేష్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర – 2025 భాగంగా జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా పంచాయతీ అధికారి రమేష్ భూమిపూజ చేసి ప్రారంభించారు. అంతకు ముందు గత సంవత్సరం ఉపాధి హామీ పథకం ద్వారా ద్ నిర్మించిన నడాఫ్ కమ్ షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చాలా అభివృద్ది పనులు జరగుతున్నయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులు, ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భగా 100 రోజులు ఉపాధి హామి పని దినాలు పూర్తి చేసిన కూలీలను, గ్రామ పంచాయతి కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల ఎంపీడీవో మహేష్ కుమార్, ఏపీవో సుభాషిణి, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్తులు పెంచల ఉశన్న,సోమ రాంరెడ్డి, ఎండ్ర వాకేశ్,సింగిరెడ్డి రాంరెడ్డి, రాజన్న, ప్రవీణ్ రెడ్డి, పూర్ణచందర్ రెడ్డి, రాకేష్, చిన్నరెడ్డి రాములు, ఆశన్న పాల్గొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  భూమిపూజ

ఇస్పూర్ లో భూమిపూజ  చేస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ:  రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల జాతరలో భాగంగా నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ గ్రామంలో నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ భవనం , క్యాటిల్ షెడ్ నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను గ్రామస్తులు సన్మానించారు. 100 రోజుల పని పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వాంకిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని దీనిని మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేశారని అన్నారు. పనుల జాతరలో పాత పనుల ప్రారంభోత్సవాలే ఉన్నాయని కొత్త పనులు మంజూరు చేసి కార్యక్రమం పెడితే బాగుండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో   మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు శివారెడ్డి, రమేష్, నానక్ సింగ్, రాజు, సవాయిరాం, అనిల్ యాదవ్, రాథోడ్ సురేందర్, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గులాబ్, భారత్, వివిధ శాఖల అధికారులు  తదితరులు  పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం 

0

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం 

*ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

చిత్రం న్యూస్, కొత్తపేట: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ప్రతి సమస్యపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తాగునీరు, రోడ్లు, విద్యుత్, హౌసింగ్, పెన్షన్లు, రేషన్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రతి వినతిని వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ ప్రజా దర్బార్ లో 74 వినతులు వచ్చాయని ఎమ్మెల్యే బండారు తెలియజేశారు. వచ్చిన వినతులను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

0

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, కైకలూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కైకలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి కళామండపంలో   ప్రముఖ సినీ నటుడు, పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. కొణిదల చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కైకలూరు వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కామినేని గారు చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు,  నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహరావు గారు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే  అనిల్ జాదవ్ శుక్రవారం అందజేశారు. సొనాల మండలంలోని ఫుల్సింగ్ నాయక్ తాండ గ్రామానికి చెందిన కచివార్ శశికళకు మంజూరు అయిన రూ.20,500 ల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే  తన నివాసంలో బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. పేదవారు ఎవరైనా హాస్పిటల్ బిల్లు తీసుకుని తన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదానంద్, రాథోడ్ సజన్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, సకారం, వసంత్ తదితరులు ఉన్నారు.

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఉచిత మెకానిక్ శిక్షణ

0

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ

చిత్రం న్యూస్, నేరడిగొండ: మెకానిక్ రంగంలో ఆసక్తిగల యువత ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు ఉచితంగా అందించే ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ సర్వీస్ అసిస్టెంట్ కోర్సులో చేరాలని mentor రమణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ లోని కుప్టి, గాజలి, గాందారి యువకులకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఉచిత శిక్షణ ఇస్తున్నటువoటి అంశాలను వివరించారు. ఆసక్తి గల యువకులు ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాలని  ఆయన కోరారు. శిక్షణ సమయంలో భోజనం, హాస్టల్ వసతి ఉచితంగా అందిస్తామన్నారు. శిక్షణ హైదరాబాద్ లోని నాగోల్ లో ఉంటుందాని, కనీసం పదో తరగతి పాసై, 18 నుండి 30  ఏళ్లు  వయస్సు కలిగి ఉండాలన్నారు. కోర్సు వ్యవధి 45 రోజులు ఉంటుందని, మరిన్ని వివరాలకు 9959346423 నెంబర్ సంప్రదించాలన్నారు. హైదరాబాద్ శిక్షణ పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్ కూడా ఇవ్వబడుతుందని చెప్పారు.

 

 

యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం

యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని గుత్పాల గ్రామంలో యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం గురువారం ప్రారంభించారు. టైలరింగ్, శిక్షణ అనంతరం మహిళలకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం  అమోదం పొందిన సర్టిఫికెట్  ఇవ్వడం జరుగుతుందని ఇంఛార్జి సంధ్యారాణి తెలిపారు. 30% సబ్సిడీ పైన కుట్టు మిషన్ లు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీచర్ అర్జున్, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ,  టైలరింగ్ టీచర్ షాహిదా, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి

0

వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి

*తరోడ గ్రామంలో విషాద ఛాయలు

*కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే  రామారావు పటేల్

చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్  మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ అనే వైమానిక జవాన్ ఆగ్రాలోని దమ్మోహ వాటర్ ఫాల్ కు బుధవారం స్థానిక సహోద్యోగులతో వెళ్లారు. అక్కడే ప్రమాదవశాత్తుపడి మృతి గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు  జాలర్లతో వాటర్ ఫాల్ లో గాలించగా మృతదేహం గురువారం బయటపడింది. ఈ విషయం తెలియడంతో తన స్వగ్రామం తరోడ గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. దేశం కోసం వైమానిక దళంలో పనిచేసి ఇలా ప్రమాదవశాత్తు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తులు, తరోడ మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను కలవడంతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. కేంద్రమంత్రి స్పందించి సత్వర ఏర్పాటు చర్యలు ప్రారంభించారు.

ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి 

0

ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి

*రేపు భైంసాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాక

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సుర్ లోక్ గార్డెన్స్ లో 3 గంటలకు (SURLOK GARDENS) వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల సన్నాహక గర్జన సదస్సును శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) హాజరు కానున్నారు. ఈ సందర్బంగా వికలాంగులకు 6 వేలు వృద్ధులు, వితంతువలు, ఒంటరి మహిళలకు 4 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ  ఎంఎస్పీ అంబేకర్ సాయిచంద్ మాదిగ మాట్లాడారు. సమావేశం (SURLOK GARDENS) ఫంక్షన్ హాల్‌ భైంసా పట్టణం లో నిర్వహించనున్నారు. ఈ సభను ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని గురువారం ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నిర్మల్ ఇచ్చార్జ్ గాంధిమల నాగభూషణ్ మాదిగ,ఎమ్మార్పీఎస్, ఎమ్మేస్పీ జాతీయ నాయకుడు నందుకుమార్ మాదిగ, ఎమ్ఇ యఫ్ రాష్ట్ర ఉప అధ్యక్షులు గాయక్ గంగాధర్ మాదిగ,ఎమ్మార్పీఎస్,  ఎమ్మెస్పీ నిర్మల్ జిల్లా నాయకుడు దిగంబర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గోనెకర్ శంకర్, శేల్లె ఆనంద్ పాల్గొన్నారు.