చిత్రం న్యూస్, బాసర: నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి గల్లీ మున్నూరుకాపు సంఘం భవనము కమాన్ గాంధీ విగ్రహం వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరికి మంచి జరిగాలని, సుఖ శాంతులతో ఉండాలని, రైతులు పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నంతంగా ఎదగాలని, వ్యాపారులు వ్యాపార రంగంలో, నాయకులు రాజకీయంగా మంచి పదవులు అనుభవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అందరు ఇలాగే కలిసి మెలిసి అన్ని పండుగలు సంతోషంగా జరుపుకుంటూ మన గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పర్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు గడ్డం సుభాష్, పట్టణ అధ్యక్షులు లవన్ భాస్కర్, కార్యదర్శి గోసుల రాజు, VDC అధ్యక్షులు వరగంటి విట్టల్, కోశాధికారి జిందంవార్ వెంకటేష్, కార్యదర్శి ఆగాలం దశరథ్, మండల BJP అధ్యక్షులు కోరి పోతన్న, సంఘం మెంబర్లు V పోతన్న, H భోజన్న, P బాబు, B శంకర్, D శైలేష్ గార్లతో పాటు K రాజేశ్వర్ సార్, GP మెంబర్స్ S పోతన్న, M సతీష్, N విష్ణు, జానకిరామ్ లతోపాటు భాస్కర్ పోతన్న, IT గంగాధర్, Dr నర్సయ్య, A రాజు, S ప్రకాష్, B దేవన్న, R రాజన్న, E పండరి, K గంగాధర్, M ఎల్లయ్య, S అరవింద్, G ప్రసాద్, భోజన్న, M లింగం, పోశెట్టి, S నరేష్, P భూమేష్, K రాకేష్, G లక్ష్మణ్, దేవేందర్ గౌడ్ సార్, పోతాజీ సార్, M శంకర్, S యాదవ్, శంకర్ పటేల్, సాయినాథ్, S శ్యామ్, R బాలాజీ, నారాయణ, నడిపెన్నా, J చిన్ను, గార్లతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
చిత్రం న్యూస్, అదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పరాభావ నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నాయకులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మేలవింపే మన జీవితం అని ఈ నూతన సంవత్సరంలో రైతులకు మంచి పంటలు పండి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజలందరూ ఐక్యమత్యంతో ఈ పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగిల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సామ రూపేష్ రెడ్డి, కౌన్సిలర్లు చరణ్ గౌడ్, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, కాంబ్లె మంగేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ వేముల నాగరాజు, తొడసం దౌలత్ రావు, గౌలి సంజయ్, సేవాదళ్ జిల్లా సెక్రెటరీ అప్సర్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళులబ్ధిదారుడికి ప్యూర్ డెయిరీ ఛైర్మన్, అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ ఉదారత
చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కేఆర్కే కాలనీకి చెందిన వావలే సుశీల్ కు రూ.13,200 విలువగల విద్యుత్ సామాగ్రిని ప్యూర్ డెయిరీ ఛైర్మన్, అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ అందజేసి ఉదారత చాటారు. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం సుశీల్ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసింది. కాగా ప్యూర్ డెయిరీ ఛైర్మన్ అన్సార్ వద్ద పనిచేస్తున్న సుశీల్ కు విద్యుత్ సామాగ్రి కోసం ఆర్థిక సాయం అందజేయడంతో సుశీల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
వీధి కుక్కల దాడిలో 8 మేకలు మృతి
చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ కాలనీలో వీధి కుక్కల దాడిలో కురుమే జిన్నన్నకు చెందిన 8 మేకలు మృతి చెందాయి. గత కొన్ని నెలల క్రితం గ్రామస్తులపై దాడి చేయడం కూడా జరిగింది. ఇప్పటికైన అధికారులు, నాయకులు స్పందించి. వీది కుక్కల దాడుల నుండి పశువులను, ప్రజలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వీధి కు దాడిలో 8 మేకలు మృతి చెందడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని జిన్నన్న వేడుకుంటున్నారు.
భైంసాలో ఘనంగా ఇఫ్తార్ విందు: పాల్గొన్న: మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పాటిల్
చిత్రం న్యూస్, భైంసా : పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా భైంసా పట్టణంలోని నూర్ మజీద్ ప్రాంగణంలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..మనుషుల మధ్య సోదరభావం, మతాల మధ్య సామరస్యం తెలంగాణ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. ఈ విలువలను ప్రతి ఒక్కరూ కలిసి కాపాడుకోవాలని ఆకాంక్షించారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో అల్లా దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. పరమత సహనం, గంగా–జమున తహజీబ్ వంటి సంస్కృతులను గౌరవించడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. మైనారిటీ ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, పురపాలక సంఘం చైర్మన్ తుమ్ముల దత్తాత్రి, వైస్ చైర్మన్ మీర్జా ఇద్రిస్ బైగ్, మాజీ ఎంపీపీ, రామచంద్రారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే, బైంసా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్ అలీ, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, నాయకులు దేవిదాస్, రవి కుమార్, మైనారిటీ నాయకులు హాఫిజుల్లా, కౌన్సిలర్ అబూ షబ్బీర్, జఫర్ K&B, అల్మస్, ముఖిత్, షైక్ నుమాన్, జూనెద్, మొసీన్, మస్జీద్ సదర్ జబ్బార్, శైఫుద్దీన్ బాబా తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు
చిత్రం న్యూస్, భైంసా: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం మండల పరిషత్ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను హెచ్ఎం రాధిక వివరించారు. ఉగాది అనగా నూతన సంవత్సరానికి ఆరంభమని, ప్రకృతి మరియు కాల చక్రంలో చోటుచేసుకునే మార్పులను అనుసరించి ఈ పండుగను జరుపు కుంటామని పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు.ఉగాది పండుగలో ముఖ్యమైన ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దానిలోని పదార్థాలు జీవితంలోని ఆనందం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం వంటి అనుభవాలకు ప్రతీకలని చెప్పారు. అనంతరం విద్యార్థుల చేతనే ఉగాది పచ్చడిని తయారు చేయించి, అందరికీ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఉగాది పాటలు, భక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు చేసి అందరిని అలరించారు. చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
*విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
*అసెంబ్లీ లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
చిత్రం న్యూస్, ముథోల్: 2014వ సంవత్సరం నుండి బాసర ట్రిపుల్ ఐటీ లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ట్రిపుల్ ఐటీ సమస్యలపై మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ట్రిపుల్ ఐటీ విద్యార్థి తేజస్విని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందన్నారు. సరైన వైద్య సేవలు అందకపోవడం మూలంగానే ఒక నిండు ప్రాణం బలైంది అన్నారు. ట్రిపుల్ ఐటీ లో సమస్యలు రాజ్యమేలుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కొన్ని కంప్యూటర్లు మాత్రమే ఇచ్చారని, విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు లేకపోవడం వలన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నారన్నారు. పేర్లు మార్చి అదే మెస్ కాంట్రాక్టర్లు సంవత్సరాల తరబడి ఉంటున్నారని, నామినేషన్ పద్ధతిని తొలగించి టెండర్లు వేయాలన్నారు. ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, విద్యావంతులతో కూడిన ఒక కమిటీని వేయాలన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా లేదని, సమస్యలు అడిగితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని అధికారులు విద్యార్థులను బెదిరిస్తున్నారని అన్నారు అక్కడ ఉన్న బేకరీ యజమాని ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ అధిక ధరలకు అమ్మి విద్యార్థులను నిలువుగా దోచుకుంటున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.
28 ప్యాకేజీ కి నిధులు ఇవ్వండి:
ప్రాణహిత, చేవెళ్ల 28 ప్యాకేజీ పనులు పూర్తిఅయితే ముథోల్ నియోజకవర్గం లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అసెంబ్లీ లో కోరారు. కేవలం ఎకరానికి 75 వేలు మాత్రమే సాగునీటికి ఖర్చు అవుతున్నాయని తక్షణమే నిధులు ఇస్తే మా నియోజకవర్గం సస్యశామలం అవుతుందన్నారు. గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా 28 ప్యాకేజీ పూర్తి కాలేదని ఇప్పటి ప్రభుత్వం అయినా దృష్టి సారించాలని కోరారు.
కరెంటు సమస్య తీర్చండి
నియోజకవర్గం లో మొక్క జొన్న, వరి పంటలు అధికంగా సాగుచేస్తారని, ప్రస్తుతం విద్యుత్ సరఫరా లో అంతరాయం తో పంటలకు రైతులు నీరు అందించలేక పోతున్నారని, సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే అసెంబ్లీ లో కోరారు.. మరొక్క 33/ 11 కె. వి. సబ్ స్టేషన్ మంజూరు చేయాలన్నారు.
ఘనంగా సంత్ సేవాలాల్ దీక్ష వాసుల పాదయాత్ర
చిత్రం న్యూస్ ముథోల్ : విట్టోలి తాండాలోని జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ దీక్ష వాసులు పౌరదేవి వరకు పాదయాత్ర చేపట్టారు. బుదువారం ఉదయం ఆలయంలో హారతి తీసుకొని 7:30 గంటలకు పాదయాత్రకు తండా ఆడపడుచులు, యువతీ, యువకులు, పాటలు పాడుతూ సేవాలాల్ దీక్ష వాసులను విట్టోలితాండా నుంచి పౌరా దేవి వరకు ఘనంగా పాదయాత్రకు తండావాసులు తరలివచ్చారు. సేవాలాల్ దీక్ష వాసులు భక్తులు విట్టోలి తాండ నుండి దాదాపు 270 కిలోమీటర్ల పాదయాత్ర పౌరా దేవి వరకు దాదాపు 5 రోజులలో చేరుకుంటామని సేవాలాల్ దీక్ష వాసులు తెలిపారు. తదనంతరం మహోర్, రువ్విఘడ్ ఆలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా పౌరదేవితోపాటు వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తామని శివలాల్ దీక్ష వాసులు తెలిపారు.
ప్రముఖ సాహిత్య వేత్త మధు బావల్కర్‌కు మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పాటిల్ సత్కారం
చిత్రం న్యూస్, ముథోల్: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ,శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ సాహిత్య వేత్త, రచయిత మధు బావల్కర్ గారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధు బావల్కర్ సా హిత్య రంగంలో చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. సమాజానికి మంచి సందేశాలను అందించేలా ఆయన రచనలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి విలువైన రచనలతో సమాజానికి మార్గదర్శకత్వం అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే, మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి, చంద్రకాంత్ యాదవ్, నాయకులు శివాజీ, దేవిదాస్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మాయిలు పరిశోధన లో ముందు ఉండాలి: ప్రొ.అర్చనl
చిత్రం న్యూస్ బేల: ప్రస్తుత పరిస్థితిలో వృక్ష శాస్త్రంలో పరిశోధనలు చాలా అత్యవసరము అని అందులో అమ్మాయిలు మరింత ముందు ఉండాలని మహారాష్ట్ర లోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని కలంబ్ వృక్ష శాస్త్ర అధిపతి ప్రొ. అర్చన రాందాస్ ముకథేకర్ అన్నారు. ప్రొ .అర్చన ‘ఇండియన్ ఫోరమ్ ఆఫ్ సోషల్ లీడర్స్ ” తమిళనాడు నుండి ఉత్తమ మహిళ అధ్యాపకులు 2026 గా అవార్డ్ పొందిన సందర్భంగా తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజి విద్యార్థుతో వెబినార్ ద్వారా మాట్లాడి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ పుష్ప, కో ఆర్డినెటర్ సాగర్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.










