Home Blog Page 8

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

0

చిత్రం న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో NREGS నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎస్సీ కమిటీ హాల్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు జరిగే పనులను సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మాసాపురం ప్రశాంత్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైండ్ల అశోక్, ఎల్లేష్, నగేష్, కోరంపల్లి రాజమణి, గుంటి స్వప్న, రాణి, బాలమణి, బాలవికాస చైర్మన్ సిద్రమైన స్వామి, వైస్ చైర్మన్ మురళి, మాజీ ఉప సర్పంచ్, చల్మెడ నరసింహులు, వడ్ల శ్రీనివాస్, మంగలి శ్రీనివాస్, తలారి భాస్కర్, గుంటి అఖిల్, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

నిజాయతీని చాటుకున్న ఆలయ హోంగార్డ్స్  

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలుపోగొట్టుకున్న తన పర్సును ఆలయ హోంగార్డులు అందజేసి తమ నిజాయతీ చాటుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుజాత అనే భక్తురాలు ఆలయ ప్రాంగణంలో రూ.5 వేల నగదు ఉన్న చేతి పర్సును మర్చిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు వెంకటేష్,రాందాస్ కు దొరకడంతో ఆలయ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ సాయిలుకు అందజేసి తిరిగి భక్తురాలికి అందజేశారు. దీంతో తోటి భక్తులు హోంగార్డులను అభినందించారు.

పిప్రి లిఫ్ట్ కు మహర్దశ 

0

*నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

* రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ జీ.వో.విడుదల 

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముథోల్ నియోజకవర్గం సస్యశ్యామలం కావాలన్నది ఆయన కల. అందులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ లకు నిధులు, చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాలని పలు మార్లు అసెంబ్లీ లో ప్రస్థావించడం తో పాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలవడం, ముఖ్య మంత్రికి విన్నవించడంతో ఇక నియోజకవర్గానికి ఇరిగేషన్ లో నిధుల వరద ప్రారంభమైంది.. చెరువులు, లిఫ్ట్ ల పనులు ప్రారంభం కాగా పిప్రి లిఫ్ట్ కు రూ.77 కోట్ల నిధులు విడుదల చేస్తూ సర్కార్ జి. వో. విడుదల చేసింది.. పనులు పూర్తయితే లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగునీరు అందనుంది. జీ.వో. విడుదల పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఇంచార్జి మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని అధికారులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 వ సంవత్సరపు డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. అధికారులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం పట్ల టీజీవో నాయకులను కలెక్టర్ అభినందించారు. అనంతరం అయన మాట్లాడుతూ జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మత్తుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శివకుమార్, రామారావు, సలహాదారులు రాజేందర్ దేశ్ పాండే,ఉపాధ్యక్షులు రాజేష్, వామన్ రావు, రజనీకాంత్, సంయుక్త కార్యదర్శులు అనిల్, నరేష్, మహేష్ ప్రచార కార్యదర్శులు సంతోష్, క్రీడల నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు సంతోష్, భగత్ రమేష్, సరోజ,నగేష్ రెడ్డి రమణాచారి పాల్గొన్నారు.

ఇంటి ముందర పార్కు చేసిన బైక్ చోరీ  

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఉప్పుకుంటగల్లీలో ఆదివారం రాత్రి పల్సర్‌ బైక్‌ దొంగతనానికి గురి అయింది. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన పిల్లివార్ కిరణ్ ఇంటి ఆవరణ ముందు పల్సర్‌ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. సోమవారం వేకువజామున లేచి చూసేసరికి పల్సర్ బైక్ నెంబర్:TG18A9896 చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దొంగతనాల నివారణను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై నవనీత్ రెడ్డి గ్రామస్తులను కోరారు.

బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత 

0

చిత్రం న్యూస్, సిద్దిపేట : అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ద్యావర మల్లేశం కుటుంబానికి మహిపాల్ యాదవ్ 50 కిలోల బియ్యం అందజేసి ఉదారత చాటారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ సూచన మేరకు 3వ వార్డు సభ్యులు మహిపాల్ యాదవ్ బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు 

0

చిత్రం న్యూస్, సిద్దిపేట: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు తోడ్పడుతుందని సిద్ధిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్ గ్రామంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ భద్రతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బొప్పాపూర్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటు జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ రాజేష్ భూంపల్లి, ఎస్‌ఐ హరీష్పా గౌడ్,.ఉప సర్పంచ్ కోనాపురం పద్మ, వార్డ్ సభ్యులు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్న ముంగర ఉమాదేవి

0

చిత్రం న్యూస్, కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలోని ” శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మ” జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం కళ్యాణ మహోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి చైర్ పర్సన్ ముంగర ఉమాదేవి శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకుని బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంగా ఉండాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని ఆమె తెలిపారు.

బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడికి ‘ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్’ అండ

0

రూ.34,780 ఆర్థిక సాయం అందజేస్తున్న ఇన్ఫినిటీ చారిటబుల్ చైర్మన్ బద్దే నాయక్

చిత్రం న్యూస్, కళ్యాణదుర్గం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మరోసారి నిరూపించుకున్నారు.కంబదూరు మండలం పి.వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కరియప్ప అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.​ కరియప్ప అనారోగ్యానికి గురైనప్పటి నుండి అనంతపురం పట్టణంలోని సన్ రే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించామని, ఆర్థిక భారం మితిమీరిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావాలంటే కట్టాల్సిన రూ.34,780 బకాయి చెల్లించలేని స్థితిలో వారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టును ఆశ్రయించారు.

స్పందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్

​కుటుంబ దీనస్థితిని గమనించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తక్షణమే స్పందించింది. ఆసుపత్రి యాజమాన్యం పేరు మీద రూ. 34,780 చెక్కును అందజేసి, బకాయిలను క్లియర్ చేయడమే కాకుండా కరియప్ప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయించి క్షేమంగా ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో ​ట్రస్ట్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్, కార్యదర్శి, ​హరీష్, అబ్దుల్ వాహబ్, సభ్యులు తిప్పేస్వామి, మహేష్, రాము, ఓబులేష్, రామాంజినేయులు పాల్గొన్నారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు కరియప్ప కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.

పెద్దిరాజు పెద్దమ్మ కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య

0

చిత్రం న్యూస్, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం గంబీర్ పూర్ గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటయ్యను ముదిరాజ్ సంఘ కులస్తులు, అంబేద్కర్ సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ బాణాల శ్రీనివాస్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైసయ్య, లింగం,,మాజీ ఉపసర్పంచ్ బాలయ్య, పరుశరాములు,బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.