చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం దేవపూర్ మాజీ ఎంపీటీసీ శాగంటి రమేష్ శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా శాగంటి రమేష్ (మాజీ ఎంపిటీసీ) మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉంటూ జాగృతి బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయాలలో జాగృతి కీలకమైన పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీనా చారి, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు మేక లలిత యాదవ్, ఆదిలాబాద్ జిల్లా నాయకులు వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs నేతల రాస్తారోకో..
సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs నేతల రాస్తారోకో..
చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన సోయా పంటను ఎటువంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బేల, జైనథ్ మండలాల రైతులు BRS పార్టీ నాయకులు శుక్రవారం రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించనున్నారు. భోరజ్ నుండి బేల వెళ్లే 353బీ జాతీయ రహదారిపై మాకోడ, ఖాప్రి X రోడ్ వద్ద శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి ఈ ఆందోళన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బేల, జైనథ్ మండలాల రైతులు, BRS పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సోయా రైతులకు మద్దతుగా రాస్తారోకో చేపట్టనున్నారు. ప్రభుత్వం తక్షణమే సోయా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయనున్నారు.
మంగమఠం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఏక దశ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ మంగమఠం లో బుధవారం నూతన క్యాలెండర్ ను ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ భక్తులతో కలిసి ప్రారంభించారు.. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సంతోషాలతో విరజిల్లాలని దేవుణ్ణి కోరారు. సూర్యోదయానికి ముందే ఆలయాల సందర్శన చేసుకోవడం భక్తులకు ఈ సంవత్సరం మంచి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. బొజ్జవర్ సంతోష్, రంగినేని శ్రీనివాస్, ఒరగంటి వెంకటేష్, ఉమేష్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
కీర్గుల్ (కె) సర్పంచ్, ఉపసర్పంచ్ కు ఘన సన్మానం
నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేసిన సర్పంచ్ మాలేగం మధుప్రీతి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కీర్గుల్ (కె) గ్రామ సర్పంచ్ మాలేగం మధుప్రీతి, ఉపసర్పంచ్ కోప్లే నాగనాథ్ ను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రవళిక, భవానిలు గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న1 నుండి ఐదో తరగతి విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులను సర్పంచ్ మాలేగం మధుప్రీతి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవందర్, అంగన్వాడీ టీచర్ ఈశ్వరబాయి. తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అఖిల్ మహాజన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్ర శేఖర్, నాయకులు N. సుదర్శన్, k ప్రభాకర్ రెడ్డి, దండు మధుకర్, T. వినోద్, ఇమ్రాన్, సత్యనారాయణ, అట్ల గోవర్ధన్ రెడ్డి, Sk అలీమ్, రహీం ఖాన్, సురేష్, కుదుర్పాక,సమ్ము, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.
సోయాబీన్ రైతుల సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్
చిత్రం న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో గురువారం హైదారాబాద్ లో బీజేపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పటేల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైతుల ఇబ్బందులను సానుకూలంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఎమ్మెల్యేలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యుత్తు బల్బులు పెట్టించి..కాలనీలో వెలుగులు తెప్పించి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్, తాటిగూడ, నేరటివాడ, గంజి రోడ్ లో ఎన్నో రోజుల నుంచి విద్యుత్ బల్బులు రాకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. 24 వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మానే శంకర్ మొత్తం వార్డులో అన్ని విద్యుత్ స్తంభాలకు బల్బులు పెట్టించడంతో వెలుగులతో కాలనీ మెరిసింది.
భాగ్యనగర్ వార్డులో పొగ కాలుష్యంతో ప్రజలకు ఇక్కట్లు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 24 భాగ్యనగర్ లో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల కింద ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ యార్డ్ లో (క్రోమ్ తోలు జిన్నింగ్ వాషర్) పనికిరాని చెత్తను పారేసి దాన్ని తగలబెడుతున్నారు, తగలబెట్టిన తర్వాత దాని నుండి వచ్చే హానికరమైన పొగతో వాయు కాలుష్యమై, భాగ్యనగర్, తాటిగూడలో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
మేడిగూడకు రూ.కోటి నిధులు కావాలని శివప్రసాద్ రెడ్డి విన్నపం..స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ(ఆర్) గ్రామానికి నిధులు మంజూరు చేయాలని క్యాతం శివప్రసాద్ రెడ్డి విన్నపానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ క్యాతం శివప్రసాద్ రెడ్డి ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రామాభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. మేడిగూడ గ్రామానికి 50 ఇందిరమ్మ ఇళ్లు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, ఏకబిల్వ శివాలయం, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేయాలంటూ గ్రామ ప్రజల తరపున ఆయన సీఎంకు లేఖ ద్వారా విన్నవించారు. ఈ నెల 30న స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేసింది. కలెక్టర్ గ్రామాభివృద్ధి విషయమై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో ను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శివ ప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రబీ పంటలో శాస్త్రవేత్తల క్షేత్ర స్థాయి పర్యటన
చిత్రం న్యూస్, జైనథ్: వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిరాల, జైనథ్, లేఖర్ వాడ, సావాపూర్, కచ్ కంటి గ్రామాలలో శనగ, కంది, గోధుమ రబీ పంటలలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డా.కే రాజశేఖర్, డా.జి. ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ..గులాబీ రంగు పురుగు దృశ్య పత్తి పంటను తీసివేయాలన్నారు. కంది పంటలో పురుగు నివారణకు లాండా సాయి హాలోత్రిన్ + క్రోరాంతనిప్రోలు ఎకరానికి 80 మిల్లీలీటర్లు విచికారి చేసుకోవాలన్నారు. సెనగ పంటలో ఎండు తెగులు నివారణకి కాపరాక్షి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదట్లో పిచికారి చేయాలన్నారు. గోధుమ పంటలో తెగుళ్ళ నివారణకి ప్రాపి కొనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ ఇచ్చిన కందిరకాలను కూడా సందర్శించారు. రైతులు పాల్గొన్నారు.










