Home Blog Page 67

11న  మంత్రి  జూపల్లి పర్యటన

0

ఈ నెల 11న  మంత్రి  జూపల్లి పర్యటన

చిత్రం న్యూస్, నేరడిగొండ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ను కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. మంత్రితో భేటీ తర్వాత ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 11న ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు  ఉదయం హైదరాబాద్ నుండి నేరుగా బోథ్ మండలానికి 9:30కు చేరుకొని బోథ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ళు ప్రారంభిస్తారన్నారు. బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్స్ లో పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పథకాలు అందిస్తారని , సొనాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని ఆడే గజేందర్ తెలిపారు.  తర్వాత  అక్కడినుంచి నేరుగా భోరజ్  మండలంలోని పిప్పర్వాడ, గిమ్మ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయాలని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్ కు కీర్గుల్ (కె) గ్రామస్తుల వినతి

0

శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయాలని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్ కు కీర్గుల్ (కె) గ్రామస్తుల వినతి

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పాటిల్ ను బాసర మండలంలోని కీర్గుల్ (కె) గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు .తమ గ్రామంలో గతంలో శ్రీ రామాలయం దేవాలయ నిర్మాణం కోసం రూ.28 లక్షల  టెండర్ పూరయ్యిందని, 5.60లక్షలు. డిపాజిజిట్ కూడా చెయ్యడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు అది ప్రోసెసింగ్ లో నే ఉందని అప్రూవల్ చేయించాలని గ్రామస్తులు  ఆయన్ను కోర సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. శ్రీ రామాలయం టెండర్  ప్రొసీడింగ్ ని వెంటనే అప్రూవల్ చేయాలని అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే,  ముత్యం రెడ్డి, అట్టల్ దేవిదాస్, వీడీసీ కమిటీ అధ్యక్షులు గోపాల్, వీడీసీ సభ్యులు పల్లె రమేష్, వెంకట్ రావు పాటిల్. రాజేందర్ మాజీ సర్పంచ్ దేవేందర్, జాదవ్ చంద్రకాంత్, పెద్ద కాపు గంగాధర్, మలేగాం సురేష్, పోశెట్టి, గంగాధర్, మాగం గంగన్న, శివన్న అగ్గోళ్ల, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్ పరిశ్రమపై చిగురిస్తున్న ఆశలు

0

సిమెంట్ పరిశ్రమపై చిగురిస్తున్న ఆశలు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ కోసం ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్  సిమెంట్ ప్లాంట్ పునరుద్ధరణ ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి కీలకమైనది. 2 వేల  ఎకరాలకు పైగా నాణ్యమైన సున్నపురాయి నిల్వలతో, ఈ ప్లాంట్ స్థిరత్వానికి బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని ఆధునీకరించడం వల్ల దాదాపు 3 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాకు, అటువంటి అభివృద్ధి సమతుల్య వృద్ధికి మరియు సమ్మిళిత పురోగతికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ చొరవతో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సీసీఐ పునరుద్ధరణపై చర్చ సందర్భంగా ఆదిలాబాద్ లో సీసీఐ పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత ఉపాధి తదితర విషయాలను మంత్రితోపాటు పరిశ్రమల శాఖకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కేంద్ర ప్రతినిధి సంజయ్ బంగా, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు

0

ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు

చిత్రం న్యూస్, భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల దినోత్సవం, అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రామ యువకులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన గణపతి పీఎస్ హెచ్ ఎంగా  పదోన్నతి పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా దివ్యాంగు శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు పంచగుడి మహేష్ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నదని, వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది గురువులేనన్నారు. గురువులు ప్రత్యక్ష దైవంతో సమానులని, వారు చూపే మార్గంలో నడిచి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి లక్ష్యం పట్ల అవగాహనను కలిగించి వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పీఎస్ హెచ్ఎం, ఎంపీపీఎస్ గర్ల్స్ ముథోల్ ప్రధానోపాధ్యాయుడు గణపతి మాట్లాడుతూ… పూర్వ వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన నన్ను గుర్తుపెట్టుకుని యువకులు ఆహ్వానించడం ఎంతో సంతోషమన్నారు. సన్మానం కార్యక్రమం చేసిన యువకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడానికి మనసుతో సంబంధం లేదని ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చని గుర్తు చేశారు. యువకులకు, వారి తల్లిదండ్రులను వయోజన విద్యని ప్రోత్సహించాలని చెప్పారు. ఉపాధ్యాయులు సోనియా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు, గ్రామస్థుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన గణపతినీ ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకుముందు విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ఉపన్యాసాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రతి ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుడేనని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు బహుమతి అందజేశారు. యువకులు లక్ష్మణ్, ఆనంద్, రవి, సాయినాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అత్యంత గౌరవప్రదమైన ఉపాధ్యాయ, విద్యారంగం వ్యవస్థను ప్రభుత్వాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు పాఠశాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, సంప్రదాయాలు, దేశభక్తి జాతీయ భావాలు నేర్పించాలని సూచించారు. అంతకుముందు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసి 84 విద్యార్థులకు గ్రామ యువకులు వడ్డించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పోతన్న, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

0

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజ్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. తామే ఉపాధ్యాయులు గా మారి వృత్తిలో సాధక బాధలు తెలుసుకొన్నారు. తరువాత విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ డా.గెడం ప్రవీణ్, ఐసీసీ చైర్మన్ పుష్ప ఐసీసీ మెంబర్ ప్రియాంక, సీనియర్ అధ్యాపకులు సాగర్, ఆమోల్, కిష్టారెడ్డి, బిందు, విజయ, సౌందర్య, సంజీవ్ పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో డబ్బులు ఖాతాలో పడక  ఇబ్బందులు

0

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో డబ్బులు ఖాతాలో పడక  ఇబ్బందులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం సందర్భంగా డబ్బులు ఖాతాలో జమ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ పథకం ద్వారా జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన జి.వెంకటమ్మ అనే మహిళ నిర్మించుకుంటున్న ఇంటి బేస్ మెంట్ లెవల్, ఫొటో క్యాప్చర్ పూర్తయినప్పటికీ వారి ఖాతాల్లో ఇంకా నిధులు జమ కాలేదు. చాల రోజుల నుంచి ఎదురుచూసిన ఇంత వరకు ఖాతాలో నిధులు రాకపోవడంతో  “ప్రజావాణి” (ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం) లో కలెక్టర్‌ రాజర్షి షా కు బీజేపి నాయకుడు సూర్య ప్రకాష్ రెడ్డి జి.వెంకటమ్మతో కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించాలని బాధిత మహిళ వేడుకున్నారు.

లక్షా అయిదు వేలకు లడ్డూను దక్కించుకున్న వెల్మ సూర్యప్రకాష్ రెడ్డి

0

లక్షా అయిదు వేలకు లడ్డూను దక్కించుకున్న వెల్మ సూర్యప్రకాష్ రెడ్డి

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రెడ్డి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం లడ్డూ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో వెల్మ సూర్య ప్రకాష్ రెడ్డి రూ.1,05,000 (లక్షా అయిదు వేలు) లకు లడ్డూను  దక్కించుకున్నారు. రెడ్డి సంఘం మండలి నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. వినాయకుడికి వేద మంత్రాలతో ఉత్తర పూజను పూజారి నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం గణేష్ మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

0

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

*సాంగిడి గ్రామంలో సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి చికిత్స

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో శ్రీ మోతీజే  మహారాజ్ ఆలయంలో L V ప్రసాద్ వారి సౌజన్యంతో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రజలందరూ ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా కంటి చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు తమ L V ప్రసాద్ ఆసుపత్రికి రావాలని సూచించారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఎందరో మంది కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారనే ఉద్దేశ్యంతో L V ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కంటి శస్త్ర చికిత్స చేయాలంటే నేడు వేల రూపాయలు ఖర్చు చేసేంత స్తోమత లేని పేదలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.  ఈ శిబిరానికి సహకరించిన L V ప్రసాద్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ప్రణయ్, వెంకట్ రమణ, సాయిలుకు, గ్రామస్తులతో పాటు ఆయన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో అవసరమైన వారికీ కళ్ళ అద్దాలు,  ఉచిత మందులు, ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్స కూడా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సామ నర్సారెడ్డి, దయాకర్ పటేల్, సుధాకర్, మేకల జితేందర్, మంచికంటి సాయి, దేవన్న, జగదీష్ రెడ్డి, రాంరెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు.

వేలం పాటలో  లడ్డూ దక్కించుకున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి

0

వేలం పాటలో  లడ్డూ దక్కించుకున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో  విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి రూ.22,500 కు లడ్డూ దక్కించుకున్నారు. మండలి నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. మండలిలో ఏర్పాటు చేసిన  గణేష్ విగ్రహ  దాత కొంచెం వార్ సుభాష్ ను ఈ సందర్భంగా సన్మానించారు.  వినాయకుడికి వేద మంత్రాలతో ఉత్తర పూజను పూజారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కైలాష్ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు లోక ప్రవీణ్ రెడ్డి, రాపల్లి పవన్ కుమార్, శ్రీపద్ మాసాడే,  దెబ్బడి ఉల్లాస్, బడాల విలాస్ రెడ్డి, ప్రవీణ్ అగర్వాల్, జవాజి కృష్ణ, సదేశ్, కొంచెం వార్ సుభాష్, శోభలతా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు డీజేలు సీజ్ – ఇచ్చోడ సీఐ బండారి రాజు

0

నాలుగు డీజేలు సీజ్ – ఇచ్చోడ సీఐ బండారి రాజు

*నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలోని ఘటన.

*డీజే యజమానులు, ఆపరేటర్లపై కేసులు నమోదు

*సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలి

చిత్రం న్యూస్, నేరడిగొండ: సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ  సీఐ బండారి రాజు తెలిపారు. శుక్రవారం  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలను అతిక్రమించి ఏర్పాటు చేసిన నాలుగు డీజేలను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్ల పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజేలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని సూచించారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని, అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.