Home Blog Page 66

విద్యుత్  సరఫరాలో అంతరాయం

0

విద్యుత్  సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ పరిధిలో  బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని బోథ్ విద్యుత్ ఏఈ శ్రవణ్ కుమార్ మంగళవారం  తెలిపారు. 11 కేవీ మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. బోథ్ పట్టణ వినియోగదారులు సహకరించాలని కోరారు.

 

కుమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి – మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

0

కుమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి “తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని మారుమూల గ్రామాలైన మహధుగూడ, కేశవ్ గూడ, పార్డి (బి), పార్డి (కే ), ఘన్ పూర్, టివిటి, పరుపులపల్లె గ్రామాలలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొంత నిధులతో.చేపట్టనున్న కుమురం భీం విగ్రహాల నిర్మాణం కోసం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ..కుమురం భీం  ఆశయాలను ప్రతి ఆదివాసి గ్రామాలకు చేరాలని, ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి, అందరి ఆరాధ్య దైవమన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున హామీ ఇవ్వడం జరిగిందని, నెల రోజులలో అన్ని గ్రామాల్లో  కుమురం భీం విగ్రహాల కోసం భూమిపూజ చేసుకోవడం చాలా సంతోషం అన్నారు. కార్యక్రమంలో పార్డి (బి) రాయి సెంటర్ సర్మేడీ తొడసం లక్ష్మణ్ , ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మెస్రం భూమన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, దేవేందర్, సురేష్, గ్రామ పటేల్ లు సిడం అమృత్ రావ్, కోవ జైత్తు, ఆత్రం, పంద్రం జైతు, మాడావి బాపురావు, పురుషోత్తం, ఆదివాసీ మాజీ సర్పంచులు జమున, మారుతి, కోవ. కిషన్, భగవత్ రావు , నాగేష్, కొడప దేవిదాస్, బీఆర్ఎస్ నాయకులు యార్ల సుధీర్ రెడ్డి, అభిలాష్, చిన్నయ్య, సోమన్న, హరీష్ , సుగుణాకర్ , ప్రమోద్ , షేక్ ఆసిఫ్, గంగమల్లు, గిరిజన మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

0

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో భైంసా కేంద్రంలోని ప్రభుత్వ గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాలలో కాళోజీ చిత్రపటానికి ప్రిన్సిపల్‌ కరోల్ల బుచ్చయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాలోజీ భావజాలంలో ఎంత లోతైన ఆలోచన కలిగి ఉందో గమనించవచ్చన్నారు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి బిరుదుల్ని పొందడమే కాకుండా తమ సమాజ స్థాపనకై ఆయనఎంతో కృషి చేశారనన్నారు.  సమాజంలోని వ్యత్యాసాలను ఎండగడుతూ అనేక కవితల్ని రచించారన్నారు. తెలుగు సహాయాచార్యులు రాజు మాట్లాడుతూ.. బడి పలుకుల భాష కాదు పలుకు బడుల భాష కావాలని ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం “అదే జీవితం” అంటారు.  కాళోజీ అని వారన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2 ప్రోగ్రాం ఆఫీసర్స్ ఆరే రాజు ఓం ప్రకాష్ లా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ర వికుమార్, డా.పవన్ కుమార్, డా భీమ్ రావు, డా పీజీ రెడ్డి, డా.శంకర్, గుంత సుధాకర్, డా.సంతోష్ కుమార్, డా.నహెదా, డా.కల్పన, దివ్య రామ్మోహన్, సురేందర్, మజర్ అబ్దుల్లా, కిషన్, శ్రావణ్య, అర్షియ,  ఉజ్మ సమరిన్, వాహిద్, ఇర్ఫాన్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రామాల అభివృద్ధికి రూ.13.78 కోట్లు విడుదల

0

ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రామాల అభివృద్ధికి రూ.13.78 కోట్లు విడుదల

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రామాల్లోని పలు కాలనీలలో అభివృద్ధి పనుల కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.13.78 కోట్లు నిధులు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కాలనీలో మురికి కాలువలు ఇతర రోడ్ల అభివృద్ధి కోసం పలు గ్రామాల నుంచి వచ్చిన వినతి మేరకు నిధుల విడుదలకై ప్రతిపాదించగా నియెజకవర్గానికి ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులు విడుదల కావడంతో అభివృద్ధి పనులకు మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఎస్సీ కులస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన తెలంగాణ బీజేపి ఎంపీలు

0

ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన తెలంగాణ బీజేపి ఎంపీలు

చిత్రం న్యూస్, దిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తెలంగాణ బీజేపి ఎంపీలు తమ  ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఓటు వేసిన వారిలో తెలంగాణ బీజేపి ఎంపీలు వరుసగా గోడం నగేష్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావు, బండి సంజయ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు.

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

0

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజీలో కాళోజీ నారాయణ రావు  జయంతి పురస్కరించుకుని తెలంగాణ భాష దినోత్సవం వేడుకలు మంగళవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.వరప్రసాద రావు మాట్లాడుతూ.. తెలంగాణ యాస, భాష ఒకప్పుడు పూర్తిగా నిర్లక్యానికి గురి చేయబడిందనీ, మన ప్రభుత్వం వచ్చిన తరువాత వరంగల్ లోని ఆరోగ్య విశ్వ విద్యాలయం కు కాళోజీ పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు మన  భాష, మన యాసలో మాట్లాడాల్సిన అవసరం ఎంత అయిన ఉందన్నారు. తెలుగు అధ్యాపకులు గెడం సంజీవ్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. గెడం ప్రవీణ్, అడ్మినిస్ట్రేషన్ అధికారి సాగర్, ఐసీసీ చైర్మన్ పుష్ప,  ఐసీసీ సభ్యులు ప్రియాంక, సీనియర్ అధ్యాపకులు కిష్టారెడ్డి, ఆమోల్, బిందు, సౌందర్య, విజయ, అనికేత్తదితరులు పాల్గొన్నారు.

“రూప్ చంద్” జాతి చేపకు మనిషిని పోలిన పళ్లు

0

రూప్ చంద్” జాతి చేపకు మనిషిని పోలిన పళ్లు 

చిత్రం న్యూస్, భైంసా: చేపలకు పళ్లు ఉండటం పెద్ద వింతేమీ కాదు. షార్క్, పిరానా లాంటి వాటికి పదునైన పళ్లు ఉంటాయి. చేపల జాతిలో సగం పళ్లతో ఉంటే.. మరో సగం పళ్లు లేకుండా ఉంటాయి. ఇక్కడ అత్యంత వింతైన విషయం ఏంటంటే.. కొన్ని చేపలు అచ్చం మనుషుల్లాగే పళ్లను కలిగి ఉంటాయి. అవి అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పళ్లు ఉన్న చేపలు కనిపించటం అన్నది అత్యంత అరుదు. అయితే తాజాగా నిర్మల్ జిల్లాలో మనిషిని పోలిన పళ్లు ఉండే చేప ఒకటి కనిపించింది. ఓ మత్స్యకారుడి వలకు ఆ చేప చిక్కింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన గుండ్ల సంతోష్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పడుతుండగా ఓ పెద్ద చేప వలకు చిక్కింది. అది వింతగా కనిపించటంతో బాగా పరిశీలించి చూశాడు. దాని నోట్లో మనిషికి ఉన్నట్లు పళ్లు ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకిపోయింది. జనం వింత చేపను చూడ్డానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేం చేప..గుండ్ల సంతోష్‌కు చిక్కిన ఆ చేప జాతిని ‘రూప్ చంద్’ లేదా ‘చందువా’ అని పిలుస్తారు. వాటికి చైనీస్ పామ్‌ఫ్రెట్ అన్న పేరు కూడా ఉంది. ఈ చేపలు ఎక్కువగా ఇండియా, చైనాలో కనిపిస్తాయి. సాధారణంగా ఈ చేపలకు పళ్లు ఉండవు. కానీ, అత్యంత అరుదుగా మనిషి పళ్లను పోలిన పళ్లతో పుడుతూ ఉంటాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రూప్‌చంద్ చేపలు పిరానా జాతికి బంధువులు. అందుకే అప్పుడప్పుడు పళ్లతో పుడుతూ ఉంటాయి. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మనిషిలాంటి పళ్లు ఉన్న రూప్‌చంద్ చేప కనిపించింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు నిర్మల్ జిల్లాలో పళ్లు ఉన్న చేప వెలుగుచూసింది.

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

0

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన వొర్స రాజేందర్ సేవలకు గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్శి షా చేతుల మీదుగా  ఇటీవల అందుకున్నారు. వొర్స రాజేందర్ తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ విలువలతో విద్యను అందిస్తూ విద్యార్థులకు భవిష్యత్తు పట్ల మార్గ నిర్దేశం చేసినందుకు గాను అవార్డు అందుకున్నారు. విషయం  తెలుసుకున్న ప్రముఖ నిర్మాత, హోమియో వైద్యులు డాక్టర్ రవికిరణ్ యాదవ్ జిల్లా యాదవ సంఘo ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసుర హన్మాండ్లు యాదవ్, మంచాల మల్లయ్య యాదవ్, నర్ర నవీన్ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, గొర్ల రాజు యాదవ్, పురుషోత్తం యాదవ్,  సల్ల విజయ్ బాబు,  నారకట్ల రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.

విద్యుదాఘాతానికి యువకుడు మృతి

0

విద్యుదాఘాతానికి యువకుడు మృతి

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ (Kondukur) గ్రామానికి చెందిన సంఘం రాజేందర్ (37) అనే యువకుడు విద్యుదాఘాతంతో  మంగళవారం దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండుకూర్ కు చెందిన‌ సంఘం రాజేందర్ ఉదయం పొద్దుటూరి సంజీవరెడ్డి పొలంలో గడ్డి కోయడానికి వెళ్లాడు. గడ్డి కోసే యంత్రానికి  వైర్ తగలడంతో రాజేందర్ విద్యుదాఘాతానికి గురై  అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి  భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. గ్రామంలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజేందర్ కరెంట్ షాక్‌తో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ఇచ్చోడ ఆటో యూనియన్ నూతన కార్యవర్గానికి సన్మానం

0

ఇచ్చోడ ఆటో యూనియన్ నూతన కార్యవర్గానికి సన్మానం

*సన్మానించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆటో యూనియన్ కార్యవర్గం  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన హుస్సేన్ ని అభినందించారు.