Home Blog Page 67

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్P

0

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా :బాసరనుండి బిద్రేల్లి వరకు దేగాం నుండి భైంసా వరకు జాతీయ రహదారికి ఫోర్ (4)లైన్ మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ విన్నవించారు. ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బాసర నుండి భైంసా వరకు రహదారిపై ప్రమాద స్థలాలను గుర్తించి, ప్రమాదాలు జరుగకుండా 4 లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా బాసర గోదావరి నది ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగకుండా రక్షణ కంచె లను ఏర్పాటు చేయాలన్నారు.. బాసర నుండి మహోర్ కు జాతీయ రహదారి అనుసంధాన విషయమై కేంద్ర మంత్రిని కోరగా రహదారి సంబందించిన ఫైల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద ఉందని త్వరలో నిధులు మంజూరు అవుతాయని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

బేలలో చలివేంద్రం ప్రారంభం: ప్రజల దాహార్తి తీరుస్తున్న ఇట్టడి సుశాంత్ రెడ్డి

0

చిత్రం న్యూస్,బేల: బేల మండల కేంద్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా, బాటసారుల, ప్రజల సౌకర్యార్థం జై హనుమాన్ ఫర్టిలైజర్స్ అధ్వర్యంలో ఇట్టడి సుశాంత్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లటి తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మండల కేంద్రానికి మార్కెట్ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటారని, ఈ ఎండల్లో వారికి దాహార్తి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనను స్థానికులు,  ప్రయాణికులు అభినందిస్తున్నారు. ఈ చలివేంద్రం ఏర్పాటు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీలకు రూ.247.94 కోట్ల కేంద్ర నిధులు

0

చిత్రం న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.247.94 కోట్ల అదనపు గ్రాంట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదలైన ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆరు రాష్ట్రాలకు రూ.1500 కోట్లకు పైగా గ్రాంట్లను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్ టైడ్ గ్రాంట్స్ కేటాయించబడ్డాయి. ఈ నిధులు రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులకు ఉపయోగపడతాయి.

గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం, ఈ నిధులను అభివృద్ధి పనులకు మాత్రమే కేటాయించాలి తప్ప, ఉద్యోగుల జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు ఉపయోగించరాదు గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం, ఈ నిధులను అభివృద్ధి పనులకు మాత్రమే కేటాయించాలి తప్ప, ఉద్యోగుల జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు ఉపయోగించరాదు.

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత గ్రాంట్లుగా ఈ నిధులను కేటాయించారు. ఈ నిధుల వినియోగం గ్రామ సభ ఆమోదంతో జరగాలి. మురుగు కాల్వల మరమ్మత్తులు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటికల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నిర్ణయం తెలంగాణ గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. నిధుల వినియోగంపై పారదర్శకత పాటించాలని కేంద్రం సూచించింది.

అంకిత భావంతో  పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు 

0

చిత్రం న్యూస్, భోరజ్: అంకిత భావంతో పనిచేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, యూత్ కాంగ్రెస్  రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు అన్నారు. ఇంచార్జి ఎంపీడీఓ చిల్కూరి వేణు రెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా మంగళవారం మండలంలోని సిర్సన్న రైతు వేదికలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేణు రెడ్డి దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను మండల నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు అల్లూరి భూమారెడ్డి, మామిడి మల్లారెడ్డి, సన్నీ ప్రకాష్ రెడ్డి, పొట్ట అశోక్, ఆశా రెడ్డి,  శ్రీనివాస్ కాంగ్రెస్  పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

జైనథ్ మార్కెట్ యార్డులో రెండు రోజులు  కొనుగోలు బంద్

0

చిత్రం న్యూస్, జైనథ్:  వ్యవసాయ మార్కెట్‌యార్డు లో శనగ నిల్వలు పెరగడం, వాతావరణం సరిగా లేనందున బుధ, గురు వారాలు రెండు రోజులు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు రైతుల నుండి శనగ కొనుగోళ్లు జరగవన్నారు. శుక్రవారం నుండి గ్రామాల వారీగా యథావిధిగా కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని మార్కెట్ సెంటర్ ఇంఛార్జి కోరారు.

సీఎం బాసర పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్నందున, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన సమీక్షించారు.

ముందుగా పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను చూశారు. పనుల ప్రారంభోత్సవాల ఏర్పాటుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో ముఖ్యమంత్రి నిర్వహించే పూజలకు సంబంధించి వివరాలను చర్చించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. బాసర ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో చారిత్రాత్మక ప్రశస్తి ఉందని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు.

రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి బాసరలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పుష్కర ఘాట్ మరమ్మత్తు, నూతన పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో పుష్కరాల నిర్వహణకు సంబంధించి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తానని వివరించారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అన్నారు. ఆయా శాఖలకు సంబంధించి అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై సంబంధిత ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి బాసరలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 2నుంచి గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు

0

చిత్రం న్యూస్, దండేపల్లి:  దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 2వ తేదీన ప్రత్యేక గ్రామసభలను నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ గ్రామసభలు నిర్వహించబడనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఇదే సందర్భంలో టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు కలిసి గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలపై వివరాలు అందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ గ్రామసభలు ప్రజలకు వేదికగా మారి, వారి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం

0

* భూసిమెట్టలో గాలివాన బీభత్సం 

* ఇళ్ల  పైప్పులు లేసి దెబ్బతిన్న‌ రెండు ఇళ్లు 

* బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు

చిత్రం న్యూస్, ఉట్నూర్, జైనూర్,: ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచి కొట్టింది. గాలివాన బీభత్సంతో చాలా గ్రామాల్లో పలు నష్టాలు జరిగినట్లు ప్రజలు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, అకాల ఈదురుగాల వాన బీభత్సంతో పలు గ్రామాల్లో నష్టాలు జరగగా రబీ పంటలకు నష్టం జరిగిందని ప్రజలు పేర్కొన్నారు. జైనూర్ మండలంలోని జామిని రోడ్డు గూడలో విద్యుత్ వైర్లపై గాలి దుమారానికి చెట్టు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. కార్మికులతో విద్యుత్ వైర్ల‌పై పడ్డ చెట్టు కొమ్మలను కట్ చేయించి తొలగించారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో రోడ్లపై వరదనీరు రోడ్లపై పారాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూసిమెట్ట గ్రామ పరిసర ప్రాంతంలో కురిసిన అకాల వర్షం.. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలి దుమారం వల్ల ఆత్రం రాధ బాయి, ఆత్రం సముద్ర బాయి ఇంటి పైకప్పులు లేచి పంట చేనులోకి ఎగిరిపడ్డాయి వర్షపు నీరు ఇంటిలోకి ప్రవేశించడంతో నిల్వ చేసిన తినుబండారాలు, బియ్యం, జొన్నలు, బట్టలు తడిసి ముద్దయ్యాయి. గ్రామంలో కరెంటు తీగలు తెగి పడటంతో అంధకారం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు  గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపోయిన వివరాలను తెలుసుకొని పేద కుటుంబాలను ఆదుకోవాలని తహసీల్దార్ ఆడ బిర్షావ్ కు చరవాణి ద్వారా సూచించారు. చైర్మన్ తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట సర్పంచులు ఆత్రం సింధు నగేష్, ఆత్రం జాలిం షా, మెస్రం భూపతి , కాంగ్రెస్ నాయకులు పెందుర్ ప్రకాష్, మెస్రం అంబాజీ రావు, హైదర్, యాదవ్ రావు, పెరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షం..నేలకొరిగిన పంటలు 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాలలో సోమవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో వేడి నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడినప్పటికీ, అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. ముఖ్యంగా కోత దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న, పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షం పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముథోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో సైతం అకాల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లే అవకాశము ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జైనథ్ మార్కెట్‌లో వర్షానికి తడిసిన శనగలు: ఆవేదనలో రైతులు

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ యార్డ్‌లో రాత్రి కురిసిన అకాల వర్షానికి విక్రయానికి తెచ్చిన శనగలు పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్‌లో తగినన్ని షెడ్లు లేకపోవడమే ఈ నష్టానికి ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.