Home Blog Page 65

గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత

0

గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల చెక్కును ఎక్సైజ్, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు,  ఖానాపూర్  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీగా కురిసిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నిండడంతో వరద నీరును దిగువ ప్రాంతానికి పంపే క్రమంలో కడెం డ్యామ్ గేట్లను ఎత్తడంతో ఆ వరద ప్రవాహానికి గంగాధర్  వరద నీటికి కొట్టుకుపోయారు. ఆచూకీ దొరకపోవడంతో ప్రభుత్వం నుండి కుటుంబ సభ్యులకు  ఆర్థిక సహాయంగా  రూ.5 లక్షలను అందజేశామని, అలాగే కుటుంబ సభ్యులలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు అందజేసి వారి కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

0

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

*నేరడిగొండ మండలం కుమారి పీఏసీఎస్ (PACS) చైర్మన్ మందుల రమేష్ కాంగ్రెస్ లో చేరిక

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నేరడిగొండ మండలం కుమారి పీఏసీఎస్ (PACS) ఛైర్మన్  మందుల రమేష్ ఎట్టకేలకు కారు దిగి చేయికి జై కొట్టాడు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి వెంట డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

0

ఇందిరమ్మ మోడల్ హౌస్ ను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రం కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను,  గురుకుల పాఠశాల భవనంలోని డార్మెటరీ నూతన భవనాన్ని జిల్లా ఇంఛార్జ్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, వివిధ శాఖల అధికారులు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

భాగవతం రాయడంలో  వేద విద్యార్థి ప్రతిభ

0

భాగవతం రాయడంలో  వేద విద్యార్థి ప్రతిభ

చిత్రం న్యూస్, బోథ్ :  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన నమలికొండ సుజయ్ కుమార్ శర్మ భాగవతాన్ని రాసి ఉత్తమ ప్రతిభ కనబర్చాడు.  ప్రస్తుతం తిరుపతి లోని కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ వేద పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిదవ తరగతితో పాటు వేద విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో వివిధ విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేయగా సుజయ్ భాగవతాన్ని రాసి తన ప్రతిభ కనబర్చారు. ఇందుకుగాను కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్రసరస్వతి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు  రూ.3వేల నగదును అందుకున్నారు.  స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ ఘనత పట్ల సుజయ్ తల్లిదండ్రులు శ్రీదేవి, సంతోష్ కుమార్ శర్మలతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ , కరస్పాండెంట్ కృష్ణవేణి, వెంకటసుబ్రమణ్యంలు అభినందించారు. ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 

0

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 

చిత్రం న్యూస్, నేరడిగొండ: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిఖార్సుగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.  ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఐలమ్మ   చిత్రపటానికి నివాళులర్పించారు. రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కను నాటారు.అనంతరం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి రజక సంఘం సభ్యులు సన్మానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ..చాకలి  చిట్యాల ఐలమ్మ  ఉద్యమాలతో చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందారని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశైలిగా పెరుపొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ  జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రజక సంఘం అధ్యక్షుడు నేరెళ్ల శేఖర్, సభ్యులు జంగంపల్లి రమేష్, చిర్ర దశరథ్, మెట్పల్లి గంగయ్య, జంగంపల్లి శ్రీకాంత్, మర్రిపల్లి శ్రీనివాస్, నిమ్మల భూమన్న, సిర్ర అర్జున్, గంగయ్య, గ్రామ పెద్దలు  జీవన్ రెడ్డి, పద్మనాభం రెడ్డి, బాడాల శ్రీకాంత్, అజయ్ రెడ్డి, నల్ల లక్ష్మణ్, ప్రదీప్, విద్యాసాగర్ రెడ్డి, శోభన్ రెడ్డి, కుర్మ మల్లేష్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజకుమార్ రెడ్డి, కారోబార్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బోథ్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశం 

0

బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం 

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశం చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో కలిసి పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. తీర్మానాలు చేశారు. ఈ పాలకవర్గ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, వైస్ చైర్మన్ ఆడే వసంత్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

బాసరలో మంత్రి జూపల్లి కృష్ణారావు  పర్యటన

0

బాసరను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి_మంత్రి జూపల్లి కృష్ణారావు 

*జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

*మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,  కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

చిత్రం న్యూస్, భైంసా(బాసర): నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.అనంతరం మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.190 కోట్ల వ్యయంతో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి బాసర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాసరను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బాసర ఆలయ అభివృద్ధిపై తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నానని వివరించారు. బాసరలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాసరలోని  ఆర్జేయూకేటీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ  దండే విఠల్, నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనా దేవి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,  కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, ముథోల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్  ఆనందరావు పటేల్, మాజీ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బాసర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ

0

భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ailamma)  అని, ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆమె చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని గుర్తు చేశారు. కుల వృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేసిందని, చాకలి ఐలమ్మ విసునూరు దొర పెత్తనాన్ని ప్రశ్నించి పోరాడి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర వహించిందన్నారు. తన భర్త, కుమారులు జైలు పాలైన వెనుకడుగు వేయకుండా పోరాటం చేసిందన్నారు. ఇలాంటి మహనీయులను కొందరు విచక్షణ కోల్పోయి అవమాన పరుస్తున్నారని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, విగ్రహాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సుంకేట శ్రీనివాస్, సాయినాథ్, గడ్డం భూమన్న, బాబు దళిత సేన నాయకులు యశ్వంత్ బాన్సోడే, రాజు, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు మారిన బీసీల తలరాత మారడం లేదు_ ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

చాకలి ఐలమ్మ  విగ్రహానికి  పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

                      చిత్రం న్యూస్, అదిలాబాద్

ఎన్ని ప్రభుత్వాలు మారిన, ఎన్ని పోరాటాలు చేసినా బీసీ కులాల ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద బుధవారం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తుతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆనాడు చాకలి ఐలమ్మ చూపిన తెగువ, పోరాట పటిమ తెలంగాణ యావత్ ప్రజానీకానికి, తెలంగాణ సాయిధ పోరాటానికి ఊపిరినిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ తలరాతలు మారుతాయని రాష్ట్ర సాధన పోరాటంలో ముందు వరుసలో ఉన్న బీసీలు, ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం వచ్చిన బీసీ చేతి వృత్తి కులాలు కష్టాల్లోనే ఉన్నాయని అన్నారు. వర్ధంతి, జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడంతో పాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా క్రాంతి పథం సీసీ కి సన్మానం

0

ఇందిరా క్రాంతి పథం సీసీ కి సన్మానం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ గ్రామం ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) సీసీగా విధులు నిర్వహిస్తున్న బండారి విద్యాసాగర్ మండలంలోని వడూర్ గ్రామానికి బదిలీపై వెళ్ళారు. సాయితేజ సంఘము సభ్యులు ఆయనకు మంగళవారం సన్మానం చేశారు. అనంతరం సంఘ సభ్యులు విద్యాసాగర్ నేరడిగొండ మహిళ సంఘాలకు చేసిన సేవలను, పొదుపు పథకంపై అవగాహన కల్పించి సంఘాలని ముందుకు తీసుకెళ్లడంలో చేసిన కృషిని కొనియాడారు. సమావేశంలో లింగరాజు,కవిత, చంద్రకళ, వొస గంగామణి, గంగాధర్, గణేష్ ఉన్నారు.