Home Blog Page 60

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి

0

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ:
నేరడిగొండ మండలంలో గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్న ఆధార్ సెంటర్ ను పునః ప్రారంభించాలని నేరడిగొండ మండల యువకులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండీ కలీంకు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో ఉన్న తప్పులు సరిచేసుకోవాలన్న, కార్డు అప్డేట్ చేసుకోవాలన్న, కొత్తగా పెళ్లైన వారి ఆధార్ కార్డు బదిలీ చేసుకోవాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళాలి. గత కొన్ని నెలలుగా ఆధార్ సెంటర్ మూతపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు నమోదు చేసుకోవాలన్నా ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, ఇచ్చోడ ఆధార్ సెంటర్ ఇటీవల తిరిగి ప్రారంభమైనా నేరడిగొండ ఆధార్ సెంటర్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో  తహసీల్దార్ ను కలిసి విన్నవించామన్నారు. మండల జనాభా ప్రాతిపదికన ప్రజల సౌలభ్యం కోసం మరో ఆధార్ సెంటర్, మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సాబ్లే సంతోష్, సింగ్, రాథోడ్ రాజశేఖర్, ఏలేటి మనోజ్ రెడ్డి, బొంతుకుల శ్రీను, కుంచపు గోవింద్, బాక్రే ప్రశాంత్, సురేష్, తగిరే చందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

0

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ:  బోథ్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ఎన్ని కష్టాలైన ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ రోజు నుంచి  నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న కూడా నేరడిగొండ నుండి బోథ్ వరకు రెన్యువల్ బీటీ కోసం రూ.5.21కోట్ల నిధులు, గుడిహత్నూర్ మండలం డోంగ్రగావ్ నుండి మన్నూర్ మీదుగా కొల్హారి, శాంతపూర్  వరకు బీటీ కోసం రూ.4.40 కోట్ల నిధులు మంజూరు చేశానని,  ప్రజల చిరకాల వాంఛ రోడ్డు సమస్య అని,  ప్రజా సమస్యలే పరమావధిగా కొనసాగుతానని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

0

MLA ANIL JADHAV: బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి_ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ: బోథ్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ఎన్ని కష్టాలైన ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా కృషి చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ రోజు నుంచి  నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న కూడా నేరడిగొండ నుండి బోథ్ వరకు రెన్యువల్ బీటీ కోసం రూ.5.21కోట్ల నిధులు, గుడిహత్నూర్ మండలం డోంగ్రగావ్ నుండి మన్నూర్ మీదుగా కొల్హారి, శాంతపూర్  వరకు బీటీ కోసం రూ.4.40 కోట్ల నిధులు మంజూరు చేశానని,  ప్రజల చిరకాల వాంఛ రోడ్డు సమస్య అని,  ప్రజా సమస్యలే పరమావధిగా కొనసాగుతానని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

రక్తదానం చేసిన  విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు

1

రక్తదానం చేసిన  విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు

చిత్రం న్యూస్,కాకినాడ: శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రూరల్ మాజీ అధ్యక్షులు, విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు బుధవారం కాకినాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా సేవ పక్వాడ అభియాన్ కార్యక్రమం రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన రక్త దానం చేశారు. విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మోదీ పుట్టిన రోజు సందర్భంగా  రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మీ లో ఉంటూ దేశ ప్రజల కోసం  చేసిన సేవను, పడిన శ్రమను, తను పాల్గొన్న కార్గిల్ వార్ లో ఎందరో ప్రాణాలు కోల్పోయిన విషయాలను  గుర్తుచేసుకున్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా జరిగే సేవా పక్షోత్సవలో భాగంగా అక్టోబర్ 2 వరకు మెడికల్ క్యాంప్ లు, సెమినార్లు, పలు రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన  తెలిపారు.

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

0

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

చిత్రం న్యూస్ భైంసా : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంజ్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రధానోపాధ్యాయుడు సాగర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాటి రాచరిక పాలననుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేసి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, ప్రవీణ్, పోతన్న, గంగాధర్, అజయ్, రాజు శ్రీనివాస్, గ్రామ యువకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు 

0

వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం విశ్వకర్మ మరాఠి వడ్రంగి సంఘo ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ గోపాలకృష్ణ మఠంలో విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పట్టణంలో భారీ శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. బీసీ సంఘo జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, నేతలు విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వె సంతోష్, ఎం.దిలీప్, నాయకులు, కులస్తులు పాల్గొన్నారు

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

0

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం ఘన్ పూర్ చెక్ పోస్ట్ వద్ద పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు.  ఎస్ఐ శ్రీసాయి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రవ్వజియ, డ్రైవర్ జావీద్ నాగపూర్ లో 33 ఎడ్లను కొనుగోలుచేసి శంషాబాద్ లోని కబేళానికి ఒక లారీ లో తరలిస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘన్ పూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు లారీని పట్టుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తర్వాత 33 ఎడ్లను ఇచ్చోడ లోని  గోశాలకు తరలించినట్లు ఎస్ఐ శ్రీసాయి పేర్కొన్నారు.

 

 

 

 

 

 

 

 

MINISTER SEETHKKA :ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం

0

MINISTER SEETHKKA :ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం

చిత్రం న్యూస్, బేగంపేట: హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ప్రారంభించారు. SERP, మహిళా-శిశు అభివృద్ధి శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో DRDOలు, అదనపు DRDOలు, DWOs కోసం అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల త‌ర‌హాలో కౌమార బాలికా సంఘాల ఏర్పాటు పై దిశా నిర్దేశం చేశారు. Serp సీఈఓ దివ్య దేవ‌రాజ‌న్, అడిషనల్ సీఈఓ కాత్యాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి. సృజన, UNICEF చైల్డ్ ప్రొటెక్షన్, కౌమార & యువజన అభివృద్ధి అధికారి ఎం. మురళీకృష్ణ, తరుణి సంస్థ చైర్ పర్సన్ మమత రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

సొంత గూటికి ముగ్గురు నేతలు

0

పీసీసీ చీఫ్ సమక్షంలో చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  ఆదేశాలతో మంగళ వారం మాజీ టిపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డిలు సొంత గూటికి చేరారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.  ఈ సందర్భంగా  తెలంగాణ పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

0

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

చిత్రం న్యూస్, బేల: రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సోమవారం యూరియా బస్తాలు దిగుమతి సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చారు . పలు గ్రామాల రైతులు వేకువజామునే యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు వరసలో నిలబడి కష్టాలు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదంటూ రైతులు మండి పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి మీ చుట్టూ  తిరగాలా అంటూ మండిపడుతున్నారు. సహకార సంఘానికి యూరియా వస్తున్నా అది సరిపోవడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారిందంటే చాలు యూరియా కోసం సింగిల్ విండో గోదాములు, ఎరువుల దుకాణాల బాట పడుతున్నారు.  రైతులు.ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు.