Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 6

ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్మానించిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సార్

0

*  సేవా కార్యక్రమాల్లోకి ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సార్

* ఈ నెల 10న జన్మదినం సందర్భంగా అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సార్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను శాలువా కప్పి బుధవారం సన్మానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్యూర్ డెయిరీ ఉత్పత్తులను అందజేశారు. ఈ నెల10న అన్సార్ జన్మదినం సందర్భంగా ఆయన పేరిట అన్సారీ ఫౌండేషన్ నెలకొల్పనున్నారు. ఈ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను ఆయన ఆహ్వానించారు.

చలో ఖమ్మం పోస్టర్లు విడుదల చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18న చలో ఖమ్మం వాల్ పోస్టర్లను సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వతంత్రంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ పార్టీ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో ఈనెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు భారీ ర్యాలీ ఉంటుందని,మూడు గంటలకు బహిరంగ సభ  ఉంటుందన్నారు. ఈ సభకు అదిలాబాద్ జిల్లా నుండి వేలాదిగా తరలిరావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ 100 సంవత్సరాలు పోరాటంలో దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టటానికి సీపీఐ పోరాటం కీలకమని, ఆ పోరాటంలో అనేక అక్రమ కేసులు పెట్టి మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు పెషావర్ కుట్ర కేసులు పెట్టి అణిచివేయడం జరిగిందని, కొన్ని సందర్భాలలో సీపీఐ పార్టీని బ్రిటిష్ వారు బ్యాన్ పెట్టడం జరిగిందన్నారు.

గ్యాస్ వినియోగదారులు ఇక ఈ-కేవైసీ చెయ్యాల్సిందే!

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: గ్యాస్ వినియోగదారులు తమ ఈ కేవైసీ (e KYC) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గ్యాస్ ఏజన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీని నేరుగా అర్హులైన వారికే అందించడం, నకిలీ కనెక్షన్లను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతాలో పడే రాయితీ డబ్బులు నిలిచిపోవడంతో పాటు సిలిండర్ బుకింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధారణ కనెక్షన్ ఉన్నవారు..ఉజ్వల పథకం లబ్ధిదారులు ఆధార్ కార్డు ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. గ్యాస్ డెలివరీ ఇచ్చే వ్యక్తి వద్ద బయోమెట్రిక్ ద్వారా లేదా నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా కేవైసీ చేసుకునే అవకాశం ఉంది. చాలా చోట్ల ఒకే పేరు మీద లేదా ఒకే ఇంట్లో అనర్హులు కూడా సబ్సిడీ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి నకిలీ కనెక్షన్లను ఏరివేసి.. కేవలం అర్హులైన పేదలకు మాత్రమే సబ్సిడీ అందించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రతి కస్టమర్ తమ ఆధార్ కార్డు వివరాలను గ్యాస్ కనెక్షన్‌తో సరిచూసుకోవాల్సి ఉంటుందని లోకల్ గ్యాస్ ఏజన్సీలు పేర్కొంటున్నాయి.

ఓసీల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి

0

• ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయం వద్ద ఓసి జేఏసీ సమావేశంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీ విద్యార్థులకు టెట్ అర్హత మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితి పెంచాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను ఎలాంటి షరతులు లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ కు కేటాయించిన బ్యాక్ లాగ్ పోస్టులను అదే వర్గంతో వెంటనే భర్తీ చేయాలని, సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం జనవరి 11న నిర్వహించే ఓసిల సింహగర్జన సభకు అన్ని ఓసి సామాజిక వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐకాస నాయకులు కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుతో పాటు వివిధ మండలాల ఐకాస నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సారబుడ్ల రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కంకనాల సరోజన, జిల్లా అధ్యక్షుడు కొనిషెట్టీ మునీందర్, మ్యాకల సంపత్ రెడ్డి, పేరాల ప్రభాకర్ రావు, సారాబుడ్ల వెంకట్ రెడ్డి, అయిత రాజేందర్, కంకణాల జనార్ధన్ రెడ్డి, సారాబుడ్ల లింగారెడ్డి తదితరులతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

జాతీయ రోడ్డు భద్రత..ప్రతి ఒక్కరి బాధ్యత

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్.జాతీయ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తోందని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గుండా రామ స్వామి తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లా న్యాయం సదనంలో మంగళవారం ఆటో, లారీ, ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలుపుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రామస్వామి మాట్లాడుతూ.. లైట్‌ మోటార్‌ వెహికల్‌ నడిపే వాహనదారులు డ్రైవింగ్‌ సీట్‌ బెల్ట్‌ తప్పకుండా ధరించాలని, సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని తెలిపారు. 18 సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు  ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ అవగాహన సదస్సులో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌసిల్ దాసరి గంగారం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలె తదితరులు పాల్గొన్నారు.

త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ రామానుజ జీయర్ స్వామిని కలిసిన లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ రామానుజ జీయర్ స్వామిని  లోక ప్రవీణ్ రెడ్డి ఆదివారం కలిశారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ లో తన స్నేహితుడు టీ ఎల్ మనోహర్ స్వామి స్వగృహం శ్రీ లక్ష్మీ నృసింహ నిలయానికి వచ్చిన దేవనాథ స్వామిని తన తల్లి లోక పద్మ, పిన్ని గంగుతాయితో కలిసి లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

అన్నపూర్ణదేవి డెవలపర్స్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అన్నపూర్ణదేవి డెవలపర్స్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని APD కార్యాలయంలో 2026 సంవత్సరపు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. బ్రాంచి మేనేజర్ సుధీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, రమేష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పరమేష్, సంతోష్, యువ నాయకులు దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.

 

అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి?

0

అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి?

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది. శివాజీ చౌక్ నుంచి వెళ్లే రహదారిపై గుంతలు పడ్డాయి. మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో నీరు రోడ్డుపై చేరి గుంతలమయంగా మారింది. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో  రోడ్డు పరిస్తితి అధ్వానంగా మారిందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వార్డు సభ్యులు, మాడ లక్ష్మీ, ఆత్రం దశరథ్ కోరారు.

బేల హై స్కూల్లో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ ప్రారంభం 

0

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ ను మండల విద్యాధికారి మహాలక్ష్మి, తహసీల్దార్ రఘునాథ్ రావ్, సర్పంచ్ భాగ్యలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆధార్ సెంటర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోని మండలంలో మూడు ఆధార్ ఇంటిగ్రేటేడ్ సెంటర్ లను మంజూరు చేశారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ అప్డేట్ కోసం చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో మండలానికి మూడు ఇంటిగ్రెటెడ్ ఆధార్ సెంటర్ లని మంజూరు చేశారన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి_ డా.సర్ఫరాజ్

0

 * కోలాం ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని డా.సర్ఫరాజ్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలము అంకోలి కోలాం ఆశ్రమ పాఠశాలలో ప్రతి నెల మాదిరిగానే  శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు జలుబు, దగ్గు, గోకడం లాంటి లక్షణాలు కల్గిన  23 మంది పిల్లలను గుర్తించామని, వారికి పరీక్షలు జరిపి ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి పర్యవేక్షణలో మందులు అందజేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటది అన్నారు. వేడి అన్నం, గోరు వెచ్చని నీరు విద్యార్థులకు ఇవ్వాలనన్నారు. వంట గది పరిశుభ్రతను నిర్వాహకులకు, ఇంఛార్జీ వార్డెన్ కు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజార్ ఆడే సురేష్, ఆరోగ్య కార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, పవర్ ప్రేమ్ సింగ్, మరప ముయ్యాల, మోతి స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు