Home Blog Page 58

ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0

ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తర్నం (కే) గ్రామంలో డాక్టర్ స్వప్న ఆర్ బీ ఎస్ కే  ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నవారికి రక్త నమూనాలను సేకరించి రక్త పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. డాక్టర్ స్వప్న రోగులతో మాట్లాడుతూ..అందరూ శుభ్రంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. జ్వరాలు వస్తే వస్తే డాక్టర్లను సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మకూడదని ఎప్పుడు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారని అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ఓం ప్రకాష్. ఏఎన్ఎంలు సుజాత, గంగామణి, మందుల శ్యామల, అంగన్వాడీ సిబ్బంది ఉమా, ఆశ, ఆనందబాయి తదితరులు ఉన్నారు.

బాసరలో ఘనంగా ప్రారంభమైన  దేవీ  శరన్నవరాత్రి ఉత్సవాలు

0

బాసరలో ఘనంగా ప్రారంభమైన  దేవీ  శరన్నవరాత్రి ఉత్సవాలు

*తొలి రోజు శైలపుత్రి అవతారంలో  అమ్మవారు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రులు ఉత్సవాలు సోమవారం అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపంలో అమ్మవారు మొదటిరోజు శైల పుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించడంతో ఆమెకు శైలపుత్రి అని, వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో  కమలంతో, తలపై చంద్రవంకను ధరించి  విరాజిల్లుతుంది. ఈ అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ వేద పండితులు, అర్చకులు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలతో  శైల పుత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు.

భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్

0

🏟️ మ్యాచ్ వేదిక

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై రెండు జట్లకు మద్దతు ఇచ్చారు.


🏏 టాస్ & జట్టు ప్రణాళిక

  • భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ – “పిచ్ పరిస్థితులు మా బౌలర్లకు సహాయపడతాయి, అలాగే వాతావరణం కారణంగా బ్యాటింగ్ కాస్త కష్టంగా ఉంటుంది” అన్నారు.

  • పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాటింగ్‌లో మంచి ఆరంభం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


🔥 జట్టు మార్పులు

  • భారత్ తమ పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకుంది.

  • పాకిస్తాన్ మాత్రం తమ గత మ్యాచ్ కాంబినేషన్‌లోనే కొనసాగింది.


🤝 ఆట వెలుపల ఉద్రిక్తతలు

  • టాస్ తర్వాత భారత ఆటగాళ్లు మళ్లీ పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడం చర్చనీయాంశమైంది.

  • రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తత ఈ టోర్నమెంట్‌లో కూడా ప్రభావం చూపుతున్నాయి.


📊 మ్యాచ్ ముఖ్య దృశ్యాలు (Highlights)

  1. భారత్ బౌలింగ్ – బుమ్రా మరియు సిరాజ్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను ఒత్తిడికి గురి చేశారు.

  2. పాకిస్తాన్ బ్యాటింగ్ – బాబర్ ఆజమ్ మరియు రిజ్వాన్ కొంత వరకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.

  3. స్పిన్ దాడి – కుల్దీప్ యాదవ్, జడేజా మధ్య ఓవర్లలో కీలక బ్రేక్‌త్రూ ఇచ్చారు.

  4. ఫీల్డింగ్ – భారత్ పక్కా ఫీల్డింగ్ చేసి కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టింది.


✅ విశ్లేషణ & ప్రభావం

  • భారత్ బౌలింగ్ శక్తి మళ్లీ రుజువైంది.

  • పాకిస్తాన్ బ్యాటింగ్ టాప్-ఆర్డర్ కొంత అస్థిరంగా కనిపించింది.

  • రెండు జట్ల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తత ఆటలో కూడా కనిపించింది, దీంతో మ్యాచ్ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ

0

AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల  కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISF ఆధ్వర్యంలో భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ –2025 నిర్వహించారు. ఈ పరీక్షలో వివిధ పాఠశాలలకు చెందిన 650 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్ష విద్యార్థులలో  షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తి, దేశభక్తి, విద్యపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో నిర్వహించారు. విద్యార్థులు పోటీ ఉత్సాహంతో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పరీక్షా కేంద్రంలో క్రమశిక్షణతో పాటు న్యాయంగా పరీక్షలు జరిగేలా ఉపాధ్యాయులు, స్వచ్ఛందకారులు పర్యవేక్షించారు. ఆయోజకులు విద్యార్థుల స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తి, బాధ్యత, విద్యపై నిబద్ధత పెంపొందించేందుకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫలితాలు సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి రోజున  ప్రకటించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శి మున్సిఫ్ ప్రేమ్ సంతోష్ ముక్రముద్దీన్, సీపీఐ నాయకులు నరేష్, కార్తీక్ సాయి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

0

ఉత్తమ ఉపాధ్యాయున్ని సన్మానిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్,నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు జాదవ్అంబారావును (ఏహెచ్ఎస్ కుంటాల) నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శాలువాకప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మండల అధ్యక్షులు అల్లూరి శివారెడ్డి, సురేందర్ జాదవ్, రాథోడ్ నారాయణ, .గెర్జామ్ మాజీ ఎంపీటీసీ శుద్ధవర్ వెంకటేష్, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు ఉన్నారు.

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి

0

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి

చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆసాల సదాశివ్ అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ (బీ)లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు కొండ ఎర్రన్న,  శ్రీరామ్, శంకర్, రాజేశ్వర్, గణేష్ , రవీందర్, సాయికిరణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు  నారాయణరెడ్డి, గంగయ్య, భోజన్న, లక్ష్మణ్, కుల బాంధవులు పాల్గొన్నారు.

బోథ్ లో ముస్తాబవుతున్న దుర్గ మండపం

0

బోథ్ లో ముస్తాబవుతున్న దుర్గ మండపం

*శ్రీమాత ఈవెంట్స్ ఆధ్వర్యం లో అద్భుత సెట్టింగ్

*ప్రతి యేటా వినూత్న అలంకరణతో ఆకట్టుకుంటున్న మండపం

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలోని దుర్గ మండపం నవరాత్రులకు అందంగా ముస్తాబు అయింది. ప్రతి సారి వినూత్నంగా (కొత్తగా) సెట్టింగ్ తో ముందుకు వచ్చే దుర్గ మండపం ఈ సారి శ్రీ మాత ఈవెంట్స్ ఆధ్వర్యంలో కలకత్తా మాత సెట్టింగ్ తో అందంగా ముస్తాబు చేశారు. అయితే సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయని, సోమవారం ఉదయం 11 గంటలకు దేవి శోభాయాత్ర మొదలు అవుతుందని దుర్గ కమిటీ అధ్యక్షుడు పాలిక్ రమేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక సెట్టింగ్ అందిస్తున్న శ్రీ మాత ఈవెంట్స్ కి దుర్గ కమిటీకి తరుపున ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా బతుకమ్మ సంబరాలు

0

ఘనంగా బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజ్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డా. గెడం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వింగ్ ఇంఛార్జి పుష్ప మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సైన్స్ తో ముడిపడి ఉంది అని, బతుకమ్మ పండుగ లో ఉపయోగించే తంగేడు పూలు, గునుగు పూలు నీళ్ళ లో నిమజ్జనం చేయడం వలన నీళ్ళలో ఉండే సూక్ష్మజీవులు నశించి నీళ్లు శుభ్రం అవుతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఐసీసి మెంబర్  ప్రియాంక,   సీనియర్ అధ్యాపకులు ఆమోల్, బిందు, సౌందర్య, విజయ, సంజీవ్, అనికేత్, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

0

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ముఖ్య అతిథిగా ముథోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలపరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకోసం సీపీ చైర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్‌ఎం కిట్లు అందజేసిందన్నారు. రూ.47లక్షలు ఖరీదుచేసే ఉపకరణాలను దివ్యాంగులకు  అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదు..ఇది సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగన్నారు. ఈ పరికరాలు చైతన్యం,  ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ రోజు లబ్ధిదారుల ముఖాల పై కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఆదివాసీ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి

0

ఆదివాసీ రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐ ను వెంటనే సస్పెండ్ చేయాలి

చిత్రం న్యూస్, బేల: యూరియా కోసం తెల్లవారుజాము నుండి లైన్లో తరబడి నిలబడ్డ రైతుపై ఏఎస్ఐ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రాందాస్ అన్నారు. శనివారం బేల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆదివాసీ రైతుపై దాడి చేసిన ఏఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుపై ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదు అన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు అవినాష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.