Home Blog Page 57

రాజకీయాలకతీతంగా అభివృద్ధి: ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 

0

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో ( బైంసా ):  రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు మంగళవారం కుభీర్ మండలంలోని మాలేగం గ్రామంలో బైంసా నుండి మిర్జాపూర్, లింగా, కుంబి, నిగువ మహారాష్ట్ర బార్డర్ వరకు రూ.20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత పది సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారి బాగు చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానని, అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే మంత్రి కొండా సురేఖ సమక్షంలో భిక్షాటన చేసైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ప్రోటోకాల్ ప్రకారం అందరిని విన్నవిస్తూ దశలవారీగా నిధులు తెచ్చుకుంటున్నామని తెలిపారు.ప్రజాస్వామ్య బద్దంగా సర్పంచులు వ్యవహరించాల్సిందిగా సూచించారు, తప్పు చేస్తే తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అభివృద్ధి పనులు చేయడానికి ఎప్పుడూ స్వాగతిస్తానని, కానీ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన వద్ద ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని, రాజకీయాలకు అతీతంగా అందరి పనులు చేస్తానని తెలిపారు, బాసర సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం తనపై ఉందని, తన హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నానాన్నారు. రెండున్నర సంవత్సరాలలో పార్టీలకు అతీతంగా నాలుగువేల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,ఆయా గ్రామ సర్పంచులు పాల్గొన్నారు

HRC కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

0

చిత్రం న్యూస్, డెస్క్:  నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మాహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కవాడిగూడ కు చెందిన శ్రావణి అనే మహిళ తనని గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకొని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. సదరు మహిళను హెచ్చార్సీ సిబ్బంది కమిషన్ చైర్మన్ వద్దకు తీసుకెళ్లారు.ఈ ఘటనతో హెచ్ఆర్సీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతోంది.

శనగ పంట కొనుగోలు చేయాలి: ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్

0

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గత రెండు రోజులుగా బర్దాన్ (గన్నీ బ్యాగుల) కొరత కారణంగా శనగ కొనుగోళ్లు నిలిచిపోవడంపై కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సంచులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తుండటం, మరోవైపు తెచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంట కొనుగోళ్లు ప్రారంభించిన కేవలం మూడు రోజులకే బర్దాన్ లేదనే సాకుతో రెండు రోజులుగా బంద్ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

మరికొద్ది రోజుల్లో జొన్న పంట కూడా కోత దశకు వస్తుందని, ఈలోపే శనగ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బర్దాన్ సరఫరా చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా శనగలను కొనుగోలు చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్యేను సన్మానించిన బాసర ఆలయ పూజరులు 

0

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కృషి అమోఘమని, ఆయన సేవలు నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆలయ పూజరులు, గ్రామస్తులు అన్నారు. మంగళవారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి భూమి పూజ చేయడం ఏంతో lసంతోషాన్ని కలిగించిందన్నారు. తన మనవడికి ఇక్కడే అక్షరాభ్యాసం చేయించి,, పెద్ద మొత్తం లో ఒకే సారి నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు మార్లు అసెంబ్లీలో బాసర సమస్యపై మాట్లాడటం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ పూజరులు, బీజేపీ కార్యకర్తలు పుట్నాల సాయినాథ్, సిహెచ్ సాయినాథ్, పోగుల రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

0

చిత్రం న్యూస్, కాగజ్ నగర్: మండలంలోని బసంతీ నగర్ గ్రామ పంచాయితీ పరిధిలో గల విలేజ్ నంబర్ – 7లో నూతనంగా రూ.12 లక్షల అంచనాతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రాతంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసెంబ్లీలో తాను ప్రస్తావించానని, దాని ఫలితంగా అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరుగుతోందని, భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలలో కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ భాస్కర్, సర్పంచులు రియా రాయ్, బికాస్ ఘరామీ, అంగన్వాడీ సూపర్ వైజర్లు చందన, భాగ్యలక్షి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబు, గంగారాం, పాఠశాల చైర్మన్ జయదేవ్ దాస్, అంగన్వాడీ టీచర్ రంజిత, భాజపా జిల్లా కార్యదర్శి సమీర్ గుప్తా, అమిత్ బిశ్వాస్, రణ్వీర్ బిశ్వాస్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కుంటాల మండలంలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో వనజ 

0

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఎంపీడీవో అల్లాడి వనజ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, పురోగతిపై ఆమె సమీక్షించారు.గ్రామంలో కొనసాగుతున్న పనుల నాణ్యతను ఎంపీడీవో అల్లాడి వనజ క్షుణ్ణంగా పరిశీలించారు. కూలీల హాజరు నమోదు, పని ప్రదేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇటీవల ప్రవేశపెట్టిన ముఖచిత్ర హాజరు విధానం గురించి ఎంపీడీవో ఉపాధి కూలీలకు వివరించారు. ఈ విధానం ద్వారా బినామీలకు తావులేదని, సాంకేతిక సహాయకులు జై సింగ్ కొలతలు తీసి, పనిచేసిన దానికి అనుగుణంగా చెల్లింపులు జరిగేలా చూస్తారని తెలిపారు. ఇది పారదర్శకతను పెంచుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కొత్త విధానం వల్ల పనుల పర్యవేక్షణ మరింత మెరుగుపడుతుందని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయని ఎంపీడీవో భరోసా ఇచ్చారు. కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొండూరు భోజన్న, సీనియర్ మేట్ ముస్కు ముత్యం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలపై కూలీల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు.

నటి సుభాషిణి ఆత్మహత్యాయత్నం..కుటుంబ లే కారణమా?

0

చిత్రం న్యూస్, డెస్క్:  తమిళ బుల్లితెర నటి సుభాషిణి (36) ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నైలోని పోరూరులో ఉన్న ఆమె నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.శ్రీలంకకు చెందిన సుభాషిణి, బెంగళూరుకు చెందిన బిబిన్ చంద్రను వివాహం చేసుకున్నారు. వృత్తిరిత్యా షూటింగ్‌ల కోసం ఆమె చెన్నైలో ఒంటరిగా నివసిస్తుండగా.. భర్త బెంగళూరులో ఉంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఆదివారం రాత్రి సుభాషిణి తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాగ్వాదం అనంతరం సుభాషిణి తీవ్ర మనస్తాపానికి గురై, వీడియో కాల్ ముగిసిన వెంటనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తతో ఉన్న కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆమె స్నేహితులు కూడా పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సుభాషిణి కేవలం నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుకుగా ఉండేవారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కయల్’ సీరియల్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కథానాయికగా కూడా నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడిని తట్టుకోలేకపోయారని తెలుస్తోంది.ఘటన గురించి సమాచారం అందుకున్న పోరూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వీడియో కాల్‌లో అసలు ఏం జరిగింది? ఏ విషయమై గొడవ పడ్డారు? అనే కోణంలో పోలీసులు బిబిన్ ను కూడా విచారించే అవకాశం ఉంది.

మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన: నెలాఖరులోగా లబ్ధిదారులకు అప్పగింతకు ఆదేశాలు

0

చిత్రం న్యూస్,మిర్యాలగూడ: మిర్యాలగూడలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సోమవారం పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసి, ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతిని ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్లలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు తాగునీటి సరఫరా, విద్యుత్, ప్లంబింగ్, టాయిలెట్లు, కిచెన్ ఏర్పాట్లు, రోడ్లు, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.లబ్ధిదారులకు నాణ్యమైన వసతులు కల్పించడంలో ఎటువంటి రాజీ పడకూడదని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇళ్లన్నీ సిద్ధం చేసి, ఈ నెల చివరి నాటికి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో (ముథోల్ ) : జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర లో సోమవారం ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ అభిలాష అభినవ్ వివరిస్తూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు నిర్మల్‌లో ప్రసిద్ధిగాంచిన కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్‌ను జ్ఞాపికలుగా కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్, బైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్య, దత్తాత్రి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి: విద్యుత్ వాహనాలు, సోలార్ పంపుల కోసం దరఖాస్తుల స్వీకరణ

0

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై విద్యుత్ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపులు, కంట్రోల్ యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాకు 253 యూనిట్లు కేటాయించగా, మొత్తం రూ.348.46 కోట్లు మంజూరు చేశారు.ఈ పథకం కింద యువతకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ పరికరాల యూనిట్లు అందించనున్నారు. ద్విచక్ర వాహనాలకు 90% సబ్సిడీ, మూడు చక్రాల వాహనాలకు 70% సబ్సిడీ, సోలార్ యూనిట్లకు 60% సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా వాహనాలకు), రెండెకరాల భూమి, పట్టాదారు పాస్ బుక్ (సోలార్ పంప్ సెట్లకు) వంటి పత్రాలతో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల గడువును ఏప్రిల్ 08 వరకు పొడిగించారు.పథకాలకు దరఖాస్తు చేసుకునేవారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21-60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందినవారు, దళితబంధు లబ్ధిదారులు అనర్హులు. మహిళలకు 33%, దివ్యాంగులకు 5% కోటా కేటాయించారు.