Home Blog Page 56

బాసరలో వరద బీభత్సం   

0

బాసరలో వరద బీభత్సం   

*వచ్చే భక్తులకు తప్పని కష్టాలు

*గోదారమ్మ శాంతించమ్మ అంటూ ప్రజల వేడుకోలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని  పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి   బాసరలో  గోదారమ్మ వరద బీభత్సం   సృష్టిస్తోంది. శాంతించామ్మ అంటూ బాసర మండలంలోని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. బాసరలో ఒకపక్క శారదియా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం మరోపక్క రైతులు, వ్యాపారుల కష్టాలు మొదలయ్యాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరాయి. ఉత్సవాలను పురస్కరించుకొని గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. గంట గంటకు గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఎవరు అటువైపు వెళ్ళకుండా నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నది లోతట్టు ప్రాంత రైతులు, ఆలయ పరిధిలో ఉన్న దుకాణ యజమానులు నీటి ప్రవాహంతో వ్యాపార కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ అవసరాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వచ్చేందుకు గత 15 రోజుల నుండి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మ అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ

0

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ

చిత్రం న్యూస్,నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు అనిల్ యాదవ్ తండ్రి శంకర్ యాదవ్ అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా నిర్మల్ లో గల ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటావని అధైర్యపడద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిత్య హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడారు. శంకర్ యాదవ్ అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వీరి వెంట నాయకులు తదితరులు ఉన్నారు.

అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్

0

అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన  హనుమాన్ మందిరం వద్ద షెడ్ ను  కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ మంగళవారం ప్రారంభించారు. గత వారం రోజుల ముందు బుద్ధికొండ గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి నూతన హనుమాన్ మందిర్ వద్ద రేకుల షెడ్డు అవసరం ఉందని ఆడే గజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. అడిగిన వారం రోజుల్లోనే షెడ్ నిర్మించిన ఆడే గజేందర్ కి గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్, ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దుర్కి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మచారిణీ అవతారంలో  బాసర అమ్మవారు 

0

బ్రహ్మచారిణీ అవతారంలో  బాసర అమ్మవారు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుడి చేతిలో జప మాల,ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. అమ్మ  నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుందని భక్తుల ప్రతీతి.  ఆలయ వేద పండితులు అర్చకులు అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజ నిర్వహించి నైవేద్యంగా పులిహోరను సమర్పించారు. ఆలయ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గోదావరి నది ఒడ్డున నదిలో భక్తులను లోపలికి వెళ్ళకుండా బారికేడ్ ను ఏర్పాటు చేశారు

ముథోల్‌లో గుంతలమయంగా రహదారి

0

ముథోల్‌లో గుంతలమయంగా రహదారి

*ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా  ముథోల్‌ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు రహదారి గుంతలమయంగా మారింది. దీంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డంతా భారీ గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలు వెళ్లేటప్పుడు నీళ్లు ఎగసి పక్కన నడుస్తున్న వారిపై పడుతున్నాయి. గతంలో తాత్కాలికంగా చేసిన మరమ్మతులు వర్షాలకు కొద్ది రోజుల్లోనే ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాకపోకలు కష్టసాధ్యంగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా పూడ్చివేసే పనులు కాకుండా, శాశ్వతంగా కొత్త రహదారి వేయాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరామర్శ

0

బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరామర్శ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన బొడ్డు నవీన్ (మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి)  మామ  సంటి నర్సింలు ప్రమాదానికి గురైన విషయాన్ని నవీన్ ద్వారా తెలుసుకున్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన రిమ్స్ డైరెక్టర్, వైద్యాధికారులతో మాట్లాడి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.  శ్రీకాంత్ రెడ్డి వెంట మావల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్

0

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్

*గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్ మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు కిసాన్ మోర్చా మండల కార్యదర్శి ఉయిక గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గస్కంటి సంజీవ్, బీజేపీ నాయకులు చెట్పల్లి సంతోష్, రవి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా  మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం చెట్పల్లి వెంకటేష్ మాట్లాడుతూ..రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని అనిల్ జాదవ్ నాయకత్వంలొనే బోథ్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ విజయడంఖా మోగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త కంకణం కట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, దేవేందర్ రెడ్డి, నాయకులు సాబ్లే సంతోష్ రాథోడ్ రాజశేఖర్, రాథోడ్ సురేందర్, గులాబ్, లక్ష్మణ్, గణేష్ నాయక్, మాజీ సర్పంచ్ మురళి, గోపి, వెంకటరమణ, చవాన్ రాంకుమార్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రిని కలిసిన సామ రూపేష్ రెడ్డి

0

తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక,పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదారాబాద్ లోని అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉన్నా సిబ్బంది లేక ఎందరో మంది క్రీడాకారులు ప్రతిభ ఉన్న ముందుకు వెళ్ళలేకపోతున్నారని ఆయనకు తెలిపారు. ఆదివాసీల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆటల పోటీల్లో ముందుండే యువకులు ఉన్నా కోచ్ లు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆయనకు తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ ని నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు ఉందని,  ఇంటర్మీడియట్ వరకు పెంచాలని ఆయన్ను కోరారు. అదేవిధంగా క్రికెట్ ఆడడానికి స్టేడియం కూడా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

0

రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా మండలంలోని గిర్నూర్ గ్రామములో రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. బతుకమ్మ సంబరాలు అనగానే గుర్తుకు వచ్చేది గౌరమ్మ పూజ. అలాంటి గౌరమ్మకి పూజా చేసి విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సామల స్వర్ణలత మాట్లాడుతూ..బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ పండగకి ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి  పుట్టింటికి చేరుకొని పువ్వుల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న నీటి కుంటలలో నిమజ్జనం చేస్తారని విద్యార్థులకి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఆధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రైవేట్ బస్సు బోల్తా

0

ప్రైవేట్ బస్సు బోల్తా

*బెంగుళూరు నుండి నేపాల్ కు పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం సాకేరా గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. బెంగుళూరు నుండి నేపాల్ కు పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. పక్కనే ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారి కాకుండా చిన్న రహదారిగుండా ట్రావెల్స్ బస్సు ప్రయాణించడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. RTO తనిఖీ కేంద్రాలు, స్టేట్ పర్మిట్ లు తప్పించేందుకు ట్రావెల్స్ సంస్థలు చిన్న దారులను ఎంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.