Home Blog Page 53

కోట కలిదిండిలో అమ్మవారిని దర్శించుకున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

0

కోట కలిదిండిలో అమ్మవారిని దర్శించుకున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

చిత్రం న్యూస్, కైకలూరు: శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కలిదిండి మండలం కోట కలిదిండి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. కోరుకొల్లు DC చైర్మన్ పేటేటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన 7వ రోజు సరస్వతి దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నానన్నారు. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు

0

కనకదుర్గమ్మను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు

చిత్రం న్యూస్, విజయవాడ: మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ స్లాట్ సమయంలో సతీ సమేతంగా వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు.  శాలువా కప్పి సన్మానం చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం

0

శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం

*మూల నక్షత్రం సందర్భంగా బాసరలో భక్తుల సందడి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.  శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి మూల నక్షత్రం శుభదినం సోమవారం  కావడంతో అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపిస్తుంది. శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజు శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వైదిక బృందం అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. ఆలయానికి భక్తులు వేకువజాము నుంచి గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. క్యూలో నిలబడ్డ వారికీ ఆలయ అధికారులు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మంచి నీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవి,  ముథోల్ సీఐ మలేష్, ఎస్సై బి.శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆసియా కప్ 2025 ముఖ్యాంశాలు

0

ఆసియా కప్ 2025 ముఖ్యాంశాలు – భారత్ ఘనవిజయం

పరిచయం

ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగింది. ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ పోటీలో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, రికార్డు ప్రదర్శనలు, వివాదాలు అన్నీ కలగలిసి అభిమానులకు మరపురాని అనుభవాన్ని అందించాయి.


పాల్గొన్న జట్లు

  • పూర్తి సభ్యులు: ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్

  • అనుబంధ జట్లు: UAE, ఒమాన్, హాంకాంగ్


సూపర్ 4 దశ హైలైట్స్

  • శ్రీలంక, భారత్‌ను సూపర్ ఓవర్ వరకు నెట్టిన థ్రిల్లర్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది.

  • ఆ మ్యాచ్‌లో భారత్ 200+ పరుగులు చేసి, సిరీస్‌లో అతిపెద్ద స్కోరు నమోదు చేసింది.

  • సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపొందినప్పటికీ, శ్రీలంక పోరాటస్ఫూర్తి చర్చనీయాంశమైంది.


ఫైనల్: భారత్ vs పాకిస్తాన్

  • తేదీ: సెప్టెంబర్ 28, 2025

  • స్థలం: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

  • పాక్ స్కోరు: 146 (19.1 ఓవర్లలో)

  • భారత్ స్కోరు: 150/5 (19.4 ఓవర్లలో)

  • ఫలితం: భారత్ 5 వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.

  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ (69 పరుగులు)


వ్యక్తిగత విజయాలు

  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: అభిషేక్ శర్మ (314 పరుగులు)

  • అత్యధిక వికెట్లు: కుల్దీప్ యాదవ్ (17 వికెట్లు)

  • ఈ విజయం భారత్‌కు 9వ ఆసియా కప్ టైటిల్.


వివాదాస్పద ఘట్టాలు

  • ఫైనల్ తర్వాత భారత జట్టు ACC అధ్యక్షుడు మోహ్సిన్ నక్వీ చేత ట్రోఫీ స్వీకరించడానికి నిరాకరించింది.

  • అవార్డు కార్యక్రమం ఆలస్యమై, అభిమానుల్లో చర్చలు రేగాయి.

  • భారత్ టోర్నమెంట్‌లో 12 క్యాచ్‌లు వదిలేయడం ఒక మైనస్ పాయింట్‌గా నిలిచింది.

  • BCCI జట్టుకు రూ. 21 కోట్ల బోనస్ ప్రకటించింది.


ముగింపు

ఆసియా కప్ 2025 ఉత్కంఠభరిత పోటీలు, రికార్డు ప్రదర్శనలు, భారత్-పాక్ ఫైనల్ ఉత్కర్షతో క్రీడాభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ విజయం భారత్‌ను మరింత బలమైన జట్టుగా నిరూపించగా, క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా మారింది.

బాసర అమ్మవారి సన్నిధిలో నిర్మల్ కలెక్టర్ దంపతుల పూజలు 

0

బాసర అమ్మవారి సన్నిధిలో నిర్మల్ కలెక్టర్ దంపతుల పూజలు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో కొలువుదిరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. మూల నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు.  శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

శ్రీ దుర్గామాత వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు

0

శ్రీ దుర్గామాత వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు

*ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న దీపోత్సవాలు

*కనుల పండువగా జరుపుకుంటున్న గ్రామస్తులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె ) గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత.. శ్రీ మహా సరస్వతి దేవి అలంకారంలో గ్రామస్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్తులు దేవి నవరాత్రుల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం దుర్గాదేవి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు మహిళలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛరణాలతో శ్రీ మహా సరస్వతి దేవి అమ్మవారికి హారతులు ఇచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా అటుకులు, బెల్లం కొబ్బరి అన్నం సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. అందరూ  సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మ వారిని వేడుకున్నారు.

గోదావరి నదిని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ డా. జానకి షర్మిల

0

గోదావరి నదిని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ డా. జానకి షర్మిల

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఎస్పీ డా.జానకి షర్మిల సందర్శించారు. ఆలయ సమీపంలోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న  నేపథ్యంలో స్నాన ఘట్టం పరిస్థితిని పరిశీలించారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పూర్తిగా నిండిపోయిందని, భక్తులను లోనికి అనుమతించవద్దని సూచించారు. సోమవారం మూల నక్షత్రం ఉండడంతో బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ వెల్లడించారు. ఏఎస్పీ అవినీష్ కుమార్,  ముథోల్ సీఐ మల్లేష్, బాసర ఎస్సై బి.శ్రీనివాస్ ఉన్నారు.

బాసరలో మూల నక్షత్రం అక్షరాభ్యాసాలు

0

బాసరలో మూల నక్షత్రం అక్షరాభ్యాసాలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాస‌ర ఆల‌యం నుంచి గోదావ‌రి న‌ది తీరం వ‌ర‌కు ఉన్న వీధి ముంపున‌కు గురైంది. ప‌లు లాడ్జీల్లోకి వ‌ర‌ద నీరు ప్ర‌వేశించింది. అలాగే గోదావ‌రి స్నానపు ఘాట్‌లు మూసివేశారు. గోదావ‌రిలో పుణ్య స్నానాల‌కు పోలీసులు అభ్యంత‌రం చెబుతున్నారు. ఏటా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేక దర్శన అక్షరాభ్యాస పూజ, క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. మూల నక్షత్రం శుభ ముహూర్తం సందర్భంగా ఆలయం తరపున చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు ఆల‌య‌ ఈఓ అంజ‌నీదేవి తెలిపారు. శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం (రేపు) అమ్మవారి జ‌న్మ‌న‌క్ష‌త్రమైన మూల నక్షత్రం సందర్భంగా శ్రీ‌ జ్ఞాన స‌ర‌స్వ‌తి అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హిస్తారు. ఈ క్ర‌మంలోనే పిల్ల‌ల‌కు అక్ష‌రాభ్యాసాలు నిర్వ‌హిస్తారు. ఇందుకు దేశ న‌లుమూల‌ల నుంచి ఇక్క‌డ‌కు వేలాదిగా భ‌క్తులు త‌మ పిల్ల‌ల‌ను వెంట వేసుకుని వ‌స్తారు. అయితే ప్ర‌స్తుతం గోదావ‌రి లో నీటి ఉధృతి అధికంగా ఉంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారి సర్వ దర్శనానికి , రూ.150ల అక్షరాభాస పూజలకు ఆలయ అతిథి గృహాల నుండి రహదారి పై పోలీస్ స్టేషన్ వైపు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయాల అతిథి గదుల వద్ద ప్రత్యేక రూ.1000 ల అక్షరాభ్యాస‌ పూజ, రూ.100 స్పెషల్ దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేశారు.

ఆన్ లైన్ లో రూ.1000 టిక్కెట్లు…నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రూ.1000 ల అక్షరాభ్యాస పూజ టికెట్లను అందుబాటులో ఉంచారు. టిపోలియో అప్ ద్వారా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవ‌చ్చ‌ని ఆల‌య అధికారులు తెలిపారు. ఆన్లైన్ లో టిక్కెట్‌ బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బయో టాయిలెట్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్  తరపున రెండు బయో టాయిలెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

బాసరలో గోదావరి ఉధృతి..

బాసరలో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నెలరోజుల వ్యవధిలో రెండోసారి లాడ్జీలు, కాటేజీలను వరద ముంచేసింది. గోదావరి వరదలతో శార‌దీయ న‌వ‌రాత్రుల‌కు వ‌చ్చిన‌ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు మూలనక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో గోదావరి వరద ముంచెత్తడంతో.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ ను వరద ముంచేయడంతో నదీ స్నానాలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కాటేజీల్లో ఉన్న భక్తులను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావ‌రి శాంతించు అని భ‌క్తులు కోరుతున్నారు. లేకుంటే భ‌క్తులకు ఇబ్బందులు త‌ప్ప‌వని ప‌లువురు భావిస్తున్నారు.

ప్రిన్సిపాల్  వరప్రసాద్ కు మాతృ వియోగం

0

ప్రిన్సిపాల్  వరప్రసాద్ కు మాతృ వియోగం

* ప్రముఖుల పరామర్శ

చిత్రం  న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. వేముగంటి వరప్రసాదరావు కు మాతృ వియోగం కలిగింది. ఆయన పెద్దమ్మ  వేముగంటి మనోహారమ్మ ఈ నెల 24 న అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సోదరుడిని ప్రముఖులు పరామర్శించారు.  మానకొండూర్ శాసన సభ్యులు డా. సత్యనారాయణ, పీసీసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు సోదరుడు హర్కర ప్రసాదరావు పరామర్శించారు.  కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాలరాత్రి అలంకారంలో బాసర అమ్మవారు

0

కాలరాత్రి అలంకారంలో బాసర అమ్మవారు

చిత్రం న్యూస్, బాసర:  నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాలరాత్రి  అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు . ఆదివారం కావడంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.  అమ్మవారికి ఆలయ అర్చకులు వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణాలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో చేసిన కిచిడిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు . భక్తులు వేకువ జాము నుంచి తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు . భక్తులు బారులు తీరడంతో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవి ఏర్పాట్లు చేశారు. బాసర ఎస్సై బి.శ్రీనివాస్  ప్రత్యేక బందోబస్తు చేపడుతున్నారు