చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్.జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ఆవరణలో న్యాయవాద పరిషత్ 2026 క్యాలెండర్ ను ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, ఆదిలాబాద్ ప్రభారి మంగులాల్ తో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగులాల్ మాట్లాడుతూ.. న్యాయవాద పరిషత్ న్యాయవాద సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని నిరుపేదలకు, న్యాయసేవలు అందించడానికి కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చంద్ర మోహన్, ఉమేష్ రావు డోలె, న్యాయవాదులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు పూర్తి సహకారం అందిస్తాం_మున్సిపల్ మాజీ ఛైర్మన్ జోగు ప్రేమేందర్
చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ మాజీమంత్రి జోగు రామన్న క్రీడాకారుల దాగి ఉన్న ప్రతిభను గుర్తించేలా వివిధ క్రీడలకు సంబంధించిన పోటీలకు పూర్తి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. సోమవారం సాత్నాల మండలం సైద్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమేందర్ ప్రారంభించారు. క్రీడాకారులు పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు.. క్రికెట్ ఆడుతూ క్రీడా స్ఫూర్తిని చాటారు. ముందుగా గ్రామస్తులు పూల పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.జోగు ప్రేమేందర్.. మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.. జోగు ఫౌండేషన్ ప్రత్యేక క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడాల ద్వారా యువకులలో స్నేహపూర్వ సంబంధాలతో పాటు శారీరక మానసిక దృఢత్వం బలపడుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో దేవన్న, రోహిదాస్, దేవన్న,చరణ్ శిగ్, జాదవ్, అంకుష్, ఆత్రం అంబదాస్, అంకుష్ గీత, ప్రతాప్, రోహిదాష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల టైమ్ టేబుల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్( IAS ) విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17_ 2026 నుండి ఫిబ్రవరి 24,_2026 వరకు ఉదయం సెషన్‌లో జరగనున్నాయి. పరీక్షల వివరాలు: ఉదయం 9.30 నుండి 12.30 వరకు (కొన్ని పేపర్లకు 11.00 వరకు) పరీక్షలు: 17.02.2026 (మంగళవారం): ఫస్ట్ లాంగ్వేజ్, 18.02.2026 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్, 19.02.2026 (గురువారం): థర్డ్ లాంగ్వేజ్, 20.02.2026 (శుక్రవారం): మ్యాథమెటిక్స్, 21.02.2026 (శనివారం): ఫిజికల్ సైన్స్, 23.02.2026 (సోమవారం): బయోలాజికల్ సైన్స్, 24.02.2026 (మంగళవారం): సోషల్ స్టడీస్ ఉంటుందని విద్యార్థులు ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు.
రేవంత్ అన్న బస్తీ బాట పోస్టర్ ఆవిష్కరణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ అన్న బస్తీ బాట కంది శ్రీనన్న పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కంది శ్రీనివాస రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబార్ రావు పాటిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, సాయి చరణ్ గౌడ్, సెడ్మకి ఆనందరావు, మునిగెల నర్సింగ్, గుడిపెల్లి నగేష్, మునిగెల విఠల్, షకీల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు..
జైనథ్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, గ్రామ యువకులు స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, నేటి యువకులకు స్పూర్తి ప్రదాత మహానుభావుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరి లింగారెడ్డి, జైనథ్ గ్రామ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, సత్యనారాయణ, ప్రతాప్ యాదవ్, అన్నెల అశోక్, రమేష్ యాదవ్ గ్రామ యువకులు సాయి, ప్రవీణ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
కోలాహలంగా డ్రాగన్ పడవల పోటీలు ప్రారంభం
* జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
చిత్రం న్యూస్, కొత్తపేట: డ్రాగన్ పడవల పోటీలతో కోనసీమ వైభవం విశ్వవ్యాప్తం కానున్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు లో భాగంగా రెండవరోజైన సోమవారం డ్రాగన్ పడవల పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రేక్షకుల కోలాహలం మధ్య పడవల పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. కేరళలో సాంప్రదాయకంగా జరిగే పడవలపోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు. భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన టవర్లపై విద్యుత్తు తీగలు ఎక్కించే పనులు కొనసాగుతున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Rk హీరోగా మరో సినిమా ప్రారంభం
చిత్రం న్యూస్, మణికొండ: వినోదమే ప్రధానంగా ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా ఇంద్ర కంపెనీ ప్రొడక్షన్ NO 5, రవి రాథోడ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తూ శక్తి ప్రెసెంట్ బ్యానర్ గా , RK హీరోగా 5 వ చిత్రం ప్రారంభం కార్యక్రమం హైదరాబాద్ నగరం మణికొండలోని అభిషేక్ డాన్స్ స్టూడియోలో రాజకీయ ప్రముఖులు, సినీ దర్శకులు, నటీనటులు మధ్యన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ నటరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హీరో, హీరోయిన్ ల పై మొదటి ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టగా నిర్మాత ఇంద్ర కెమెరా ఆన్ చేశారు .మొదటి షాట్ కి హరి తాటిపల్లి దర్శకత్వం వహించారు. జబర్దస్త్ షోలో నటిస్తున్న కే ఏ పాల్ మరో అతిథిగా విచ్చేశారు. ఈ చిత్ర హీరోగా నల్లమల, ఆకాశవాణి, ప్రతిఘటన , ప్రేమికుడు , వంగవీటి , కొండా, చిత్రాలకు నృత్య దర్శకులుగా చేసిన RK హీరో గా మహాబలి, నీరుకుళ్ళ, మాఊరి బావి, ఇప్పుడు 4వ చిత్రం హీరోగా చేస్తున్నారు. హీరోయిన్ శ్రీలియ ద్వితీయ చిత్రం కాగా మరో హీరోయిన్ గా ఖుషీ రెడ్డి హీరోయిన్ గా పరిచయం చేస్తూ..అవంతిక పరదేశి హీరోయిన్ గా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుష్మా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంద్ర కంపెనీ నుండి మొదట డేటింగ్, హార్రర్ డ్రీమ్స్ 24/7, ఘోస్ట్ గార్డ్, వాంటెడ్ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ నూతన చిత్రం ప్రొడక్షన్ 5 గా తెరకెక్కుతుంది. దర్శకునిగా కుర్రాల సుబ్బారెడ్డికీ వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ మొదటి సినిమా కాగా ఇది రెండవ చిత్రం . ఈ చిత్రంలో ప్రధాన హాస్యనటుడు గా చేస్తున్న (ఇమామ్ వలి) వలి కి ఇది 7 చిత్రం కాగా ఆనంద్ కి రెండో చిత్రం. కెమెరా ఫొటోగ్రఫీగా ఫణీంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ గా ఉదయ్ కిరణ్. నృత్య దర్శకులుగా హరి తాటిపల్లి, ఫైట్ మాస్టర్ గా పీటర్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ జనవరి 24 నుండి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనూ, రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నెలలో 3 వారంలో వరంగల్, రాజమండ్రిలలో పూర్తికానున్న ఈ చిత్రంలో ఫణి, విజయ్ బొల్ల , సునీత, అనిత, కే ధనలక్ష్మి, శ్రీహరి, ఆనంద్, జబర్దస్త్ బాబు నటించనుండగా మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకులు తెలిపారు.
నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా జాతీయ రహదారులకు ఇరువైపులా ఏర్పాటుచేసిన టవర్లపై విద్యుత్ తీగలు ఎక్కించే పనులు ఉన్నందున ఆదివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ తెలిపారు. బేలలోని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
జమ్మికుంటలో ఉత్సాహంగా సీఎం కప్ క్రీడా ర్యాలీ
చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా ర్యాలీని జమ్మికుంట పట్టణంలో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు బాబు శ్రీనివాస్, పేట సంఘం సెక్రటరీ ఆడేపు శ్రీనివాస్ టార్చ్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం, రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా కార్యక్రమం రూపొందించారని, ఇందులో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, మంచి దేహదారుఢ్యాన్ని రూపొందించుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి మన గ్రామానికి, మండలానికి, జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత , పీఈటీ భగత్, తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








