Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 27

బాసర గోదారమ్మ ఒడికి దుర్గామాతలు

0

బాసర గోదారమ్మ ఒడికి దుర్గామాతలు

*తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అమ్మవారికి వీడ్కోలు పలుకుతున్న భక్తులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం గల గోదారమ్మ ఒడికి  దుర్గామాతలు చేరాయి. వివిధ అలంకారాల్లో కొలువుదీరిన అమ్మవారు తొమ్మిది రోజులు విశేషంగా పూజలు అందుకన్నారు. భక్తులు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. గోదావరి వంతెనపై వివిధ ప్రాంతాల నుండి నిజామాబాదు, కరీంనగర్, కామారెడ్డి,  బైంసా  ఇతర ప్రాంతాల నుంచి  గోదావరి నదికి భారీగా నిమజ్జనం కోసం దుర్గాదేవి విగ్రహాలు తరలివచ్చాయి. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఘాట్లు బురదమయంగా మారడంతో భక్తులు చాలా ఇబ్బందిపడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

 

 

నూతన వధూవరులను ఆశీర్వదించిన కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర

0

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర

చిత్రం న్యూస్: కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోట వాస్తవ్యులు మద్దాల సుబ్బలక్ష్మి- శ్రీనివాసరావుల ద్వితీయ కుమార్తె వివాహానికి కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర హాజరయ్యారు.నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

 

 

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

0

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో  వీడీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. వీడీసీ చైర్మన్ బిక్క గంగాధర్ మాట్లాడుతూ..గాంధీ ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా ఆయనకు చాలా చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. గాంధీజీ భారత దేశ స్వతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు అని అహింసా సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఉప్పు సత్యగ్రహం దీక్ష  చేశారన్నారు. అహింస పరమో ధర్మ అని ఆయన పుట్టిన రోజున ఏ జీవిని హింసించకుండా మద్యం, మాంసం దుకాణాలు అందుకే బంద్ నిర్వహించాలని ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ బిక్క గంగాధర్, వైస్ చైర్మన్ జడల భోజన్న, క్యాషియర్ బూతి తులసీదాస్, రైటర్ దూర్కి రాజు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్, మాజీ సర్పంచ్ రాజు యాదవ్,  వీడీసీ సభ్యులు విఎన్ రాజేశ్వర్, డి.బ్రహ్మం గౌడ్, ఎరేకర్ రాజేశ్వర్, మండల్ నవీన్, కొత్తపెల్లి భూమన్న, జి.రాకేష్, గజ్జల గంగయ్య, తెడ్డోజీ శంకర్, సి.నీలేష్, బండారి శ్రీనివాస్, మండల ప్రవీణ్, భీమ లింగు, వొర్స రవీందర్, రామేల్లి చిన్నయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దమ్మ చక్ర పరివర్తన్ దివస్ 

0

ఘనంగా దమ్మ చక్ర పరివర్తన్ దివస్ 

చిత్రం న్యూస్, బాసర:బినిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో సిద్ధార్థ యువజన సంఘం ఆధ్వర్యంలో దమ్మ చక్ర పరివర్తన్ దివస్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచశీల్ సామూహికంగా పాడుతూ..పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్ధార్థ యువజన సంఘం అధ్యక్షుడు గైని బాబు, సొంటకే సందీప్, సంఘం యువకులు జాజోళ్ల ప్రకాష్, నవీన్, పోతన్న, శ్రీనివాష్, అశోక్, గైని రోయిదాష్. గైని గంగన్న. లంబాడి గౌతమ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు 

0

పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు 

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసామండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన కంమ్లె శైలజ నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తండ్రి పరుశురాం మోటార్ మెకానిక్ చేస్తూ తల్లి అనిత బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కంమ్లె శరత్ ఇంటర్ చదువుతున్నాడు. కూతురు కంమ్లె శైలజ పట్టుదలతో చదివి నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సిటు సాధించడంతో ఆమెకు యువకులు, కంమ్లె సాయినాథ్, సిహెచ్ ఎల్లన్న, కారోబారి భూమన్న, ఎమ్మార్పీఎస్ కుంటాల మండల అధ్యక్షుడు కత్తి బాబు, కదం మారతి, దగ్డే దీపక్, కదం ఆనంద్, శాలువాతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకొని గ్రామస్తులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.

కారు బోల్తా.పలువురికి గాయాలు

0

కారు బోల్తా.పలువురికి గాయాలు

చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కారు డివైడర్ కు ఢీకొని బోల్తా పడింది.  ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని గమనించి తక్షణమే అంబులెన్స్ కి సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు 

0

పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు 

చిత్రం న్యూస్, భైంసా: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన కంమ్లె శైలజ నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తండ్రి పరుశురాం మోటార్ మెకానిక్ చేస్తూ తల్లి అనిత బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కంమ్లె శరత్ ఇంటర్ చదువుతున్నాడు. కూతురు కంమ్లె శైలజ పట్టుదలతో చదివి నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సిటు సాధించడంతో ఆమెకు యువకులు, కంమ్లె సాయినాథ్, సిహెచ్ ఎల్లన్న, కారోబారి భూమన్న, ఎమ్మార్పీఎస్ కుంటాల మండల అధ్యక్షుడు కత్తి బాబు, కదం మారతి, దగ్డే దీపక్, కదం ఆనంద్, శాలువాతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకొని గ్రామస్తులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.

అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర 

0

అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కీర్గుల్ (కె) గ్రామంలో అంగరంగ వైభవంగా దుర్గమాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమాత అమ్మవారు తొమ్మిది రోజులు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తీరొక్క పూలతో వివిధ రకాల నైవేద్యం అమ్మవారికి సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం రోజున విశేషంగా ఆకట్టుకుంది.   అమ్మవారి శోభాయాత్రలో మహిళలు,  ఆడపడుచులు బతుకమ్మ కోలాటాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి డీజే నడుమ శోభాయాత్రను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు చల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  వీడీసీ  పెద్దలు, సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు దుర్గమ్మ వెళ్ళి రావమ్మా అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు.

 

సోలార్  ఫెన్సింగ్ కు కాలు తగిలి ఒకరి మృతి

0

సోలార్  ఫెన్సింగ్ కు కాలు తగిలి ఒకరి మృతి

_దసరా పండగ రోజు విషాదం

చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి నారాయణరెడ్డి గురువారం పంటకు అమర్చిన సోలార్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరెడ్డి రెండు సంవత్సరాల నుండి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే వ్యవసాయ భూమిలో కోతుల బెడద నుంచి పంటను రక్షించడానికి సోలార్ ఫెన్సింగ్‌ను చేను చుట్టూ అమర్చాడు. గురువారం ఉదయం కోతులు చేనులోకి వచ్చాయన్న సమాచారం రావడంతో చేనులోకి వెళ్లి కోతులను తరిమే క్రమంలో పంటకు అమర్చబడి ఉన్న సోలార్ వైర్‌ను చూసుకోకపోవడంతో వైర్లకు కాలు తట్టుకొని సోలార్ షాక్ తగిలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సొనాలలో విజయదశమి వేడుకలు 

0

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సొనాలలో విజయదశమి వేడుకలు 

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాలలో  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సొనాలలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కే.గణేష్, వక్తగా జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజాన్ని సంఘటితం చేస్తూ దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని, దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన ఆర్ఎస్ఎస్ ముందుండి తన సహాయక చర్యలు నిర్వహిస్తుందని, పంచ పరివర్తన సూత్రాలను పాటించాలన్నారు. స్వదేశీ స్వావలంబన దిశగా మనందరం అడుగులు వేయాలని, అందరూ సంఘటితoగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కండ కార్యవహా కోస్మెట్ శుద్ధోధన్, జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ ఉత్తర్వార్ నాగేందర్, స్వయం సేవకులు, గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పిల్లలు, యువకులు, పాల్గొన్నారు.