Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 26

మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాల తనిఖీ 

0

మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాల తనిఖీ 

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధిలో గల దీపావళి మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాలను అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు రెవెన్యూ, అగ్ని మాపక అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా మాత్రమే మందు గుండు సామగ్రి తయారీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. కార్యక్రమంలో సీఐ విజయ శంకర్, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎస్సై మౌనిక, పెద్దాపురం అగ్నిమాపక అధికారి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

0

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

తెలంగాణ స్థానిక ఎన్నికలు నిలుపుదలకు ఛాన్స్..?

లక్ష్మణరేఖ దాటిన బీసీ రిజర్వేషన్లు

సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

చిత్రం న్యూస్, నిర్మల్; తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 న్యాయపరమైన సంక్షోభానికి దారితీసింది. రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్న ఈ అంశంపై ఏకంగా సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులలో ఏకకాలంలో విచారణ జరగనుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ న్యాయ పోరాటానికి కేంద్ర బిందువు, సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఈ కొత్త జీవో ఉల్లంఘిస్తుందనే ప్రధాన అభ్యంతరం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు, 42% బీసీ రిజర్వేషన్లు కలిపితే, మొత్తం రిజర్వేషన్ల శాతం 50% పైగా పెరుగుతుందని పిటిషనర్లు గట్టిగా వాదిస్తున్నారు. రిజర్వేషన్ల చరిత్రలో అత్యంత కీలకమైన ‘ఇందిరా సాహ్నీ’ తీర్పు ఆధారంగానే పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రత్యేక పరిస్థితులు మినహా, రిజర్వేషన్లు ఏమాత్రం 50 శాతాన్ని మించకూడదని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఈ జీవో ఆ రాజ్యాంగ పరిమితిని స్పష్టంగా దాటుతుందని పేర్కొంటూ, దీనిని తక్షణమే రద్దు చేయాలని గోపాల్ రెడ్డి కోరుతున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ కింద  (అక్టోబర్ 6, 2025) సుప్రీంకోర్టు విచారించనుంది. అత్యున్నత న్యాయస్థానం ఈ జీవోకు పచ్చజెండా ఊపుతుందా.. లేక 50 శాతం పరిమితిని దృష్టిలో ఉంచుకుని బ్రేకులు వేస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశంపై చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధమవుతున్నప్పటికీ, ఇదే బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఈ కేసును అక్టోబర్ 8న విచారించనుంది. ఒకే కీలక అంశంపై రెండు  ఉన్నత న్యాయస్థానాలు వరుసగా విచారణ జరపనుండడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను పెంచింది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన తరుణంలో కోర్టు తీర్పు ప్రభావం బహుముఖంగా ఉండనుంది. ఒకవేళ కోర్టులు జీవోను నిలుపుదల చేసినా లేదా సవరింపునకు ఆదేశించినా స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయే లేదా వాయిదా పడే అవకాశం ఉంది. రిజర్వేషన్లను తిరిగి లెక్కించడం, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించడం వంటి అనివార్య చర్యల కారణంగా అభ్యర్థులు, ఆశావహులలో గందరగోళం నెలకొంటుంది. ఇది ఎన్నికల భవిష్యత్తును, రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

*బీసీ సంఘాల ఆశ- ప్రాతినిధ్యం నిలుస్తుందా?

ఈ మొత్తం వ్యవహారంలో బీసీ సంఘాలు, నాయకుల ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. ఎక్కువ శాతం రిజర్వేషన్ల ద్వారా తమ వర్గానికి మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని వారు ఆశిస్తున్నారు. గతంలో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్నందున, స్థానిక సంస్థల్లో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదనేది వారి ప్రధాన వాదన. 42% రిజర్వేషన్ల నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఒకవేళ కోర్టులు 42% రిజర్వేషన్లను తగ్గిస్తే..స్థానిక సంస్థలలో బీసీలకు దక్కే సీట్లు తగ్గుతాయి. దీంతో బీసీల ఓటు బ్యాంకు వారి రాజకీయ ప్రాధాన్యతపై ప్రభావం పడుతుందనే భయం ఉంది. మరోవైపు ఈ అంశం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కోర్టు పరిధిలోకి రావడంతో దీనిపై ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలితే ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం లభించినట్టే అవుతుంది.

*రాజకీయ వ్యూహంపై ప్రభావం-అభ్యర్థుల్లో అనిశ్చితి

ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచడం అనేది రాజకీయంగా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా బీసీ వర్గాల మద్దతును పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవాలని పాలక పక్షం భావించింది. అయితే.. న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో బీసీ అభ్యర్థులు,  ఆశావహుల్లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే.. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడాలనే వారి ఆశలు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్నాయి. రిజర్వేషన్లు తగ్గినట్లయితే ఇప్పటికే ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్న అనేకమంది అభ్యర్థులు తమ పోటీ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల రాజకీయం, న్యాయస్థానాల పాత్రను మరోసారి చర్చనీయాంశం చేసింది. అక్టోబర్ 6న జరగనున్న సుప్రీంకోర్టు విచారణ, తెలంగాణ రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ల అంశానికి కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది, ఇది రాబోయే ఎన్నికల ప్రక్రియకు, నూతన అధ్యాయానికి దిశానిర్దేశం చేయనుంది.

వెంకగారి భూమయ్య (సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ 9848559863)

 

అకాల వర్షంతో రైతన్నలకు కష్టాలు 

0

అకాల వర్షంతో రైతన్నలకు కష్టాలు 

సోయా పంట కాపాడేందుకు ఇబ్బందులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం  వర్షం కురిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలోనే భారీ వర్షం కురవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సోయా పంట వచ్చిందని ఆరబోయే సమయానికి అకాల వర్షం కురవడంతో రైతన్నలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వర్షాలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు భారీ వర్షాలతో పంటలు దెబ్బతినగా.. ఇప్పుడేమో చేతికి అందిన సోయా పంట ఆరబోయనీయకుండా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.  ఎప్పుడొస్తుందో తెలియని వర్షం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పంట కుప్పలపై టార్ఫాలిన్లు కప్పుతూ పంటను కాపాడుకునేందుకుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కనుల విందుగా షష్టిపూర్తి మహోత్సవం

0

కనుల విందుగా షష్టిపూర్తి మహోత్సవం

ఒకే వేదికపై కుటుంబ సభ్యులు

చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో పెంట రాజన్న- రుక్మాబాయిలకు షష్టిపూర్తి నిర్వహించారు. రాజన్న (95) రుక్మాబాయి (90)  దంపతులకు ముగ్గురు  కుమారులు, ఆరుగురు కుమార్తెలు. కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు, మునిమనుమలు ఇలా అంత కలిపి 68 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే తాతకు- అమ్మకు షష్టిపూర్తి చేయాలని అనుకున్నారు. ఆదివారం ఘనంగా షష్టిపూర్తి నిర్వహించి తాత -అమ్మకు పెళ్లి కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. మొత్తం కుటుంబ సభ్యులు ఒకే వేదికలో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని,  అందరూ కలిసి ఉండాలని రాజన్న – రుక్మాబాయిలు కుటుంబ సభ్యులను దీవించారు. ఇందులో పెంట రమణయ్య, పెంట ప్రభాకర్, పెంట పెద్దక్క, మండల చిన్నమ్మి, పొట్టవతి ప్రేమల, వేముల కల, గాండ్ల రాజమణి, మెరుగు విజయలక్ష్మి,-స్వామి, పెంట కల్పనా- సునీల్, మండల ప్రేమల -ప్రవీణ్, మండల స్రవంతి – నవీన్, వేముల శ్రీకాంత్, పొట్టవతి సాయికిరణ్. గాండ్ల హర్షవర్ధన్, అవినాష్, మణికంఠ, లాస్మన్న, శంకర్, రాజేశ్వర్, లక్ష్మణ్, స్పందన, మనశ్విని,విగ్నేష్,తదితరులు కుటుంబ సభ్యులు ఉన్నారు.

బాసరలో దొంగల బెడద

0

బాసరలో దొంగల బెడద

* బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి కాలం వెళ్లదీస్తున్న కాలనీవాసులు

* గస్తీ చేపడుతున్న గ్రామస్తులు

          చిత్రం న్యూస్, బాసర:

నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఇటీవల వరుసగా దొంగతనాలు కావడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు కాలనీలోని ఇళ్లలోకి దొంగలు చొరబడి విలువైన వస్తువులతో పాటు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకొని పోయారు. ఇదే క్రమంలో మరోసారి అదే కాలనీలో వరుసగా చోరీ జరగడంతో బిక్కుబిక్కుమంటూ కాలనీవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పటికీ అడపాదడప చోరీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వెంకటేశ్వర కాలనీవాసులు అందరూ ఏకమై అర్ధరాత్రి సమయంలో 5 గురు మంది చొప్పున యువకులు గస్తీ తిరుగుతున్నారు. ఏ సమస్య వచ్చిన ఒకరికొకరు సమాచారం తెలుసుకొని కంటిమీద కునుకు లేకుండా కాలనీలో గస్తీ ముమ్మరం చేశారు. ఇప్పటికే దొంగలపాలై తీవ్రంగా నష్టపోయిన వారిని పట్టించుకునే వారు కరువయ్యారని వాపోతున్నారు. కూత వేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసులు దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం

0

బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం

* ఏ కాలనీలో చూసిన పిచ్చికుక్కల దాడి బాధితులే..

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన బాలుడు అలీ అబ్దుల్లా నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఓ వీధి కుక్క దాడి చేయడంతో ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడికి వైద్యులు చికిత్స చేశారు.  కాలనీలలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్‌ దుకాణాల వద్ద వీటి బెడద అధికంగా ఉంటుందని, క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చిన్నారులు వృద్ధులు, బిక్కుబిక్కుమంటుంన్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు పేర్కొంటున్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

0

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బోథ్:

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెడ్డి మహిళ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేపట్టారు.  ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడారు. పార్వతి దేవిని ఆరాధించడానికి, ఆమె ఆశీర్వాదాలు పొందడానికి ఈ పండుగ జరుపుకుంటామని మహిళలు పేర్కొన్నారు. ఈ పండగలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మ (పువ్వుల గుట్ట)ను అలంకరించి, దాని చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు.  అనంతరం భక్తితో బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. బతుకమ్మా.. మళ్ళీ రావమ్మా అంటూ వేడుకున్నారు. 

నిరుపేదలకు అన్నదానం చేసిన ఆంజనేయులు

0

నిరుపేదలకు అన్నదానం చేసిన ఆంజనేయులు

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో  ఓ కార్యక్రమంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించిన ఫుడ్ బ్యాంక్ భైంసా వ్యవస్థాపకులు ఆంజనేయులు ఆ ఆహార పదార్థాలను లోకేశ్వరం మండలంలోని లక్ష్మీ నగర్ గ్రామంలోని దాదాపు 130 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా నిరుపేదలకు చేసే అన్నదాన కార్యక్రమాన్ని ఆపేది లేదని అదేవిధంగా ఎక్కడైనా ఫంక్షన్లలో ఆహార పదార్థాలు మిగిలిపోతే పారవేయకుండా  9912267973 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.

బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ

0

బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ప ఆదిలాబాద్  ఎంపీ గోడం నగేష్ శనివారం పరామర్శించారు. వడూరు గ్రామంలోని ఉప్పు పోశెట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  తేజపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించారు.తేజపూర్ గ్రామంలోని రెండు రోజుల క్రితం సోలార్ ఫెన్సింగ్ కారణంగా మరణించిన ఏలేటి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు.  ఎంపీ వెంట సీనియర్ నాయకులు గాదె శంకర్, మండల ఉపాధ్యక్షులు సురేష్, సీనియర్ నాయకులు కొప్పుల గంగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ ధ్రువరాజు, మాజీ రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బోథ్ మండల ఆధ్యక్షులు బోరే రవీందర్, సీనియర్ నాయకులు చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత

0

విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత

 భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపనకు, మహా అన్నదాన కార్యక్రమానికి రూ.10,100. నగదు అందజేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో శాతవాహనుల కాలంలో నిర్మించిన భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన  ఈ నెల 12న నిర్వహించే కార్యక్రమానికి తన వంతు సహాయంగా అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్  రూ.5,100 నగదును,  మహా  అన్నదాన కార్యక్రమానికి మరో రూ.5 వేలు శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సతీష్ పవార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయంగా నగదు అందజేసిన సతీష్ పవార్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొరంగే శ్యాంరావు, ఉప అధ్యక్షులు మెస్రం వాసుదేవ్, జనరల్ సెక్రటరీ సిడం ఖుశాల్, భీంరావుకొడప, సంజయ్ నిపుంగే, మరాఠా తిరిలే కున్భీ సమాజ్ అధ్యక్షులు విఠల్ రౌత్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.