Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 25

బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక 

0

బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ ల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు. కాగా ప్రెస్ క్లబ్ మండల గౌరవ అధ్యక్షులుగా ఎండల సంతోష్ రావు, జిల్లా అధ్యక్షులుగా నర్సూరి భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా అబ్బువార్ గౌతం, కోశాధికారిగా బండారి ఆనంద్, సలహాదారులుగా హనుమంతరావు, నర్సూరి ధర్మారావు లను ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులుగా పింప్లే రామేశ్వర్ .బలగం రాములు, సుధాకర్ రావు, దావు సంతోష్, జాదవ్ సంజీవ్, జాజోళ్ల ప్రకాష్, పసుపుల నాగేష్, బలగం పవన్ కుమార్ లను ఎన్నుకున్నారు. అనంతరం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ లు మాట్లాడుతూ..ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురితం చేయాలని సూచించారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకొన్నారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు

బేలలో వైభవంగా బతుకమ్మ నిమజ్జనం 

0

బేలలో వైభవంగా బతుకమ్మ నిమజ్జనం 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గురువారం రాత్రి బతుకమ్మ నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు, యువతులు కలిసి రంగు రంగు పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు దారి గుండా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. బతుకమ్మ..వెళ్లి రావమ్మా అంటూ కొలుస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం సమీప వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం

0

ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి నుంచి బెదోడ వరకు మంజూరైన రహదారి పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెదోడ నుంచి 35 మంది విద్యార్థులు సాంగిడి ఉన్నత పాఠశాలకు చదువుకునేందుకు నిత్యం ఆటోలో వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పోషకులు స్వయంగా రహదారి బాగు చేయడంతో ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి బుధవారం ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కలిసి అసంపూర్తిగా ఉన్న రోడ్డుని పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సామ రూపేష్ రెడ్డి కోరడంతో అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభించి చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట సంతోష్, సుధాకర్, మంచికంటి సాయి, గెడం సతీష్ తదితరులు ఉన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ

0

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు ముదుల్కర్ వనజ  ఆమె అనుచరులతో కలిసి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  వీరికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళ సమైక్య మాజీ అధ్యక్షురాలు వనజ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిందన్నారు. ఉచిత బస్సు పేరిట గొడవలు పెట్టిందని మండిపడ్డారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెబుతామన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, ఎప్పుడూ సంప్రదించిన అండగా నిలబడే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పక్షంలో ఉండాలని, బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చేసిన మోసాలకు మహిళలు మండిపడుతున్నారని, వారికి కచ్చితంగా మహిళలే బుద్దిచెబుతారని, ఆడ బిడ్డలను మోసం చేస్తే ఎవరు బాగుపడరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రవీందర్ రెడ్డి, పండరీ, దేవేందర్ రెడ్డి, ప్రతాప్ తదితరులు ఉన్నారు.

రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎల్మ సంజయ్ రెడ్డి

0

 రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎల్మ సంజయ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ఎల్మ సంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ  మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు సంతోష్ రెడ్డి, తిరుపతిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ రెడ్డి(అడ్వకేట్) మాట్లాడుతూ.. పేద రెడ్డి బంధువులకు న్యాయం చేస్తానని, రెడ్ల వైభవానికి,  అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, యూత్ జనరల్ సెక్రెటరీ క్యాతం శివప్రసాద్ రెడ్డి, ఇతర రెడ్డి బంధువులు పాల్గొన్నారు.

పనికిరాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ తయారు 

0

పనికిరాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ తయారు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కౌఠ గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  7వ తరగతి చదివే విద్యార్థి శోభన్కర్ ఆదిత్య  తన  అద్భుతమైన తెలివిని ఉపయోగించి పనికి రాని వస్తువులతో ఎలక్ట్రికల్ బ్లూటూత్ స్పీకర్ ను తయారు చేసి చూపించాడు. అటు చదువుతోపాటు ఆ విద్యార్థి ప్రతిభను గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయ బృందం ప్రోత్సహించారు. దీంతో ఆ విద్యార్థి పనికిరాని వస్తువులని ఉపయోగించి బ్లూటూత్ స్పీకర్ తయారుచేసి అందరినీ అబ్బురపరచాడు. ప్రతి ఒక్కరూ విద్యార్థిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేటి సమాజంలో అన్ని రంగాలు  టెక్నాలజీతో ముడిపడిందని ప్రతి ఒక్కరు తమ ప్రతిభతో, ఆలోచనతో పనికిరాని  వస్తువులను సేకరించి వివిధ రకాల వస్తువులను తయారు చేసి తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. గతంలో కూడా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో (ఎన్ ఎమ్ ఆర్) వాగ్దేవి సొసైటీ సిబ్బంది గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్ పనికిరాని వస్తువులతో ఇంటికి ఉపయోగపడే వంద రకాల అలంకార వస్తువులను తయారు చేసి వావ్ అనిపించుకున్నాడు.

బాసర గోదావరి ఘాట్లు శుభ్రపరుస్తున్న గ్రామ యువకులు 

0

బాసర యువకులు భళా..

 గోదావరి ఘాట్లు శుభ్రపరుస్తున్న గ్రామ యువకులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి పుష్కర ఘాట్లను గ్రామ యువకులు శుభ్రపరిచారు. ఇటీవల దేవీ నవరాత్రులలో నిమజ్జనం చేసిన దుర్గ మాత విగ్రహాలు, పూలమాలలు, ప్లాస్టిక్ కవర్లు, బట్టలు పేరుకుపోయాయి. వచ్చే భక్తులు స్నానాలకు వెళ్లాలన్న భయంకరంగా ఉండేది. గమనించిన గ్రామ యువకులు స్పందించి ముందుకు వచ్చి స్వయంగా పుష్కర ఘాట్లను పరిశుభ్రం చేశారు. గ్రామ యువకులు స్వచ్ఛందంగా ఘాట్లను శుభ్రం చేయడంతో పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

సోనేరావును సన్మానించిన  కలెక్టర్, ఎస్పీ

0

సోనేరావును సన్మానించిన  కలెక్టర్, ఎస్పీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కుమురం భీం వర్ధంతి  వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమురం భీం విగ్రహానికి ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  భీం ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఇటీవల ఆదిమ గిరిజన కొలాం సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన కొడప సోనేరావును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సన్మానించారు. అభినందనలు తెలిపారు. 

 

కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది

0

కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది 

కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి.

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కులకోసం పోరాడిన కుమురం భీం  పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, వారి ఆశయ సాధనకోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కుమురం భీం చౌక్ లోని అయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వపరిపాలన కోసం,ఆదివాసీ హక్కులకోసం ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప వీరుడు కుమురం భీం అని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల సాధనకోసం కృషిచేసిన భీం పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన అభ్యున్నతికి ప్రత్యేక కృషిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, ఆదివాసీ జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనందరావు, NSUI మావల మండల అధ్యక్షుడు మర్సుకోల గౌతం, మావల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు రేండ్ల రాజన్న, కొరటి ప్రభాకర్, అలీమ్ ఖాన్, సముల ఖాన్, ఫెరోజ్ ఖాన్, MD వసీం, అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..

కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

0

కుమురం భీం పోరాట స్ఫూర్తి అందరిలో రావాలి

*నిజాం పాలనలోనే జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన మన జిల్లా బిడ్డ కుమురం భీం

చిత్రం న్యూస్,నేరడిగొండ: కుమురం భీం జ్ఞాపకార్తం రూ. 25 కోట్లతో జోడేఘాట్ లో మ్యూజియం ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దని బోథ్ ఎలా అనిల్ జాదవ్ అన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మావ నాటే..మావ రాజ్ కలను సాకారం చేసి వారి గ్రామాల్లో వారికే అధికారం ఇచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.