Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 24

ఘనంగా గాజుల పండగ

0

ఘనంగా గాజుల పండగ

వంటా వార్పు, ఆట, పాటల నడుమ దోస్తుల గాజులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండగ ట్రెండ్ గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళలు గ్రాండ్ గా ఈ గాజుల పండుగ జరుపుకుంటున్న విషయం విధితమే. ఆదివారం బాసర మండలంలోని కీర్గుల్( కె) గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండగను కనుల పండువగా నిర్వహించుకున్నారు. మహిళలందరు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ సౌడలమ్మ అమ్మవారిని దర్శించుకొని అనంతరం దేవి సన్నిధిలో ఏకరూప దుస్తులను ధరించి, ముందుగా గోరింటాకును ఒకరినొకరు పెట్టుకొన్నారు. అందరు పసుపు, కుంకుమ, పూలు ధరించి సాంప్రదయ బద్దంగా ఒకరినొకరు వారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ వదిన మరదలు, అక్క చెల్లెల్లు గాజులు వేసుకొన్నారు. అనంతరం వంటలు వండుకొని భోజనాలు చేశారు. తదనంతరం కాలక్షేపానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని డీజే పాటలతో బతుకమ్మ పాటలతో, ఆటలను ఆడారు. అంత్యక్షరీ, పాటలు పాడుతూ ఆనందోత్సహల నడుమ గాజుల పండగను రోజంతా అక్కడే గడిపారు.

 

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

0

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్రమైన పుణ్యక్షేత్రం అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపించింది . ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,  కర్ణాటక రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు.  అమ్మవారిని దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది.  అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి పాదాల వద్ద ప్రత్యేక అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు .ఆలయ ఈఓ అంజనీదేవి, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బాసరలో అయ్యప్ప భక్తుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

0

బాసరలో అయ్యప్ప భక్తుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం నుండి అయ్యప్ప సన్నిధికి వెళ్లే భక్తుల పాదయాత్ర ను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర లో 40 మంది అయ్యప్ప మాలదారులు పాల్గొంటున్నారు. యాత్రలో రాష్ట్రాల సరిహద్దుల వద్ద అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ స్వాగతం పలికి ఏర్పాట్లు చేస్తుందన్నారు. అయ్యప్ప సన్నిధిలో అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ స్వాగతం పలుకుతారన్నారు. పాద యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని సరస్వతి అమ్మవారిని మొక్కుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

0

శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన అయ్యప్ప భక్తులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని బ్రాహ్మణగావ్ గ్రామంతో పాటు ఆయా గ్రామాల నుండి అయ్యప్ప దీక్షాపరులు ఆదివారం బ్రాహ్మణగావ్ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రగా బయలుదేరారు. సుమారు 20 మంది స్వాములు 45 రోజులు పాదయాత్ర చేసి స్వామివారి సన్నిధానం చేరుకుంటారని తెలిపారు. ముథోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం మహా పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో బయలుదేరారు.

IMA ADILABAD జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

0

ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్.కళ్ళెం వెంకట్ రెడ్డి

IMA ADILABAD జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవవర్గాన్ని  శనివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కాలే సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కళ్లెం వెంకట్ రెడ్డి, కోశాధికారిగా బండి  సాయికృష్ణతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా  ఐఎంఏ నూతన అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను డాక్టర్లు శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు.

ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు

0

ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు

* లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన  ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలకతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేసేలా చేపడుతున్న ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం భోరజ్ మండలంలోని పూసాయి, మాండగడ గ్రామాలలో ఇందిరమ్మ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇండ్లకు స్థానిక నాయకులు, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎవ్వరు ఉండకూడదని సదుద్దేశంతో ఇప్పటికే 4 కోట్ల 80 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మరో 2 కోట్ల 40 లక్షల ఇండ్ల నిర్మాణ కార్యక్రమం జరుగుతోందన్నారు. పేదల సొంతింటి కలను సహకారం చేసేలా భూమి పూజ చేసిన ఇండ్లకు అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అశోక్ రెడ్డి, రమేష్, గంగాధర్ సంజు,గణేష్, శ్రీనివాస్,  అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ

0

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహ

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని మహారాష్ట్ర పర్డేకర్ భవనంలో వారం రోజుల అఖండ హరినామ సప్తాహ శనివారం రోజు ఘనంగా ముగిసింది. బ్రహ్మముహుర్తాన స్వామి వారికి కాగడ హారతితో పాటు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పర్భని జిల్లాకు చెందిన యోగేష్‌ మహారాజ్‌ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. దైవ నామస్మరణ చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు భక్తి సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి సంవత్సరం బాసరలో అఖండహరినామ సప్తాహ నిర్వహించడంతో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనలతో పాటు క్రమశిక్షణ, జీవన విధానంలో మార్పు వచ్చి, వ్యవసనాలకు, దురలవాట్లకు దూరంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.

వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు

0

వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోని    ముథోల్, తానూర్ మండల కేంద్రాల్లో జరిగిన వైన్స్ షాపుల దొంగతనాల కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. భైంసా ASP అవినాష్ కుమార్ నిందితుల వివరాలను శనివారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలికి చెందిన యాపరి వినోద్ తన స్నేహితులైన  బ్యాగరి రోహిత్, నీరది శ్రావణ్ కుమార్, ఖదులూరి సాయి ఆదిత్య గౌడ్, పట్ల నవీన్, టి.దిలీప్ లతో కలిసి  దొంగతనానికి పాల్పడ్డారన్నారు. మే నెల 24న శ్రావణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ముథోల్ లోని రాజరాజేశ్వర  వైన్స్ లో మద్యం బాటిళ్ల కాటన్లను అపహరించారన్నారు. జనవరి 24న తానూర్ లోని లక్ష్మీ వైన్స్ లో రూ.8 వేల నగదును దొంగలించారని, సీసీ కెమెరాల్లో దొంగతనం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయని గమనించి వాటిని సైతం దొంగలించి బాసర గోదారి నదిలో పడేశారన్ననారు.వినోద్ తాడ్ బిలోలి లో బెల్టు షాపు నడుపుతూ ఇక్కడ చోరీ చేసిన మద్యం బాటిళ్లను అక్కడ విక్రయించగా వచ్చిన డబ్బులను అతని వద్దే ఉంచుకున్నాడన్నాడు. మరో దొంగతనం చేసినప్పుడు వాటా ఇస్తా అని చెప్పాడన్నాడు. శుక్రవారం ముథోల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద దొంగతనం చేసే ఉద్దేశంతో తిరుగుతుండడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారన్నారు. ప్రధాన నిందితుడు యాపరి వినోద్ తో పాటు మరో ముగ్గురిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు  ఆయన పేర్కొన్నారు.  ముథోల్ సీఐ మల్లేష్  ఎస్సై బిట్ల పెర్సిస్,   తానూర్ ఎస్సై జుబేర్ లను జిల్లా SP డాక్టర్ జానకి షర్మిల అభినందించారు.

ద్విచక్రవాహనం చోరీ చేసిన దొంగల అరెస్టు

0

ద్విచక్రవాహనం చోరీ చేసిన దొంగల అరెస్టు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం శారద నగర్ కాలనీకి చెందిన పలారం గంగాధర్ ద్విచక్రవాహనం దొంగలించిన ఇద్దరు దొంగలను బాసర పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం..గంగాధర్ ఎప్పటిలాగే ఇంటి వద్ద ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేశారు.  ఇంతలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఇంటి లోపలికి చొరబడి పార్కింగ్ చేసిన బైకును ఎత్తుకొని పారిపోయారు. బాధితుడు బాసర పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన  పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని పలారం గంగాధర్ కు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులకు కాలనీవాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత

0

సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర మండల తహసీల్దార్  పవన్ చంద్రకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాసర  మండల కార్యదర్శి ఆనంద్ బండారి, బాసర మాజీ సర్పంచ్ సతీష్ రావ్, ముత్యం భగవాన్, బలిరాం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.