Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 23

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు  

0

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు  

తండ్రిని చంపి పొలంలో పాతిపెట్టిన కొడుకు.

రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన రూపేష్ రెడ్డి

0

రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామానికి చెందిన టేకం పోతుబాయి అనే మహిళను మంగళవారం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రుపేష్ రెడ్డి ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఈ సందర్భంగా టేకం పోతుబాయి పరిస్థితిని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత వైద్యులకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టేకం పోతుబాయి పరిస్థితిని కుటుంబ సభ్యులు ముందుగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.దీంతో వారి కుటుంబ సభ్యులను కలిసి టేకం పోతుబాయిని ఆసుపత్రికి తరలించడంతో కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఓని గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్

0

ఓని గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని గ్రామంలో నిర్వహించిన మాజీ సర్పంచ్ ఆనందరావు పటేల్  తల్లి నాగబాయ్ అంత్యక్రియల్లో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయన మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల బాధలో భాగస్వామ్యం అవుతూ, ఆపదలో ధైర్యంగా నిలబడాలని సూచించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల పాదయాత్ర 

0

సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల పాదయాత్ర 

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర అమ్మవారికి రైతుల పూజలు

చిత్రం న్యూస్, బాసర:ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని నిరసిస్తూ  భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఆధ్వర్యంలో బాసర, ముథోల్, తానూర్, బైంసా మండలాల రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,  సోయా పంట చేతికి వచ్చిందని, సరైన మద్దతు ధర ఇవ్వకుండా ప్రతి పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదని మండిపడ్డారు. మంగళ వారం ముథోల్ లోని పశుపతినాత్ శివాలయంలో బసచేసి బుధవారం ఉదయం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపనున్నారు.ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనను చేపడతామని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు హెచ్చరించారు. అంతకుముందు నిర్మల్ జిల్లా బాసర  అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జయప్రదం చేయండి

0

కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జయప్రదం చేయండి

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నియామకం కోసం ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు బోథ్ నియోజకవర్గానికి రానున్నారు. 15న  బుధవారం ఉదయం 9:30 గంటలకు ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

పంట అమ్మకానికి వచ్చిన పూర్తికాని ఆన్లైన్

0

పంట అమ్మకానికి వచ్చిన పూర్తికాని ఆన్లైన్

చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామపంచాయతీలో గల కుప్టి కుమారి, గాజిలి, గాంధారి,ముల్కల్పాడు,రాయపూర్ శివారులో గల పంటలు ఇంకా ఆన్లైన్ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతమున్న ఏఈఓ రాథోడ్ వినోద్ ప్రమోషన్ పై వెళ్లడంతో పంటలను ఆన్లైన్ చేయడంలో ఆలస్యమైంది. ప్రస్తుతము కొందరి రైతుల పంటలను ఆన్లైన్ చేసినప్పటికీ ఇంకా 50% రైతుల పంటలను ఆన్లైన్ చేయవలసి ఉంది. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో నష్టాల్లో ఉండడంతో రైతుల వద్ద డబ్బులు లేక కొందరు రైతులు సోయా పంటను ప్రవేట్ మార్కెట్లో రూ.4,300 అమ్ముకుంటున్నారు. ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ రేటు రూ.5,328 ఉండగా రైతులు నష్టపోకుండా పంటలను ఆన్లైన్ చేస్తే వ్యవసాయ మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులను కోరుతున్నారు. దీపావళికి సోయాబీన్, పత్తి పంట వ్యవసాయ మార్కెట్ లో త్వరలోనే కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. నేరడిగొండ ఏవో కృష్ణవేణి అధికారికి గ్రామ ప్రజలు ఈ సమస్యను తెలపడంతో ఏవో కృష్ణవేణి మాట్లాడుతూ.. మూడు రోజుల్లో ఏ ఈ ఓ ని నియమించి పంటలను ఆన్లైన్ చేస్తామని రైతులు ఎవరు కూడా ప్రైవేట్ మార్కెట్ కి వెళ్లి నష్టపోవద్దని త్వరలోనే వ్యవసాయ మార్కెట్లో పంటలను అమ్ముకోవాలని తెలిపారు.

ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

0

ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ఆర్జేయూకేటీ బాసర, సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు ‘ రోడ్డు భద్రత – పౌరుల విధి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు శాంతి జగదీశ్వరి మాట్లాడుతూ..జీవితం ఎంతో విలువైందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు నడిపే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాహనాలు నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నడపరాదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటిస్తే వారి కుటుంబానికి వారు ఆసరాగా ఉండొచ్చని వారి జీవితాలకు ఒక భరోసా ఉంటుందని అన్నారు. విద్యార్థుల చేత రోడ్డు భద్రతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు, ల్యాబ్ స్టాఫ్ బలరాం తదితరులు పాల్గొన్నారు. 

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆలయ అర్చకుల వైదిక బృందం  ఘన సన్మానం

0

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆలయ అర్చకుల వైదిక బృందం  ఘన సన్మానం  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర నూతన బాసర మండల ప్రెస్ క్లబ్ TUWJ (IJU) నూతన కార్యవర్గానికి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకుల వైదిక బృందం ఘనంగా సన్మానించారు.  జర్నలిస్టులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  అమ్మవారి పాదాల వద్ద పూజలు నిర్వహించారు. ఆలయ AEO సుదర్శన్ గౌడ్, ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్, వేద పండితులు నవీన్ శర్మ ఉన్నారు. అనంతరం రవీంద్ర పూర్ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తించి పదోన్నతి పొంది బాసరలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న మమ్మయి శ్రీనివాస్ ను బాసర టియుడబ్ల్యూజే (ఐజేయు) నూతన కార్యవర్గం తరఫున సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాసరలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలను అందజేశారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

0

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

 బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్ బేల: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో గల నూతన బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపన  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల బీఆర్ఎస్ నాయకులతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సదల్పూర్ లో ఉన్నటువంటి బైరందేవ్, మహాదేవ్ దేవాలయ ఆవరణలో రూ. 2 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటు పాడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్కే తేజ్రావు , అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్, మాజీ సర్పంచులు విపిన్ ఖోడే, విట్టల్ వరాడే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప, ముఖ్యనాయకులు విట్టల్ రౌత్ ,బత్తుల సుదర్శన్, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

0

పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో పురుగుమందు తాగి యువకుడు (20) ఆత్మహత్య చేసుకున్నట్లు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.  ఆయన కథనం ప్రకారం..వడూర్ గ్రామానికి చెందిన కడారి వినోద్ ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నాడు.  గమనించిన కుటుంబీకులు బోథ్ ఆసుపత్రికి తరలించారన్నారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.