Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 22

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 

0

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 

చిత్రం న్యూస్, బాసర:  నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాల 36 మంది లబ్ధిదారులకు రైతు వేదికలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర మండల తహసీల్దార్ పవన్ చంద్ర,  బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అడానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ

0

అడానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ

చిత్రం న్యూస్ బేల : అడానేశ్వర ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్ ఆధ్వర్యంలో మండలంలోని మసాలా(బి) గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు శుక్రవారం ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడనేశ్వర ఫౌండేషన్ పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  డోప్టాల సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ సర్పంచ్ భీంరావు, ఆల్చెట్టి హన్మాన్లు, మంచాల కిష్టన్న, నైతం గులాబ్, మారుతి ఆడే ,అంగన్వాడీ టీచర్ ముక్కే సారిక, ఆయా తదితరులు ఉన్నారు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం

0

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం

కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు 

చిత్రం న్యూస్: హైదరాబాద్: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం ప్రారంభం కానుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులను ఇప్పుడు స్వీకరిస్తున్నారు. అర్హత కలిగిన గృహాలకు LPG కనెక్షన్లు అందించడం ఈ పథకం యెుక్క లక్ష్యం. దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి. రేషన్ కార్డు (FSC) జిరాక్స్ కాపీ, రేషన్ కార్డులో జాబితా చేయబడిన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, మహిళా ఇంటి పెద్ద (రేషన్ కార్డు యజమాని) బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, మహిళా గృహయజమాని యొక్క రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. సమర్పించిన రేషన్ కార్డులో జాబితా చేయబడిన కుటుంబంలోని ఏ సభ్యుడైనా ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యం

0

అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని బాసర ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ అలిసెరి గోవర్ధన్ అన్నారు. ఆయన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరఫున ఆయన్ను మర్యాదపూర్వకముగా కలిసి చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్లెంగ ముత్యం మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఆర్జేయూకేటీ లో జరుగుతున్న మంచి మార్పులను, అంకిత భావంతో పనిచేస్తున్న విధానాన్ని గురించి  కొనియాడారు. విద్యార్థుల అభివృద్ధి కోసం, వారికి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారం కోసం ముందుండి పనిచేసిన అనేక ఉదాహరణలను గురించి వివరించారు. వైస్ ఛాన్సలర్ గెస్ట్ ఫాకల్టీ ల కోసం చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ గోవర్ధన్ మాట్లాడుతూ..ఫ్యాకల్టీలకు అనేక సూచనలు చేశారు. అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలని, దానితోపాటు మన స్థాయిని కూడా పెంచుకొని మంచి ఫ్యాకల్టీగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఫ్యాకల్టీలు తమ యొక్క బోధన స్థాయిలను రకరకాల కార్యక్రమాల ద్వారా పెంచుకొని విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ సభ్యులు బైరు రాజేష్, కోటగిరి కృష్ణ, బి.సురేష్, బాదావత్ నవీన్, శ్రీధర్,రాజు, సోఫియా, వీణ, హారిక తదితరులు పాల్గొన్నారు.

అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

0

అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: కర్ణాటక రాష్ట్రం జేవర్గి ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ సీఎం కుమారుడు, ఆదిలాబాద్ డీసీసీ అబ్సర్వర్  అజయ్ సింగ్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.  ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి  కోసం  పరిశీలనకు వచ్చిన  ఆయనతో  చర్చించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ రాంకుమార్, ఇమ్రాన్,  భూమన్న,  నాయకులు శ్రీకాంత్, భూపేందర్ తదితరులు ఉన్నారు.

రహదారి సమస్య పరిష్కారం తీరేనా!

0

రహదారి సమస్య పరిష్కారం తీరేనా!

చిత్రం న్యూస్, జైనథ్: మహరాష్ట్ర సరిహద్దు నుంచి అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామం మీదుగా కాఫ్రి వరకు R&B ద్వార రహదారి నిర్మించారు. రోడ్డు ట్రాఫిక్ అసౌకర్యానికి, ప్రమాదాలకు సంబంధించి కూర గ్రామస్తులు ప్రజవాణి ఫిర్యాదులో దాదాపుగా సంవత్సరం క్రితం వినతి పత్రం అందించారు. గ్రామం మీద నుంచి వెళ్లే వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, R&B అధికారుల రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు అనుమతించబడనప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి తగిన రంబుల్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా గ్రీవెన్స్ లో R&B అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సంవత్సరం గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0

సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అడవి పందుల రక్షణ కోసం అమర్చిన సోలార్ వైరుకు తగిలి గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చేసినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. వయస్సు దాదాపు 50 ఉన్నట్లుగా గుర్తించామన్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికిలోని మార్చురీ గదికి  తరలించామన్నారు. మృతుడి వివరాలు  తెలిసినవారు 8712659947 నంబర్ ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు 

0

విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు తయారీ కేంద్రంలో లడ్డు ప్యాకేజ్ గా విధులు నిర్వహించిన సుమారు పదిమంది రోజువారి దినసరి కూలీలకు ఉద్యోగ భద్రత లేక వీధిన పడ్డారు. గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాం . ఈ సంవత్సరం జనవరి 28వ తేదీన దేవస్థానం అధికారులు వీరిని విధుల నుంచి  తొలగించడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తిరిగి విధుల్లో చేర్చుకోవాలని లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు పలుమార్లు ఆలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్ తో పాటు హైదరాబాదులోని దేవదాయ శాఖ కమిషనర్ కు కలసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తమను పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆరోపిస్తున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని దినసరి కూలీలు దేవస్థానం కార్యనిర్వణాధికారి అంజనాదేవిని  కోరుతున్నారు.

పత్తి, సోయాబీన్ సేకరణను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

పత్తి, సోయాబీన్ సేకరణను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: రైతుల నుండి పత్తి, సోయాబీన్ పంటలను వెంటనే  కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శంకర్ మాట్లాడుతూ..సేకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ “కపాస్ కిసాన్ యాప్” గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీనిని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. సేకరణ ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ యాప్ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు సజావుగా ప్రక్రియ జరిగేలా మార్కెట్ యార్డులలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని శంకర్ అధికారులను ఆదేశించారు. రైతులు తమ ఉత్పత్తులకు న్యాయమైన మద్దతు ధర పొందేలా చూసేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో త్వరలో సేకరణ ప్రారంభమవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

0

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

చిత్రం న్యూస్: జైనథ్: మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ  ముందుకు సాగాలని ఎమ్మెల్యే  పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని  అడ జడ్పీ ఉన్నత  పాఠశాలలో ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.80 లక్షలు విలువగల స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ను బుధవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్   మాట్లాడుతూ.. ప్రస్తుతం స్మార్ట్ యుగం కొనసాగుతుందని దానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ శిక్షణలు తీసుకోవాలన్నారు. వారికి ఉపయోగపడేలా ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పుస్తకాలంలో ప్రతి పోటీ పరీక్ష ఆన్లైన్లోనే కొనసాగుతుందన్నారు. అదే దిశగా విద్యార్థులు ఇప్పటినుంచే ఎదగాలన్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన స్మార్ట్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం గుణవంత్, ఏకలవ్య ఫౌండేషన్ కోశాధికారి సతీష్ దేశ్పాండే, ప్రోగ్రాం మేనేజర్ ప్రశాంత్, ట్రస్టీలు దిగంబర్, రామ్ రెడ్డి, బీజేపీ నాయకులు లాలా మున్నా, కోరెడ్డి వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.