Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 20

పల్లెల్లో దీపావళి సంబరాలు

0

చిత్రం న్యూస్,బేల: దీపావళి పండగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున ఇళ్ల  ముందు రంగవల్లులు వేశారు. వ్రతాలు పూజలతో అందరి ఇళ్ళలో సందడి నెలకొంది. మంగళవారం గోమాతకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. టపాసుల కాంతులతో పల్లెలు దద్దరిల్లాయి.

MP: ఘనంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీజేపి శ్రేణులు ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్ (బన్నీ), బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి, బోయర్ విజయ్, అస్తక్ సుభాష్, కరుణాకర్ రెడ్డి, సంతోష్, దయాకర్, రాకేష్, రమేష్, సన్నీ, సచిన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం

0

పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం

తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని, విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల సేవలు సమాజం ఎప్పటికీ మరచిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకుని  మంగళవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలోని పోలీసు అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. వారి సేవలను గుర్తుచేసుకుంటూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం అన్నారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎలాంటి విఘాతం తలెత్తకుండా ప్రజలకు రక్షణగా నిలిచి పోలీసుశాఖ మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, రెండ్ల రాజన్న, షేక్ అలీమ్, సమీఉల్లా ఖాన్, రాజు, మమ్మద్, మన్సూర్ ఖాన్, కొరటి ప్రభాకర్, ఫయీమ్, షేక్ రహిమోదిన్, పోచన్న, షేక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

 

దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల  నాటి ఆచారం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల  నాటి ఆచారం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

*ఆదివాసీలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల నుండి వస్తున్న ఆచారం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మావల మండలం పరిధిలోని కుమురం భీం కాలనీలో సోమవారం జరిగిన దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ చేయగా కిషన్ రెడ్డి ఆదివాసీలకు దీపావళి, దండారీ ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదివాసీలతో కలిసి ఎమ్మెల్యే గుస్సాడీ నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తనకు సమయం దొరికినప్పుడల్ల ఆదివాసీల సమస్యల గురించి చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. కుమురం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, బీజేపీ నాయకులు ముకుంద్ రావు, అశోక్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల త్యాగం స్ఫూర్తిదాయకం

0

*పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పోలీసుల త్యాగం స్పూర్తిదాయకమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో సోమవారం  పోలీసు అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. అమర వీరుల స్తూపం వద్ద జ్యోతి వెలిగించారు. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

కలెక్టర్  రాజర్షి షాకు శుభాకాంక్షల వెల్లువ

0

కలెక్టర్ రాజర్షి షాకు శుభాకాంక్షలు తెలుపుతున్న సంఘ ప్రతినిధులు

చిత్రం న్యూస్, కలెక్టరేట్: టీఎన్జీవో, గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షా జన్మదిన వేడుకలను క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన చేత కేకు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శులు రామారావు, శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల నవీన్ కుమార్, మాజీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, సంఘ ప్రతినిధులు తిరుమల్ రెడ్డి, అరుణ్, రాజేశ్వర్, సోగల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారి అన్నదాన సత్రంకు రూ.లక్ష  విరాళం అందజేత 

0

బాసర ఆలయ ఈవో అంజనీదేవికి రూ.లక్ష  విరాళం అందజేస్తున్న మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని  పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి శాశ్వత అన్నదాన సత్రం నిమిత్తం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆలయ ఈవో అంజనీదేవికి సోమవారం ఈ న‌గ‌దును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దంపతులచే ఆలయంలో ప్రత్యేక పూజ‌లు జరిపించి, ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించారు. అనంతరం వారికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైదిక బృందం తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ రోటవేటర్లో పడి ఒకరికి తీవ్ర గాయాలు   

0

ట్రాక్టర్ రోటవేటర్లో పడి ఒకరికి తీవ్ర గాయాలు   

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన శివ అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్లో పడి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఎప్పటిలాగే తన వ్యవసాయంలో ట్రాక్టర్ రోటవేటర్ తో పనులు చేస్తుండగా అందులో కాలు ఇరుక్కుంది. స్థానికులు గమనించి శివను బయటకు తీయగా అప్పటికే రోటవేటర్లో  కాలు ఇరుక్కుని తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు

0

దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు 

చిత్రం న్యూస్, హైదరాబాద్: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే  ముఖ్యమైన పండగ దీపావళి. ఈ పండగను వెలుగుల పండగగా కూడా పిలుస్తారు.  సాధారణంగా ఇళ్లను దీపాలతో, పూలతో, విద్యుద్దీపాల కాంతులతో అలంకరించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. బహుమతులు, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. “దీపావళి” అనే పదం సంస్కృత పదం.”దీపావళి”  అంటే “దీపాల వరుస” అని అర్థం. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా చెబుతుంటారు. ఈ పండగను హిందూ మతంతో పాటు జైన మతం, సిక్కు మతాలలో కూడా నిర్వహిస్తారు.

దీపావళి ప్రాముఖ్యత: శ్రీకృష్ణుడు నరకాసురుడిని ఓడించిన విజయం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. రావణుడిని ఓడించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు తిరిగి వచ్చిన సందర్భంగా కూడా దీపావళిని జరుపుకుంటారు.

బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం

0

బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో శృంగేరి పీఠం జగద్గురువు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి వారిచే శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం మహాపూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ,స్పటిక లింగం ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనంతో పాటు శృంగేరి విదుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదలను స్వీకరించి ఆశీస్సులను తీసుకున్నారు. కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.