Home Blog Page 19

బెల్లూరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ సుధీర్ కుమార్

0

బెల్లూరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ సుధీర్ కుమార్

జైనథ్, చిత్రం న్యూస్: మండలంలోని బెల్లూరి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జైనథ్ ఎంపీడీఓ సుధీర్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయిన లబ్దిదారులు చివరి బిల్లు కోసం వేచి చూస్తున్నామని ఎంపీడీఓకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు దశల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని గుర్తు చేశారు. ఇండ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఆయన సూచించారు. మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకుంటే తదుపరి విడత నిధులు విడుదలవుతాయని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయిన లబ్దిదారులు చివరి బిల్లు కోసం వేచి చూస్తున్నమని ఎంపీడీఓకి తెలియజేశారు. గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిరంతరం నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ దత్తు, గ్రామస్తులు అభిజిత్ రెడ్డి, సుజీత్, మారుతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

వైకల్యంపై గెలిచిన పట్టుదల: రెండు చేతులు లేకున్నా పదో తరగతిలో సత్తా చాటిన సాయి చరణ్

0

వైకల్యంపై గెలిచిన పట్టుదల: రెండు చేతులు లేకున్నా పదో తరగతిలో సత్తా చాటిన సాయి చరణ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: శారీరక వైకల్యం లక్ష్య సాధనకు అడ్డంకి కాదని పట్టుదలతో నిరూపించాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మార్కొండు సాయి చరణ్‌. విద్యుత్ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయినా, ఏమాత్రం అధైర్యపడకుండా పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో సాయి చరణ్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి చరణ్ సాధించిన ప్రతిభను చూసి కలెక్టర్ ముగ్ధులయ్యారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సాయి చరణ్ 417 మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అతడిని ఘనంగా అభినందించారు. గతంలో జరిగిన ఒక దురదృష్టకర విద్యుత్ ప్రమాదంలో సాయి చరణ్ తన రెండు చేతులను కోల్పోయాడు. ఆ క్లిష్ట పరిస్థితిలోనూ కుంగిపోకుండా, అంగవైకల్యాన్ని ఒక సవాలుగా స్వీకరించి చదువులో రాణించాడు. సాయి చరణ్ ఆత్మవిశ్వాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు. సాయి చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అతడి ఉన్నత చదువులకు, ఇతర అవసరాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆపదలో ధైర్యం కోల్పోకుండా శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని చెప్పడానికి సాయి చరణ్ ఒక రోల్ మోడల్ అని కలెక్టర్ పేర్కొన్నారు.

జైనథ్ మార్కెట్‌లో ‘జొన్న’ రైతుల ఇబ్బందులు 

0

జైనథ్ మార్కెట్‌లో ‘జొన్న’ రైతుల ఇబ్బందులు 

  • గన్నీ బ్యాగులు లేక నిలిచిన కొనుగోలు 
  •  నేషనల్ హై వే వరకు నిలిచిన వాహనాలు 

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్న రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు జొన్నలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా, గన్నీ బ్యాగుల కొరత కారణంగా తూకాలు కావడం లేదు. కొనుగోలు చేసిన పంటను గోదాములకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ అంతా ధాన్యపు రాశులతో నిండిపోయింది. కిలోమీటర్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ బయట సుమారు రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్లు క్యూలో వేచి ఉన్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక, అకాల వర్షం కురుస్తుందేమో అన్న భయంతో రైతులు రాత్రింబవళ్లు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. “ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలు పడాలా?” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని, లారీల సౌకర్యం కల్పించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జైనథ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ముడుపు మౌనిష్ రెడ్డి 

0

 చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ముడుపు మౌనిష్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  భోరజ్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. మండుటెండలు పెరుగుతున్న నేపథ్యంలో బోరజ్ నుండి బేల వైపు వెళ్లే ప్రయాణికులు, కార్మికులు, వృద్ధులకు చల్లని తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దాహం తీర్చడం ఒక సేవ అని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలోప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. రోజంతా ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి స్నేహిత్, సాయి, అతర్వ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్‌లో గోడలపై పెయింటింగ్ వేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పారదర్శక పాలన కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు దినేష్, జోగు రవి, హనుమండ్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

0

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ‘జాబ్ మేళా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల స్టాల్‌లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం వివిధ కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఈడీ మనోహర్, ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

మాంగ్రూడ్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం 

0

మాంగ్రూడ్ గ్రామంలో రైతు ముంగిట్లోశాస్త్రవేత్తలు కార్యక్రమం 

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో  శాస్త్రవేత్తలు డాక్టర్.కె.రాజశేఖర్, డాక్టర్.ఎం.రాజేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమర్, గ్రామ సర్పంచ్ పూజ, ఉప సర్పంచ్ పురుషోత్తం, సీపీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం,  రసాయనాల ఎరువుల వాడకాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని పెంచుకోవడం, మార్కెట్ కు అనుగుణంగా పంటలను పండించడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ అంశాలతో పాటు రాబోవుకాలంలో వచ్చే వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధమైన యాజమాన్య పద్ధతులు  పాటించాలో  రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంగేష్ టాక్రె, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అవల్పూర్ గ్రామంలో భూసార పరీక్ష గురించి అవగాహన సదస్సు

0

అవల్పూర్ గ్రామంలో భూసార పరీక్ష గురించి అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్ గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక భాగంలో సోమవారం రైతులకు భూసార పరీక్ష (మట్టిపరీక్ష ) గురించి ఇఫ్కో ప్రతినిధి ఆదిలాబాద్ మార్కెటింగ్ నిఖిల్ గొర్లవార్  రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మట్టి నమూనా ఎలా తీయాలి.. ఫీల్డ్,డిమాన్స్ట్రేషన్ చేయడం ఎలా అనే దాని పై వివరించారు. భూసార పరీక్ష (మట్టి పరీక్ష) ద్వారా నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని తెలిపారు. మట్టి నమూనాలు తీసుకొని 15 రోజుల తర్వాత మా ఇఫ్కో కంపెనీ తరపున రైతులకు భూసార పరీక్ష రిపోర్ట్ ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దినేష్, మాజీ ఎంపీటీసీ నగేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజు, రమణ, రైతులు రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు 

0

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు 

చిత్రం న్యూస్, బేల:  ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రైతు వేదికలో నేల ఆరోగ్యం, పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్ష , వివిధ పంటలలో సరైన మోతాదులో ఎరువుల వాడకం వంటి అంశాలపై వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ కుమార్ సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతుల నుంచి మట్టి నమూనాలు  సేకరించారు. ల్యాబులో పరీక్షించిన మట్టినమునాల ఫలితాలను సూచించే సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించారు. కార్యక్రమంలో సాంగిడి సర్పంచ్ భూపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలచందర్, రైతులు మహేందర్, నితిన్, ఆకాష్, ఆశన్న, శ్రీనివాస్, సాయి , రణధీర్ తదితరులు పాల్గొన్నారు

ఆదిలాబాద్ లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

0

ఆదిలాబాద్ లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతును సన్మానించి మిఠాయి తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం రైతులందరి నుండి జొన్న పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఏవైనా సమస్యలుంటే రైతులు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.