చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న నూతన కోర్టు భవనాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కోర్టు భవనాన్ని వీలైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, బోథ్ కోర్టు న్యాయమూర్తి పి.మౌనిక. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావు దేశ్పాండే, సెక్రటరీ పంద్రం శంకర్, అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆర్డీఓ స్రవంతి, తహసీల్దార్ సుభాష్ చందర్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ గురుస్వామి, ఏపీపీ శ్రీధర్, న్యాయవాదులు ఆడెపు హరీష్, ఠాకూర్ రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్ కుమార్, చౌహాన్ విక్రమ్ సింగ్, వివేక్ సింగ్, ఎట్టం రాములు తదితరులు పాల్గొన్నారు.
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15 వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను ‘స్థానిక’ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించింది. ఎన్నికలు వాయిదా పడినా, మళ్లీ నిర్వహించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డికి సన్మానం
చిత్రం న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డితో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం సహకార బ్యాంకును సందర్శించారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్, సీఈవో నాగభూషణం కలిసి డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజరెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బండారి దేవన్న, తదితరులు ఉన్నారు.
బోర్ వేయించి కాలనీవాసుల సమస్య తీర్చిన ఆడే గజేందర్
చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలం పొచ్చర గ్రామంలో రాంనగర్ కాలనీవాసులు నీటి సమస్య ఉందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బోర్ వేయించి వారి నీటి సమస్యను తీఇచ్చారు. దీంతో కాలనీవాసులు ఆడే గజేందర్ ను శాలువాతో సన్మానించారు. కాలనీ వాసులతో కలిసి నూతన బోర్ ను బటన్ వేసి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే, సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు వారి వెంట నాయకులు ,కార్యకర్తలు, ఉన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రముఖ వ్యాపార వేత్త, ఆదిలాబాద్ హోండా షోరూమ్ యజమాని రవీందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఘనంగా జరిగాయి. బుధవారం జరిగిన ఈ వివాహ వేడుకల్లో డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట పలువురు ఉన్నారు.
Cyber crime: సైబర్ నేరాలపై అవగాహన
చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని తెలిపారు. సదస్సులో సైబర్ నేరాల తీరుపై వీడియో రూపంలో ప్రదర్శన ఇస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు. అదే విధంగా ప్రముఖ మెజీషియన్ సుధాకర్ మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. గ్రామస్థులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Aadhaar Update: నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి!
చిత్రం న్యూస్, హైదరాబాద్: ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిల్చొనే పని లేకుండా అప్‌డేటింగ్ ప్రాసెస్ ఇప్పుడు సింపుల్ అయింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్.. ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మరికొన్ని రూల్స్ కూడా మారబోతున్నాయి. అవేంటంటే..
*గవర్నమెంట్ ఐడీ ఉపయోగించి..ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే.. దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్ డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారాయి. పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్ అప్ డేట్ కి రూ. 75, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫొటో అప్ డేట్ కి రూ.125, 5 ఏళ్ల నుంచి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితం. ఆధార్ రీప్రింట్ అభ్యర్థనలకు రూ.40గా నిర్ణయించారు.
*ఆధార్– పాన్ లింక్: నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లదు.
*ఈజీ కేవైసీ: నవంబర్ 1 నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీ అవ్వనుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కెవైసీ(KYC) చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించి కెవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు.
బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు
గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం
చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా మార్కెట్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.మంగళవారం పంటను ఆరబెట్టడానికి వచ్చిన రైతుకు గాజు సీసా కుచ్చుకోవడంతో గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు
గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం
చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా మార్కెట్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.మంగళవారం పంటను ఆరబెట్టడానికి వచ్చిన రైతుకు గాజు సీసా కుచ్చుకొని గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
సోయాబీన్ పంట కొనుగోలుపై కలెక్టర్ కు రైతుల విజ్ఞప్తి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోలుకు సంబంధించి కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో అత్యధికంగా పండించే సోయాబీన్ పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు ₹3,900 నుండి ₹4,200 వరకు కొనుగోలు చేస్తుండగా, ప్రభుత్వ మద్దతు ధర ₹5,360గా ఉందన్నారు. రైతుల తరపున మార్క్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో ముంపుకు గురైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఈ సంవత్సరం అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. వారి వెంట రైతులు సాయిప్రసాద్, అడ్డి అనిల్ రెడ్డి, గంగం స్వామి రెడ్డి, పబ్బు స్వామి, శబ్బష్ ఖాన్, ఆస్ర వేంకన్న తదితరులు ఉన్నారు.










