నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
*రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న
చిత్రం న్యూస్, ఇచ్చోడ: మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను నమ్మంచి నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అన్నారు. సంక్షోభంతో కూడుకున్న వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకుండా, మండల కేంద్రాలల్లోని మార్కెటింగ్ చేస్తున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న సబ్ డీలర్లు కలిసి రైతులకి అప్పురూపేణా కొంత వరకు ఆర్థిక సహాయం చేస్తూ చాటు మాటున మారుమూల గ్రామీణ అమాయక రైతులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న దృశ్యాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయ ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ డీలర్లపైనా నిఘా పెట్టవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రదానంగా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడు పో తున్నాయన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టి విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టాలన్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ని నమోదు చేసి, ఎవరు నకిలీ విత్తనాలు అమ్మకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు. రైతులు అనిల్, మోహన్, మాణిక్ రావ్ sk సలీమ్, తదితరులు ఉన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి*
ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు*
*ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు*
*ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో పరీక్షలు

చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ ఆవరణలో లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సి ఎస్ సి సెంటర్ ద్వారా టెక్నీషియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ , కొలెస్ట్రాల్, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ, ఇతరత్రా 50 పైగా వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. 115 మందికి వైద్య పరీక్షలు చేశారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తెలిపారు.
బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*.
*బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*.
నాణ్యతలో, దృఢత్త్వంలో, పెట్టింది పేరు బంగర్ సిమెంట్

చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం బంగర్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించినారు అనంతరం బంగర్ సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసు మాట్లాడుతూ పేరు లో నాణ్యతలో, దృఢత్వంలో, ఎత్తయిన కట్టడాలకు పెట్టింది పేరు బంగర్ సిమెంట్ ను వాడండి అని మేస్తిర్లకు సిమెంటుపై అవగాహన సదస్సులో తెలిపారు . సదస్సులో పాల్గొన్న మేస్త్రీలకు గిఫ్ట్ బాక్స్ లు అందజేశారు ఈ కార్యక్రమంలో కనక లక్ష్మీ ట్రేడర్స్ డీలర్ గడిగొప్పుల సంతోష్ , మేస్త్రీలు చెట్ల అల్లోజి, బోడకుంట అంజి, గడ్డం చంద్రయ్య, కోటి, గట్టు రాకేష్, పోతుగంటి శ్రీనివాస్, పెండం మల్లేష్.
తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి వెళ్లే రైలు ఓదెలలో ఆపాలని కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేత
తిరుపతి వెళ్లే రైలు ఓదెలలో ఆపాలని కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేత
*సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్
చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్ లో తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం ప్రధాన కార్యదర్శి కలవేని శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి పెద్దపల్లి లో పలు రైల్ల తో పాటు పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఓదెల లో తిరుపతి రైలు హాల్టింగ్ ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. దీనికి ఆయన సంబంధిత అధికారుల తో మాట్లాడతానని సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదే విదంగా హుజురాబాద్ డిపో కు చెందిన జమ్మికుంట నుండి సుల్తానాబాద్ మధ్య నడిచే బస్ లను వయా ఓదెల కనగర్తి మీదుగా నడిపే విధంగా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు
13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
*నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
*పేకాట ముక్కలు, రూ 14,080/- నగదు, ఆరు బైకులు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం
*నేరడిగొండ నీలిమా దాబా వెనకాల స్థలంలో పట్టుబడ్డ 13 మంది
చిత్రం న్యూస్, నేరడిగొండ: జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో నేరడిగొండ మండలం నీలిమ ధాబా వెనకాల పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్సై దాడి చేయగా సంఘటన స్థలంలో 13 మంది నేరస్తులు పట్టుబడ్డారని ఇచ్చోడా సీఐ బండారి రాజు తెలిపారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు రూ 14,080 నగదు, ఆరు బైక్లు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన వారిలో సయ్యద్ జహీర్, గడ్డం రవిచందర్ రెడ్డి, గూడూరు లవ కుమార్, రాథోడ్ రవీందర్, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్, నల్ల అడెల్లు, సోలంకి కరన్ సింగ్, గోతి గులాబ్ సింగ్, మాడ గంగాధర్, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పవర్ సంతోష్ లు ఉన్నట్లు వీరందరూ నేరడిగొండ దగ్గరలో ఉన్న గ్రామాలకు చెందిన వారని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్ ఐ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Odelah: 32 రైల్వే గేట్ నుండి రోడ్డు పనులు ప్రారంభం

*తారక రామ కాలనీ వాసుల ఆకాంక్ష ఈ రోడ్డు
చిత్రం న్యూస్, ఓదెలః
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో 32 రైల్వే గేట్ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రూ. 7 లక్షల వ్యయంతో కాంగ్రెస్ నాయకులు రోడ్డు పనులను బుధవారం జేసీబీ సాయంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఓదెల మండల ఆఫీస్ వరకు రెండు వరుసల రోడ్డు మంజూరు కాగా అనివార్య కారణాల వలన తారకరామ కాలనీ నుండి రోడ్డు పనులు నిలిచిపోగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు చొరవతో 32 రైల్వే గేట్ తారకరామ కాలనీ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రోడ్డు పనులు పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, చీకట్ల మొండయ్య, మీనుగు సంతోష్, గొర్ల శ్రీనివాస్, రాపల్లి రాజయ్య, అల్లం సతీష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, క్యాతం తదితరులు ఉన్నారు
జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్;
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుగ్గారం గ్రామంలో గల శ్రీ జగదాంబ దేవి అలాయాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు రాథోడ్ సురేందర్, నాని (నక్లు), పాండు, ప్రతాప్ తదితరులు ఉన్నారు.
ఘనంగా సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు……*
- ఉప్పొంగిన అభిమానం…
![]()
![]()
![]()
*మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన….*
75 మంది స్వచ్ఛంద రక్తదానం…
చిత్రం న్యూస్, ఆదిలాబాద్;
యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బేల మండల కేంద్ర ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.స్థానిక A N ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన శిబిరానికి మండలంలోని అభిమానులు పార్టీ కార్యకర్తలు యువకులు ఉప్పెనెల తరలివచ్చి రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క,కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ హాజరై కేక్ కట్ చేసి సామ రూపేష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రూపేష్ రెడ్డిని అభినందించారు. పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ యువతరం నాయకుడు,ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులుసామ రూపేష్ రెడ్డికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనుక్షణం ప్రజల కష్ట సుఖల్లో ఉంటూ పేదలకు అత్యవసర సమయంలో ఒక అంబులెన్స్ ల పని చేస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తున్నందుకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు. బేల మండలంలో గిరిజనులకు ఆరోగ్య పరంగా మరిన్ని సేవలు చేయాలనీ కోరారు. భవిష్యత్తులో మీ నాయకత్వంలో బేల మండలం కాంగ్రెస్ పార్టీ మంరింత అభివృద్ధి చెందాలని కోరుతూ మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
పాల్గొన్న కాంగ్రెస్ నేతలు….
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లె,జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వంకడే,బేల మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే,మాజీ ఎంపిటిసి లు సుదర్శన్,నగేష్ రెడ్డి,శంకర్,కిసాన్ కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్,యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు అవినాష్,జైనథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడవి చంద్రకాంత్,శంకర్,అఖిల్,వినోద్,మేకల జితేందర్,అభిమానులు పాల్గొన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;
కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో భోరజ్ మండలంలోని సిరసన్న గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి కే వీ కే సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటలలో ఎరువుల సమతా స్థితి, విచక్షణారహితంగా పురుగుమందులు వాడకుండా చూడడం, పంట మార్పిడి, నీటి సంరక్షణ పద్ధతులు, విత్తనము విత్తన రకాలు ,విత్తన రసీదు, చెట్లు నాటడం, పర్యావరణం కాపాడడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సిద్ధార్థ, మండల ఉద్యానవన అధికారి, అలేఖ్య, ఏ ఈ వో తౌసిఫ్ పాల్గొన్నారు.
రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.
రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.
చిత్రం న్యూస్, సాత్నాల;

రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఆత్మ స్థైర్యంతో ఉండాలని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సాత్నాల మండలం సుందరిగి గ్రామానికి చెందిన కొప్పుల లచ్చన్న అనే రైతు ఇటివల ఆత్మహత్య చేసుకోగా…. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులను కలిసి అధైర్య పడవద్దు అని ధైర్యాన్ని కల్పించారు.. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సైతం అందకపోవడం రైతుని తీవ్రంగా కల్చవేసిందన్నారు.దిక్కుతోచని స్థితిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, అన్నం పెట్టె అన్నదాత ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడవడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కుటుంబాలలో తీవ్ర సంక్షోభం ఏర్పడే రైతు ఆత్మస్త్రాన్ని దెబ్బతీస్తుంది అన్నారు.. రైతులు ఎవరు అధైర్య పడకుండా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపిటిసి దేవన్న, సర్పంచ్ నర్సింగ్, పోచ్చన్న, కిష్టన్న, సంతోష్, పోతన్న, మునఫ్, కుమ్రా రాజు, ఉగ్గే విట్టల్ తదితరులు ఉన్నారు…


