Home Blog Page 151

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

0

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్:  భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను  బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  లోక ప్రవీణ్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, నాయకులు నగేష్, గిమ్మ సంతోష్ రావు, డేరా కృష్ణారెడ్డి, షకీల్, శ్రీలేఖ ఆదివాసీ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం

0

ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం

*మాట్లాడుతున్న జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ జీ

చిత్రం న్యూస్, రంగారెడ్డి: సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంయుక్త నిర్వహణలో భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సమావేశం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ లోని గీతా భవన్ లో నిర్వహించారు. 21 కులాలకు చెందిన 55 మంది పాల్గొన్నారు. ప్రతి కులం నుండి ఒకరినీ సన్మానించారు. మనము, ఎస్సీ కులస్తులు సోదరులమనే భావనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం మేరకు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఒక కుల దేవత, చరిత్ర ఉంది. 75 సం,ల రాజ్యాంగం అమలులో అభివృద్ధి ఫలాలు అన్ని ఎస్సీ కులాలకు సమంగా చేరలేదని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని, ఎస్సీలకు చెందిన అన్ని కులాలవారికీ, అందరి ప్రగతి కోసం కలసి మెలసి పని చేయాలనన్నారు. రాజకీయాలు అవసరమే! అయితే రాజకీయాలు మాత్రమే అనుసరిస్తే అవి ప్రజలను విడదీస్తాయని, ధర్మ,సంస్కృతులు మాత్రమే ప్రజలను సమైక్యం చేస్థాయని” శ్రీ శ్యామ్ ప్రసాద్ జీ, జాతీయ కన్వీనర్ తమ ప్రస్తావనలో పేర్కొన్నారు.అలాగే ఎస్సీ కులాలకు, మిగతా కులాల మధ్య అంతరాల గురించి ప్రశ్నించే వాళ్ళు వివిధ ఎస్సీ కులాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్ష చేసుకోవాలని శ్రీ శ్యామ్ జీ గుర్తు చేశారు. మన అందరి మధ్య మరింతగా సద్భావం, సోదర భావం పెరగడానికి మనం ఏమేమి చేయగలమో అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలిపారు. ఈ చర్చలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

మనం ఎస్సీలం మాత్రమే కాదు హిందువులము కూడా!

అరుంధతి మాత హిందువుల అందరికీ ఆదర్శ స్త్రీ, వివాహం అనంతరం అన్ని కులాలకు చెందిన కొత్త దంపతులు వశిష్ట- అరుంధతి నక్షత్రాలు చూస్తారు కదా! 17 వ శతాబ్దంలో తమిళనాడులోని శివగంగకోట పై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తు ఆత్మ బలిదానం చేసిన యువతి *కుయిలి* ఎస్సీ మహిళయని శ్రీ సత్యనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగింపు సమావేశంలో ప్రసంగించారు. భాగ్యరెడ్డి వర్మ మనువడు శ్రీ అజయ్ గౌతమ్ దంపతులు పాల్గొని, భాగ్యరెడ్డి వర్మ గారి సేవా కార్య క్రమాలను గుర్తుచేశారు.సమావేశ నిర్వాహణను డా,వెంకట నరసయ్య, సీనియర్ శాస్త్రవేత్త IICT చేశారు. కార్యక్రమంలో శ్రీ మారేడు మోహన్ ( రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి), శ్రీ వేణుగోపాల్, సమరసత తెలంగాణ సహా కన్వీనర్, శ్రీ చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ సంచార తెగల సంఘం పాల్గొన్నారు. కొంపల్లి అరవింద్, ప్రతాప్, వేముల శ్యామ్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో తమ పాత్ర పోషించారు.

వరదలపై అధికారులతో సమీక్ష.. పంటలు పరిశీలన

0

నష్టం అంచనా వేసి సమగ్ర నివేదిక అందించాలి

*ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తాజా వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్ గంగా గెస్ట్ హౌజ్ లో అధికారులతో మంత్రి సమీక్షించారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ, వరద నష్టంపై శాఖల వారీగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆ మేరకు నిధులు కేటాయించాలని కోరతానని తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంతకుముందు ఇటీవల బోరజ్ మండలం తరోడా వద్ద వంతెన దాటుతూ లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు కొట్టుకుపోయి మృతి చెందడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనా రూ.5లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, తంతోలి గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు,ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు ఉన్నారు.

ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలి

0

*భీంపూర్ మండలం పిప్పల్ కోటిలో పంటలు, ఇండ్లు పరిశీలించిన సీపీఎం బృందం

సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్, బ్యూరో: జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇండ్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్ప సంతోష్ అనే కౌలు రైతు 14 ఎకరాల భూమిలో 25 పత్తి సంచుల విత్తనాలు వేశారని,  ఇప్పటివరకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. పంట చేతికి వస్తే పదమూడు లక్షల రూపాయలు వరకు దిగుబడి వచ్చేదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పూర్తిగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు తొనుపు స్వామి నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా పూర్తిగా నీట మునిగిందన్నారన్నారు.ఇలా పిప్పల్ కోటిలో రెండు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు.   గ్రామంలో ఇండ్లలోకి నీరువచ్చి నష్టపోయిన బాధిత కుటుంబాలను ఇంటింటికీ తిరిగి పరామర్శించామని పేదల తిండిగింజలు, నిత్యావసర సరుకులు నీట మునిగి నష్టపోవడమే కాక ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కొందరి ఇండ్లు కూలిపోయాయని వివరించారు. వెంటనే ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 25వేలు అందించాలని, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయిన బాధితుల జాబితాను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్. మంజుల, మహిళా సంఘం నాయకులు గంగసాగర్, అరిఫా బేగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, జిల్లా నాయకులు పండుగ పాచ్చన్న, గ్రామ శాఖ కార్యదర్శి ధోనిపెల్లి స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

0

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

చిత్రం న్యూస్, బేల: ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఖోగ్దూర్ ,మాoగ్రుడ్ గ్రామాలలో మంగళవారం మండల నాయకులతో కలిసి పంట నష్టపోయిన రైతుల చేలను పరిశీలించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్  నాయకులు మస్కె తేజరావు, యువ నాయకుడు సతీష్ పవార్,  ఠాక్రే మంగేష్, విశాల్ గోడే,  మనోజ్ గేడామ్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.*

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

0

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

చిత్రం న్యూస్, ఇచ్చోడ: వర్షాకాలంలో విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని CHO డాక్టర్ బ్రహ్మానంద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని TTWURJC AHS బాలికల హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్లోని వంటశాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెంది, డెంగ్యూ, మలేరియా, అతిసారం, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్, పి హెచ్ ఎన్ రాజుభాయి, ఏఎన్ఎంలు సుధారాణి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

భారీ వర్షాలు…నిర్మల్ జిల్లా విద్యా సంస్థ లకు ఒక రోజు సెలవు

0

భారీ వర్షాలు…నిర్మల్ జిల్లా విద్యా సంస్థ లకు ఒక రోజు సెలవు

చిత్రం న్యూస్, భైంసా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధువారం రాష్ట్రంలో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.అతిభారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవసరమైతే కలెక్టర్లు నిర్ణయం తీసుకొని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తెలపగా.. వాతారవరణ శాఖ సూచన మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్కూళ్లకు హాలిడేస్ ఇస్తున్నామన్నారు . విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడం, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోవడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు.నాడు (ఆగస్టు 20) జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132లో సంప్రదించవచ్చని తెలిపారు.

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్

0

 

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్

*రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని అసెంబ్లీ ప్రస్తావిస్తానని భరోసా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. మంగళవారం భీంపూర్ మండలంలో బైకుపై సుడిగాలి పర్యటన చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన కరంజి, గోముత్రి, అంతర్గావ్, అర్లి, వడూర్, గుబిడి, ధనోర, భీంపూర్, కరణ్ వాడి, పెన్ గంగా ప్రభావిత గ్రామల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. నష్టపోయిన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నష్టపోయిన రైతులకు రూ. 25వేలు పరిహారం అందించాలని వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రస్థావిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట మండల కన్వీనర్ నాగయ్య,నాయకులు లస్మన్న, నరేందర్, సంతోష్, కల్చప్, ప్రముఖ న్యాయవాది కేమ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ముథోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు

0

ముథోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రూ.45.15 కోట్ల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ తెలిపారు. గతంలో ఇక్కడ ఐటీఐ కళాశాల ( టెక్నాలజీ సెంటర్) మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రిని కోరడంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించడంతో  ముథోల్ లో ఏటీసీ సెంటర్  ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కరంగా ఉంటుందన్నారు. కార్మికులకు ఉపాధి కల్పన ఆధ్వర్యంలో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో  కేంద్రం సాగుతుందన్నారు. విద్యార్థులకు, ని రుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల అవకాశం కల్పిస్తామన్నారు. ఏటీసీ ఏర్పాటు కల శుభసూచకమన్నారు. ఈ నిధులతో భవనం, యంత్రాలు, కంప్యూటర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వానికి, టాటా కంపెనీకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

అంబులెన్స్ లో ప్రసవం..తల్లీ బిడ్డలు క్షేమం

0

అంబులెన్స్ లో ప్రసవం..తల్లీ బిడ్డలు క్షేమ

చిత్రం న్యూస్, ఇచ్చోడ:

అంబులెన్స్ లో ఓ మహిళ ప్రసవించిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముక్రా (బి) గ్రామానికి చెందిన ప్రతిక్ష అనే మహిళకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ 108కు చరవాణిలో సమాచారం ఇచ్చారు. దీంతో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతిక్ష ప్రసవించి ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, తల్లీ ఇద్దరు కవల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ పైలట్ వినోద్, ఈఎంటీ రాకేష్ తెలిపారు.