Home Blog Page 150

పారిశుధ్య కార్మికులకు సన్మానం

0

 పారిశుధ్య కార్మికులకు సన్మానం

చిత్రం న్యూస్, గజ్వేల్: ఎస్సీలకు చెందిన అన్ని కులాల వారు కష్ట కాలంలో, శుభ కార్యక్రమాల్లో కలసి మెలసి ఉండాలని,  మనం ఎస్సీలు కాదు హిందువులమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యాంప్రసాద్ జీ  అన్నారు. హిందువులందరి మధ్య బంధు భావన నిర్మాణం కోసం సామాజిక సమరసత వేదిక దేశ వ్యాప్తంగా పని చేస్తోందని శ్యామ్ ప్రసాద్ జీ వివరించారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో 21 ఆగస్టున ప్రజ్ఞాపూర్ లోని ప్రముఖ దంత వైద్యులు, జిల్లా దంత వైద్యుల అసోసియషన్ అధ్యక్షులు డా.శ్రీధర్ ఇంట్లో జరిగిన సమావేశానికి డా,ఆకుల నరేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎస్సీలకు చెందిన నాల్గు కులాల వారు పాల్గొన్నారు. బైండల,చిందు కులాలకు చెందిన వారు పాటలు పాడారు. వారికి మాదిగ,మాల కులస్తులకు చెందిన పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. తరువాత కలసి సామూహిక భోజనం చేశారు. ఎస్సీ కులాల వారు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లాలని, ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలని, వారిని బాగా చదివించాలని కోరారు. విద్యార్థి విభాగం ప్రముఖ్ శ్రీ కృష్ణ, అడ్వకేట్ శ్రీకాంత్ పారిశుధ్య కార్మికుల ఆర్థిక,సామాజిక స్థితి గతులపై సర్వే చేశారు.తెలంగాణ కన్వీనర్  అప్పాల ప్రసాద్, డా.శ్రీధర్, డా.సాయినాధ రెడ్డి, డా. శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు.

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

0

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. గురువారం విద్యార్థులకు చేయూత కార్యక్రమం లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల వాడ కాలనీ లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేసి విద్యార్థుల తల్లితండ్రులను సన్మానించారు. అంతకు ముందు పాఠశాలకు విచ్చేసిన మౌనిష్ రెడ్డి కి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని, ఉపాధ్యాయులు సుష్మరాణి, గీత, మాజీ సర్పంచ్ రాజన్న, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.

పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

0

*భైంసా లోని ఆనంద్ నగర్ లో విషాద ఘటన

చిత్రం న్యూస్, భైంసా:  ఫోన్ లో పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆనంద నగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాదు మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్- సాయిప్రజ దంపతులు గత కొంతకాలంగా బైంసా లోని ఆనంద్ నగర్ కాలనీలోని నివాసం ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు బేతి రిషేంద్ర (13)  హైదరాబాదులో బాష్యం స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసుకుని పదవ తరగతి లో చేరాల్సి ఉండగా కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిస అయ్యాడు. పదో తరగతి కోసం పాఠశాలలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి పోయాడు. మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టేందుకు చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజులుగా కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన విద్యార్థి  బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసా పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం  మృతదేహాన్ని  ఏరియా ఆస్పత్రి కి తరలించారు.

పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా

0

* పరామర్శలు కాదు రైతులకు భరోసా కల్పించాలి

*ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: రైతులు సాగు చేసే పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో పాలకుల పరామర్శ కాకుండా మానవతా దృక్పథంతో రైతులకు భరోసా కల్పించాలని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పరిశీలించిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు రూ.10వేలు ఇస్తే ఎలాంటి లాభం లేదని మిగతా విత్తనాలను సబ్సిడీలో అందించాలని సూచించారు. అదేవిధంగా కోతకు గురైన భూములను చదును చేసుకునేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడకుండా ఉండేదని తెలిపారు. రైతులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పేవని అన్నారు. ఇప్పటికే రైతులు 70 నుండి 80 శాతం వరకు పెట్టుబడులు పెట్టారని, సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో శాశ్వత పరిష్కారానికై చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు జోగు రవి, లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, దినేష్ మటోలియా, సంతోష్, రాకేష్, దయాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

0

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి_కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, భైంసా: గణేష్ ఉత్సవాలు సోదరభావంతో,శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పీస్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండపాల వద్ద కచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదన్నారు. మద్యం తాగి మండపాల వద్ద ఉండరాదని, డీజేలు, లౌడ్ స్పీకర్లతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో కచ్చితంగా విద్యుత్తు సరఫరాతో పాటు తగు సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించాలన్నారు. విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏ ఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి

0

 ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి

ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్

చిత్రం న్యూస్, సొనాల:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలని ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్లాస్టికేతర బ్యాగులనే వాడాలంటూ వారసంతలో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు  ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనే భూతం పర్యావరణాన్ని, నాశనం చేస్తూ, కాలుష్య కారినిగా తయారైందని  ప్లాస్టిక్ వాడకంతో నీరు భూమిలో ఇంకకుండా పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని, అదేవిధంగా క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు చెట్ల పెళ్లి అనిల్,   పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఏఎంసీ డైరెక్టర్, ఇస్రూ పటేల్, బీసీ సెల్ ఛైర్మన్ జంగాల భోజన్న , కసిరే పోతన్న, మాజీ సర్పంచ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక ఆలయం 8వ వార్షికోత్సవం

0

ఘనంగా వినాయక ఆలయం 8వ వార్షికోత్సవంఆ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ రేణుకా అపార్టుమెంటు లోని వినాయక ఆలయం 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ, హోమాది కార్యక్రమాలను చేపట్టారు. లోక ప్రవీణ్ రెడ్డి దంపతులతో పాటు అపార్టుమెంటు లో నివసించేవారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆలయ వార్షికోత్సవంలో వినోద్, మేయూర్, సందీప్ రెడ్డి, సునీల్, అనిల్ రావు,  ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటన

0

బైక్ పై తిరుగుతూ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు నీట మునగడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతులు అధైర్యపడవద్దని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అటు అధికారులు సైతం గుంట భూమిని కూడా వదలకుండా నష్టపోయిన ప్రతి భూమిలో సర్వేలు నిర్వహించి, త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తృతంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం జైనథ్ మండలంలోని పెండల్వాడ, బాలపూర్, సాంగ్వి, కౌఠ తదితర పెన్ గంగా నది పరివాహక గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులను వెంటబెట్టుకొని పర్యటించారు. ఈ సందర్భంగా స్వయంగా తానే బైక్ నడుపుతూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..భారీ వర్షాలతో దాదాపు 20 నుండి 22 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఉందన్నారు. ప్రస్తుతం రైతుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, రైతులెవ్వరు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రైతులు సాగు పెట్టుబడికి తెచ్చిన అప్పులు బ్యాంకు రుణాలను వెసులుబాటు చేయాల లేదా రీ షెడ్యూల్ చేయాలా అనే అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు వ్యవసాయ శాఖ అధికారులు,  బీజేపీ నాయకులు లోక కరుణాకర్ రెడ్డి, ఎల్టి అశోక్ రెడ్డి, విజయ్, ఉల్లాస్ రెడ్డి, నరేష్, రాందాస్, రమేష్, శ్రీకాంత్, రాకేష్, వైభవ్, సంతోష్, సూర్యరెడ్డి  తదితరులు ఉన్నారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ

0

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న  బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆధునిక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారత దేశాన్ని ఐటీ, టెలికాం, అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు కృషిచేశారని తెలిపారు. ఆయన పాలనలో పేదరిక నిర్మూలనకు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత పయనించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ కో -ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు మర్సుకోలా గౌతమ్, మాజీ కౌన్సిలర్ ముర్తుజా,మాజీ టౌన్ అధ్యక్షులు వసీం, సీనియర్ నాయకులు అలీమ్, కొరటి ప్రభాకర్, ఎండీ ఆఫ్సర్, ముత్యాల మహేందర్, ప్రజ్ఞషిల్, షేక్ రహీమ్, ఆఫ్సర్ ఖాన్, రెండ్ల రాజన్న, దినేష్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

పిప్పల్ కోటి భూనిర్వాసితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి

0

రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా బృందం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: పిప్పల్ కోటి రిజర్వాయర్ పేరుతో సేకరించిన 1200 ఎకరాల్లో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి మిగితా 1020 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి తెలిపారు. భూనిర్వాసిత రైతులతో కలిసి బుధవారం పిప్పల్ కోటి రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణం పేరుతో 2018 సంవత్సరంలో 1200 ఎకరాల సాగుభూములను సేకరించారని,అందులో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు 8 లక్షలు నిర్ణయించినప్పటికీ ఏడేండ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎందుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు భూమిని సాగుచేసుకోలేక ,అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన భూమి విలువకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదు అన్నారు.ఆ డబ్బులతో రైతులు మరో చోట భూమిని కొనుక్కోలేని విదంగా భూముల రేట్లురెట్టింపు అయ్యాయన్నారు. రిజర్వాయర్ పనులు సైతం నత్త నడకన నడుస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో  పూర్తికావాల్సిన పనులు ఏడేండ్లుఅయిన పూర్తికాక పోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. గత పాలకులతో పాటు ఏడాదిన్నర పూర్తి చేసుకున్న ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. వెంటనే రైతులకు నష్టపరిహారం రెట్టింపు చేసి చెల్లించాలని ,రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, సీఐటీయూ నాయకులు అగ్గిమల్ల స్వామి ,పండుగ పొచ్చన్న మహిళా నాయకులు అరీఫా బేగం ,గంగాసాగర్ ,గ్రామ కార్యదర్శి ధొనిపెల్లి స్వామి , రైతులు నసీరుద్దీన్ ,పెంటన్న తదితరులున్నారు .