Home Blog Page 15

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న లోక ప్రవీణ్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పూజ బాపు దంపతులు ఆదివారం గృహప్రవేశం పూజా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతనితోపాటు భుక్తాపూర్ వార్డు కాంగ్రెస్ నాయకుడు రోహిత్ షిండే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  షేక్ అన్వర్, అంజాద్ ఖాన్, షేక్ రహీఫ్ అహ్మద్, షేక్ హైదర్ అహ్మద్, షేక్ అర్బజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

కొట్టాల పోచమ్మకు భక్తుల బోనాలు

0

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండల కేంద్రంలోని సినిమా టాకీస్ వద్ద కొట్టాల పోచమ్మ అమ్మవారికి ఆదివారం గ్రామస్తులు బోనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థిస్తూ మొక్కులు తీర్చుకున్నార. బోనాలు సమర్పించారు. సల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు.

వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: మీరు బ్యాంక్ పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 24 నుంచి జనవరి 27 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

సెలవుల వివరాలు ఇవే: జనవరి 24 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 25 (ఆదివారం): సాధారణ సెలవు దినం. 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా జాతీయ సెలవు. 27 (మంగళవారం) వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వరుస సెలవుల కారణంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కస్టమర్లు తమ అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు UPI సేవలను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం 

0

చిత్రం న్యూస్, సాత్నాల: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సాత్నాల మండలం మేడిగుడ (ఆర్ ) గ్రామంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ జాదవ్ రామారావు, గ్రామ సర్పంచ్ పర్చాకే లక్ష్మి, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేపట్టారు. వయసు పైబడిన వారిని ఘనంగా సన్మానించారు.

క్రికెట్ ఆడి..పోటీ ప్రారంభించి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా  ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో న్యాయవాదులకు నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. పరిచయం చేసుకొని కరచాలనం చేశారు. అనంతరం సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. అంపైర్ గా న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, న్యాయవాదులు రమణా రెడ్డి, దేవేందర్ సింగ్, కరుణాకర్, ముజాహిద్ హుస్సేన్ తదతరులు పాల్గొన్నారు.

 

మీసేవ సీఎస్సీ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ అంజనబాయి కిషన్

0

చిత్రం న్యూస్, సాత్నాల: మండలంలోని కాన్ఫ మేడిగూడ (కెనాల్) గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన అయ్యప్ప మీసేవ సీఎస్సీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అంజనబాయి కిషన్ ప్రారంభించారు. ఆయన  మాట్లాడుతూ.. గ్రామస్తులు సీఎస్సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఉప సర్పంచ్ మోటాపులకుల రవి, తుడం రమేష్, టీ.సుభాష్, యన్. నర్సింగ్, బి.వంశీ, బి.ఆకాష్, అడెల్లు తదితరులు పాల్గొన్నారు.

బాసర ఆలయంలో అలరించిన సంగీత కచేరి

0

*108 కళాకారులతో సామూహిక వీణ వాయిద్యం

*బాసర అమ్మవారికి “కళార్చన”

 చిత్రం న్యూస్, బాసర :భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శుక్రవారం అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పోతరాజు జయలక్ష్మి త్యాగరాజ మ్యూజిక్ కళాశాల శ్రీ భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాలలో ప్రముఖ వీణా అధ్యాపకురాలిగా సేవలందిస్తూ, తమ సంగీత సాధనతో అనేక మంది ప్రతిభావంతమైన శిష్యులను తీర్చిదిద్దారు. వీణా విద్యలో వారికి ఉన్న అపారమైన అనుభవం, నిబద్ధత, అంకితభావం వల్ల ఎంతో మంది శిష్యులు నేడు వీణా విద్వాంసులుగా ఎదిగి సంగీత లోకంలో తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అటువంటి విశిష్ట కళాకారిణి అయిన జయలక్ష్మి ఎన్నో ప్రతిష్టాత్మక వీణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అనేక పురస్కారాలు, ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకున్నారు.  ఈ నేపథ్యంలో వసంత పంచమి సందర్భముగా  బాసర క్షేత్రంలో వారి శిష్యబృందం చేత అమ్మవారికి అంకితంగా “కచ్చపి అష్టోత్రర వీణా స్వరార్చన”ను ఇది భక్తి, సంగీతం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచే దివ్యమైన కార్యక్రమంగా ఒకేసారి సామూహికంగా 108 మంది కళాకారులు తమ వీణ వైద్యంతో  కళామ తల్లి శ్రీ జ్ఞాన సరస్వతికి కళశాల రూపంలో సమర్పించారు. కార్యక్రమాన్ని చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అపూర్వమైన వీణానాదాన్ని ఆస్వాదించి భక్తులు చూస్తూ సాక్షాత్తు సరస్వతి దేవి వీణ వాయిస్తున్నట్టుగా అమ్మవారి రూపంలో కళాకారులు కనబడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారిని అంజనీదేవి, ఏఈఓ సుదర్శన్ గౌడ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

మత్స్యరంగం యువతకు ఉపాధి కల్పనలో కీలకం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

సాత్నాల ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల

చిత్రం న్యూస్, సాత్నాల: మత్స్య రంగం గ్రామీణ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించే రంగమని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సాత్నాల ప్రాజెక్టులో రూ.3 లక్షల విలువైన రొయ్య పిల్లల (రొయ్య సీడ్) విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రొయ్య పిల్లలను నీటిలోకి విడుదల చేసి, స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు.

సాంకేతికతతో మత్స్యాభివృద్ధి: ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో, మత్స్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారా గ్రామీణ యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కేజ్ వీల్ (Cage Wheel) సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సాంకేతికతను సాత్నాల, మత్తడివాగు, పెండల్‌వాడ చెరువుల్లో అమలు చేసేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీనివల్ల చేపల ఉత్పత్తి పెరిగి మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పెండల్‌వాడ చెరువు అభివృద్ధికి హామీ: పెండల్‌వాడ చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి అవసరమైన నిధుల మంజూరుకు తాను తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిధులు సాధించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని, మత్స్యకారుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రాజెక్టులలో రొయ్య పిల్లల విడుదల కార్యక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని పాయల్ శంకర్ కోరారు. సకాలంలో వీటిని చేపట్టకపోతే మత్స్యకారుల జీవనాధారం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య రంగం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్, డోకె సంతోష్, ముకుంద్, అస్తక్ సుభాష్, స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ 

0

చిత్రం న్యూస్, బేల:   మహిళల ఆత్మ గౌరవాన్ని చాటాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా శక్తి ద్వారా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ మహిళలకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ తో కలిసి శుక్రవారం ఈ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సామ  రూపేష్ రెడ్డి వారితో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు అండగా  ఉంటుందన్నారు. మహిళా శక్తి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లోను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించి మరిన్ని సేవలందించేందుకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు వినోద్, మంచికంటి సాయి, మంచికంటి ఉషన్న,సిద్రప్ సునిల్, గెడం సతీష్,రనీల్,బేల మండల యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నర్సారెడ్డి,సుధాకర్,సునీల్ తదితరులు ఉన్నారు.

130 దేశీదారు బాటిల్స్ పట్టివేత

0

ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

చిత్రం న్యూస్, సొనాల:  సొనాల మండలంలోని సంపత్ నాయక్ తండా గ్రామంలో  దేశీదారు సీసాలను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ Md. జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ పూల్ సింగ్ , రాథోడ్ సంజు అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన దేశీదారు బాటిల్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఇద్దరు వ్యక్తుల దగ్గర మొత్తం 130 (90ml) బాటిల్స్ లభించాయి. ఈ దాడులలో ట్రైనీ సబ్ ఇన్ స్పెక్టర్ వి.శ్రీనివాస్, సిబ్బంది కార్తీక్ , సంధ్యారాణి, మయూరి, అరుణ, మంజుల పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా కలిగి ఉన్న, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.