Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 14

Congress: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం మంజూరు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు అన్నారు. సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో  సోమవారం ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 29 ఇళ్ళు మంజూరు చేశారన్నారు. రానివారు నిరాశ చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందజేస్తామన్నారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారు దివ్య_వెంకట్ రెడ్డి దంపతులను సన్మానించారు.  నాయకులు అల్చేట్టి నాగన్న,  షకీల్, ఎం.ఏ ఖయ్యూం, స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, క్యాతం శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చిట్యాల భూమన్న తదితరులు పాల్గొన్నారు.

తరోడ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ 

0

తొలగనున్న తరోడ బ్రిడ్జి వద్ద రాకపోకల ఇబ్బందులు

రూ.12 కోట్లతో వంతెన నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమిపూజ

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు తరోడ వంతెన వద్ద పడుతున్న రాకపోకల ఇబ్బందులు ఎట్టకేలకు తొలగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.12 కోట్లతో నిర్మించే తరోడ బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తరోడ పాత వంతెన బీటలు వారి కూల్చివేయగా..అదే స్థానంలో పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ. 12 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా వంతెన నిర్మాణ పనులు ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భవిష్యత్తులో ఈ 353 బీ జాతీయ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ నూతన వంతెన నిర్మాణ పనులు రానున్న మే మాసంలోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ బోయర్ విజయ్,  జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, భోరజ్ మండల అధ్యక్షుడు గాజుల సన్నీ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తాటిపెల్లి రాజు, మాజీ సర్పంచ్ గజానన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు

బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

0

*ఆర్థిక నేల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

*రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి

*పాత నేరస్తులపై, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలి

*అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి

*గంజాయి, మాదకద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్మూలించాలి

చిత్రం న్యూస్, బోథ్ : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. సీఐ గురు స్వామి ఎస్పీకి పూల మొక్క అందజేశారు. పోలీసు  సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్నందున అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఎటువంటి మాదకద్రవ్యాలకు ఆస్కారం లేకుండా గంజాయి లాంటి వాటిని పూర్తిగా నిర్మూలించే దిశగా కృషి చేయాలని, గంజాయి పండించిన, వ్యాపారం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. వీపీఓ విధానం ద్వారా సమాచార సేకరణ మరింత సులభంగా..  ప్రజలకు పోలీసు వ్యవస్థ దగ్గరవుతుందని తెలిపారు. పాత నేరస్తులు రౌడీ షీటర్ ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలనన్నారు. సర్కిల్ పరిధిలో ఎలాంటి కేసుల దర్యాప్తు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. నేరస్థులకు శిక్షలు పడిన సందర్భంలో పోలీసులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలుస్తుందని ప్రజలలో విశ్వాసం నమ్మకం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సీఐ గురు స్వామి, ఎస్సై లు సాయికుమార్, జి సంజయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలను  ఆయన కొనియాడారు.  ఆయా వెంట కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.

సిరిసిల్ల రాజయ్య”ను కలిసిన లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ “సిరిసిల్ల రాజయ్య”ను  కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కలిశారు. బుధవారం ఉదయపు నడకకు వచ్చిన ఆయన్ను కలిశారు. ఆదిలాబాద్ లో జడ్పీ సీఈవోగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా ముచ్చటించారు. వీరి వెంట డేరా కృష్ణారెడ్డి,  మేకల మల్లన్న తదితరులు ఉన్నారు.

 

 

ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల కోసం పూర్వ విద్యార్ధి కదం యోగేష్ పాఠశాలకు  canon colour printer ను విరాళంగా అందజేసి ఉదారత చాటుకున్నాడు. ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, టీచర్ మౌనిక చేతుల మీదుగా అందజేశాడు. సుమారు వీటి విలువ రూ.6,500 వరకు ఉంటుందని అన్నారు. ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో 20 సంవత్సరాల క్రితం చదివి ఇదే పాఠశాలకు తనకు తోచిన కాడికి ఆర్థిక సాయం అందించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని యోగేష్ అన్నారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతికి కారణమైన నిందితుడు అరెస్టు

0

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని బజార్ హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బోథ్ సీఐ గురు స్వామి తెలిపారు. ఎస్ఐ శ్రీ సాయితో కలిసి వివరాలు ఆయన వెల్లడించారు. ఈ నెల 9న సాయంత్రం సుమారు 6:30 గంటలకు బజార్ హత్నూర్ గ్రామానికి చెందిన చేవుల రత్నమాల (48) తన కుమారుడు చేవుల లక్ష్మణ్ (22) తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై గ్రామానికి వెళ్తుండగా..అదే సమయంలో తరడపు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన కారును మద్యం మత్తులో అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ గ్రామ శివారులో ఎడ్లబండిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు చేవుల రత్నమాల గాయాలతో అక్కడికక్కడే మరణించగా.. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం తాగి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినట్లు నిర్ధారణ కావడంతో బోథ్ సీఐ గురు స్వామి పర్యవేక్షణలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

ఈ నెల 18 నుంచి డిగ్రీ పరీక్షలు

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రం లోని కాకతీయ  యూనివర్సిటీ పరిధిలో మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈ నెల 18 నుంచి ఉంటాయని కీర్తన డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద్ రావు ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి సెమిస్టర్ వాళ్లకు 5 సబ్జెక్టు లు మాత్రమే ఉంటాయని, సమయం తక్కువ ఉందని విద్యార్థులు కష్టపడి ప్రిపేర్ కావాలన్నారు. పూర్తి వివరాలకు అనికేత్ సాగర్ ను సంప్రదించాలి అని ఆయన  పేర్కొన్నారు.

ఫీజు అధికంగా వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోండి-AISF బోథ్ మండల అధ్యక్షులు మున్సిఫ్

0

చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పదో తరగతి విద్యార్థుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన ₹125 ఎగ్జామ్ ఫీజు బదులు ₹700 నుండి ₹1000 వరకు వసూలు చేస్తున్నాయని AISF మండల అధ్యక్షుడు మున్సిఫ్ ఆరోపించారు. ఈ అంశంపై బోథ్ ఎంఈఓ కు AISF ప్రతినిధులతో కలిసి మంగళవారం మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతూ, అన్యాయంగా అధిక ఫీజులు వసూలు చేయడం దోపిడీగా పేర్కొన్నారు. ఈ అన్యాయ వసూళ్లపై వెంటనే తనిఖీలు జరిపి, సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  నాయకులు పి.కార్తీక్, L.నరేష్, R.ప్రేమ్ పాల్గొన్నారు.

ఉదారత చాటిన  ప్రధానోపాధ్యాయుడు మహేందర్ 

0

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నక్కలవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రావుల మహేందర్, పాఠశాలలోని పిల్లందరికి టై, బెల్ట్ ఉచితంగా అందజేసి తన ఉదారతాను చాటుకున్నాడు. పాఠశాలలోని పిల్లలందరికి MEO  మహాముద్ హుస్సేన్ చేతుల మీదుగా టై, బెల్ట్ అందజేశారు.ఈ సందర్బంగా M. E.O మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా వెనకబడిన వారని, వారికి చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి ఉన్నతికి సహాయ పడుతున్న రావుల మహేందర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయడు సంగు స్వామి, PRTUTS మీడియా ఇంచార్జ్ R.రవిరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.