Home Blog Page 138

BSNL సీజీఎంను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

BSNL సీజీఎంను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మారుమూల గిరిజన ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని వినతి

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలపై  హైదరాబాద్ లో గల BSNL సీజీఎంను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గల మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ లేక అవస్థలు పడుతున్నారని, నెట్వర్కులు లేని ప్రాంతాల్లో నూతన టవర్లు ఏర్పాటు చేయాలని ఆయన్ను కోరారు. నెట్వర్కులు ఉన్న గిరిజన ప్రాంతాల్లో టవర్లు సాంకేతిక లోపాల వల్ల నెట్వర్క్ సమస్యలు ఏర్పడుతున్నాయని, కొన్ని టవర్లకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంపై ఇబ్బంది తలెత్తుతుంది అని వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీజీఎం కచ్చితంగా నెట్వర్క్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత 

0

జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత 

*మేడిగూడ (ఆర్) ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ 

*ప్రముఖ వైద్యులు కళ్ళెం వెంకట్ రెడ్డి ఉదారత

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి బుధవారం తన జన్మదినం సందర్భంగా సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) ప్రాథమికోన్నత పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు సతీమణి డాక్టర్ జీవితతో కలిసి ఉచితంగా షూలను పంపిణీ చేసి ఉదారత చాటారు. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించేందుకు  తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..  విద్యార్థులు ఆరోగ్య లక్షణాలను అలవర్చుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. వైద్యపరంగా విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్ళాలని, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకు రావాలన్నారు. అనంతరం డాక్టర్  జీవిత వెంకట్ రెడ్డి దంపతులని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ యాదవ్, వీడేసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, గ్రామస్తులు మడపాచి శ్యాం, పోలవేణి అడెల్లు, డోకె సంతోష్, క్యాతం శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

0

ఆదిలాబాద్ జిల్లాలో ముంపు ప్రాంతాలు, పంటలను పరిశీలించిన మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం  అని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు. గత పక్షం రోజులకు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి, వచ్చిన వరదలతో కొన్ని వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు ఎంతో నష్టపోయారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు బోథ్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను నియోజక వర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు,  నాయకులతో సందర్శించారు. ముందుగా జిల్లాకు వచ్చిన ఆయనకు నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలంలోని పలు గ్రామాలలో పాటు, తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి అధికారులు రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.ఆ నివేదికలు వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని అన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

గణనాథుడి సేవలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

0

గణనాథుడి సేవలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ప్రతిష్టించిన గణనాథుడిని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం మండప నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట మావల మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, గణేష్ మండప నిర్వాహకులు సుధాకర్, అభిలాష్ తదితరులు ఉన్నారు.

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

0

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ ని బోథ్ మాల సంఘ సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ్మశానవాటిక వద్ద రెండు రోజుల్లో బోరు వేయిస్తానని, కమ్యూనిటీ హాల్ కు రూ.5 లక్షలు, శ్మశానవాటికకు సీసీ రోడ్డు త్వరలో మంజూరు చేస్తాననన్నారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆడే గజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ పట్టణ అధ్యక్షుడు బత్తుల ఉషన్న, మాజీ అధ్యక్షులు బక్కువారి రామయ్య, అర్ష భూమన్న, ఏరోల్లా రమేష్, బక్కువారి నారాయణ, అర్ష రవి, కరుణాకర్, బోథ్ మాజీ ఎంపీటీసీ కుర్మే మహేందర్, సీనియర్ నాయకులు బొజ్జా సాయన్న తదితరులు పాల్గొన్నారు.

భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి

0

భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి

*పరుపుల పల్లె వినాయకుని దర్శనం

యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

_మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం  మండలంలోని పరుపులపల్లె గ్రామంలోని వినాయకుని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో  రూ.15 లక్షలతో రోడ్డు,  హైమాస్డ్ లైట్ ఏర్పాటు, సౌండ్ బాక్సులు గ్రామస్తుల కోరిక మేరకు దీపావళి కానుకగా అందజేస్తానన్నారు. యువతీ, యువకులు చదువుపై శ్రద్ధ వహించాలని, చదువే ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల  సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్, యువ నాయకులు S.K ఆసిఫ్ , జాదవ్ కృష్ణ, తుల హరీష్, ప్రదీప్ నాయక్, రాథోడ్ విక్రమ్, పరుపులపల్లె గ్రామ పటేల్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఉద్యోగం సాధించిన సరస్వతి అందరికీ స్ఫూర్తి – ఆడే గజేందర్

0

ఉద్యోగం సాధించిన సరస్వతి అందరికీ స్ఫూర్తి – ఆడే గజేందర్

*BSF (Army)లో ఉద్యోగం సాధించిన రాంనగర్ గ్రామానికి చెందిన సరస్వతిని సన్మానించిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన బనియా సరస్వతి BSF (Army)లో ఉద్యోగం సాధించినందుకు ఆమెను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..బోథ్ నియోజకవర్గంలో సరస్వతిని స్పూర్తిగా తీసుకుని యువతీ, యువకులు ముందుకు వెళ్లాలని, BSFలో ఉద్యోగం సాధించడం గొప్ప విషయం అని అన్నారు.

పంట నష్ట పరిహారం అందజేయాలి

0

పంట నష్ట పరిహారం అందజేయాలి

చిత్రం న్యూస్, నేరడిగొండ : పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని  రైతులు కోరారు. గత యాసంగి ఫిబ్రవరిలో కురిసిన అకాల వర్షాల వల్ల 24, 25 తేదీల్లో మొక్కజొన్న నువ్వులు, జొన్న పంట గాలివానకు నేల మట్టం కాగా నేరడిగొండ వ్యవసాయ అధికారిణి( AO)  కృష్ణవేణి,  ఏఈవో రాథోడ్ వినోద్ లు పంట నష్టం అంచనాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇప్పటికి నష్టపరిహారం రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదకు గురైనటువంటి నష్ట పరిహారంతోపాటు యాసంగి పంట మొక్కజొన్న, నువ్వులు, జొన్న పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు బాద వెంకటరమణ, సుమిత్ రెడ్డి, రాజశేఖర్, లింగేష్,  ప్రమోద్, వినోద్, సంతోష్ ఉన్నారు.

బాసరలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

0

బాసరలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా మంగళవారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ యువతకు ఆదర్శమని, సినిమాలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చి , రాజకీయంలో కూడా కష్టపడి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడని, నేటి యువతకు పవన్ కళ్యాణ్ ఆదర్శం అని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంబకంటి రాజు అన్నారు.. ఈ వేడుకలో బాసర మండల పవన్ కళ్యాణ్ అభిమానులు భాషెట్టి రాకేష్, ,దావు రాజు, సాయి, సతీష్, యోగేష్ , శివ, ఆకాశ్, అనిల్, పవన్, ఫణి, రిషి, హరీష్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా బాలల గణేష్ మండలి  గణనాథునికి పూజలు

0

ఘనంగా బాలల గణేష్ మండలి  గణనాథునికి పూజలు

*51రకాల ప్రసాదాలతో  రెడ్డి కాలనీ గణపతికి నైవేద్యాలు

 

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన గణేషుని ప్రతిమకు భక్తులు, కాలనీవాసులు పూజలు నిర్వహించారు.  గత ఏడు రోజులుగా లంబోదరుడు ఇక్కడ విశేషంగా  పూజలు అందుకుంటున్నాడు. మంగళవారం భక్తులు 51 రకాల ప్రసాదాలతో  బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించారు.  అగ్రజుడైన గణపతికి ప్రత్యేక పూజలు  నిర్వహించారు.  గం గణపతయే నమః అంటూ సల్లంగా చూడాలంటూ ఆ దేవ దేవుని కొలిచారు.  చిన్నపిల్లలు, మహిళలు, యువతీ యువకులతో మండప ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.