Home Blog Page 137

మత సామరస్యాన్ని చాటిన మైనార్టీ నాయకులు

0

మత సామరస్యాన్ని చాటిన మైనార్టీ నాయకులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సర్కార్ గణేష్ మండలి వద్ద మైనార్టీకి చెందిన షేక్ అబుద్ ఆత్మ డైరెక్టర్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బోథ్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని గణేష్ ఉత్సవాలు కానీ బక్రీద్, మొహర్రం, ఇలా ఏ పండగ అయినా అన్ని మతాల ప్రజలు కలిసి చేసుకుంటామని అన్నారు. గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆ గణేశుని ఆశీర్వాదం తో బోథ్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.

పెద్దాపురంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

0

పెద్దాపురం: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్ రావు

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్ రావు స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు.  ప్రభుత్వం నిత్యవసర సరుకుల పంపిణీ వ్యవస్థకు సంబంధించి పాత రేషన్ కార్డుల స్థానంలో  కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చింది .పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  గ్రామ కమిటీ అధ్యక్షులు రేలంగి బుజ్జి,  వెన్న వెంకటేష్ , కంటి బోయిన చంటిబాబు, కంటి బోయిన ప్రసాద్, బొంగు వీరయ్య, నూకల మంతి నాగేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనోత్సవం

0

భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనోత్సవం

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామం హనుమాన్ ఆలయంలోని గణనాయకున్ని గురువారం అంగరంగ వైభవంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. బ్యాండు, డీజేలు ఏవి ఉపయోగించకుండా భక్తిశ్రద్ధలతో,  భజన సంకీర్తనలతో, వినాయక నిమజ్జనం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బిక్క గంగాధర్, ఉపాధ్యక్షులు రాజు గౌడ్, క్యాషియర్ భూతి తులసీదాస్, గ్రామ కమిటీ మెంబర్లు, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం

0

భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో గణేష్  నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక, సంస్కృతీ సంప్రదాయాలతో సిర్సన్న శివ మార్కండేయ స్వామి గణేష్ మండలం నిర్వహించింది. యువతకు ఆధ్యాత్మిక మార్గాలను ప్రోత్సహించడం,శబ్ద కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా భజనలు, సంకీర్తనల మధ్య నిమజ్జనం నిర్వహించారు. మహిళలు, భక్తులు, గ్రామస్తులు భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపును నిర్వహించారు. ఆనందోత్సాహాల నడుమ వినాయకుణ్ణి  నిమజ్జనం చేశారు. గణపయ్యా.. మళ్ళీ రావయ్యా..అంటూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బేత రాఘవేంద్ర, రూపేష్, తుమ్మల సత్తు రెడ్డి,సతీష్, సాహిల్, గణేష్, సంతోష్, రాకేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

0

వినాయక మండపాల్లో బోరంచు శ్రీకాంత్ రెడ్డి పూజలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ కల్చరల్:  గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ, కేఆర్కే కాలనీ, న్యూ హోసింగ్ బోర్డ్ కాలనీ, దోబీ కాలనీ, రాంనగర్, బట్టిసావర్గాం  గ్రామాల్లో ప్రతిష్టించిన పలు గణేష్ మండపాలను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో, పలు మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండప నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..సర్వ విఘ్నాలను హరించే ఆ లంబోదరుడి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి, సుఖ సంతోషాలతో, పంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వినాయక నిమజ్జనాలు చేసేవేళ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఊరేగింపు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

డెంగ్యూతో ఒకరు మృతి

0

డెంగ్యూతో ఒకరు మృతి

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన చౌలమద్ది రాజేష్ (20)  డెంగ్యూతో మృతిచెందారు. గత వారం రోజుల క్రితం నుంచి జ్వరం రాగా స్థానిక హాస్పిటల్లో చూపించారు. జ్వరము తీవ్రత ఎక్కువగా ఉందని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పడంతో చికిత్స నిమిత్తం బుధవారం సాయంత్రం జ్వరం ఎక్కువ కావడంతో నిర్మల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ  గురువారం ఉదయం 6 గంటల సమయంలో హాస్పిటల్లో  రాజేష్ మృతిచెందారు. ప్లేట్ లెట్స్ కౌంట్ చాలా తగ్గిపోయిందని, డబ్ల్యూబీసీ కౌంట్ కూడ తగ్గడంతో మృతిచెందాడని డాక్టర్లు తెలిపారని, మృతుని తండ్రి చౌలమద్ది నడిపి రాజలింగు తెలిపారు.  రాజేష్ మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

0

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ కాంగ్రెస్ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రిజర్వేషన్ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాయుడి రవి, ఆత్మ డైరెక్టర్ కుంట శంకర్, పాల శంకర్, దరందాస్ మహేందర్, కొప్పుల ఉషన్న, గంగారెడ్డి, బోలశెట్టి రాములు, సాంగు భోజన్న, పాల వెంకటరమణ, గుడ్ల పెద్ద బాపు, కొప్పుల భోజన్న, ప్రవీణ్, వడూర్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులకు ఘనంగా సన్మానం

0

సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులకు ఘనంగా సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను గుర్తించి ఆదిలాబాద్ పట్టణంలోని అగ్రజ టౌన్ షిప్ లో జిల్లా  రెడ్డి సంఘం నెలకొల్పిన గణేష్ మండలికి సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. మండపానికి చేరుకున్న సభ్యులు విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి , ప్రధాన కార్యదర్శి సూర్యకాంత్ , ఉపాధ్యక్షులు  రేణికుంట రవీందర్, నాంపల్లి నర్సింలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి , యువజన సంఘం అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపాలను దర్శించుకున్న బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ 

0

వినాయక మండపాలను దర్శించుకున్న బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ 

చిత్రం న్యూస్, బోథ్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బోథ్ మండల కేంద్రంలోనీ మున్నూరు కాపు సంఘం, శ్రీ చైతన్య గణేష్, ఫ్రెండ్స్ గణేష్ మండపాలను బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మున్నూరుకాపు గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం సభ్యులు, బీఆర్ ఎస్ మండల రైతు సంఘం అధ్యక్షుడు బోడ్డు శ్రీనివాస్, బోథ్ పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, ఆడేపు శ్రీనివాస్, గంగమల్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వానరానికి అంత్యక్రియలు

0

వానరానికి అంత్యక్రియలు

*మానవత్వం చాటుకున్న యువకులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో కుక్క దాడిలో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు  ధర్మమైన ఆలోచనతో కుక్కల దాడిలో మరణించిన ఓ వానారానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఓ మనిషి మరణిస్తే ఎలా అంత్యక్రియలు చేస్తారో అలా వానరానికి కుంకుమ, పూలతో అలకరించి భజన ,బ్యాండ్ భాజాలతో, మంత్రాలతో సాగనంపుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు. మానవత్వం చాటారు. దేగాంలో  మృతి చెందిన కోతికి గోటా ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.