Home Blog Page 136

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

0

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

*సాంగిడి గ్రామంలో సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి చికిత్స

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో శ్రీ మోతీజే  మహారాజ్ ఆలయంలో L V ప్రసాద్ వారి సౌజన్యంతో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రజలందరూ ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా కంటి చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు తమ L V ప్రసాద్ ఆసుపత్రికి రావాలని సూచించారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఎందరో మంది కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారనే ఉద్దేశ్యంతో L V ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కంటి శస్త్ర చికిత్స చేయాలంటే నేడు వేల రూపాయలు ఖర్చు చేసేంత స్తోమత లేని పేదలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.  ఈ శిబిరానికి సహకరించిన L V ప్రసాద్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ప్రణయ్, వెంకట్ రమణ, సాయిలుకు, గ్రామస్తులతో పాటు ఆయన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో అవసరమైన వారికీ కళ్ళ అద్దాలు,  ఉచిత మందులు, ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్స కూడా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సామ నర్సారెడ్డి, దయాకర్ పటేల్, సుధాకర్, మేకల జితేందర్, మంచికంటి సాయి, దేవన్న, జగదీష్ రెడ్డి, రాంరెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు.

వేలం పాటలో  లడ్డూ దక్కించుకున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి

0

వేలం పాటలో  లడ్డూ దక్కించుకున్న విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో  విశ్రాంత బ్యాంక్ మేనేజర్ బడాల విలాస్ రెడ్డి రూ.22,500 కు లడ్డూ దక్కించుకున్నారు. మండలి నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. మండలిలో ఏర్పాటు చేసిన  గణేష్ విగ్రహ  దాత కొంచెం వార్ సుభాష్ ను ఈ సందర్భంగా సన్మానించారు.  వినాయకుడికి వేద మంత్రాలతో ఉత్తర పూజను పూజారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కైలాష్ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు లోక ప్రవీణ్ రెడ్డి, రాపల్లి పవన్ కుమార్, శ్రీపద్ మాసాడే,  దెబ్బడి ఉల్లాస్, బడాల విలాస్ రెడ్డి, ప్రవీణ్ అగర్వాల్, జవాజి కృష్ణ, సదేశ్, కొంచెం వార్ సుభాష్, శోభలతా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు డీజేలు సీజ్ – ఇచ్చోడ సీఐ బండారి రాజు

0

నాలుగు డీజేలు సీజ్ – ఇచ్చోడ సీఐ బండారి రాజు

*నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలోని ఘటన.

*డీజే యజమానులు, ఆపరేటర్లపై కేసులు నమోదు

*సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలి

చిత్రం న్యూస్, నేరడిగొండ: సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ  సీఐ బండారి రాజు తెలిపారు. శుక్రవారం  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలను అతిక్రమించి ఏర్పాటు చేసిన నాలుగు డీజేలను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్ల పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజేలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని సూచించారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని, అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి గణనాథుని నిమజ్జనం 

0

ఘనంగా ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి గణనాథుని నిమజ్జనం 

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో శుక్రవారం ఘనంగా ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి గణనాథుని నిమజ్జనం నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో  ఆనందోత్సవంలో మునిగితేలారు. గత 20 సంవత్సరాలుగా   ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. డీజే, డప్పు చప్పుళ్ళ నడుమ గణపతికి జేజేలు పలుకుతూ విఘ్నేశ్వరుని సాగనంపారు. గణపయ్య మళ్ళీ రావయ్యా అంటూ నిమజ్జనం చేశారు.

సొనాల పశు వైద్యశాలని పట్టించుకోరా..

0

సొనాల పశు వైద్యశాలని పట్టించుకోరా..

*పశు వైద్యశాల ఉన్న ప్రైవేటే గతి

*మందుల కొరతతో గోస పడుతున్న రైతులు 

*శిథిలావస్థలో ఆసుపత్రి భవనం

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని  పశు  వైద్యశాల అలంకార ప్రాయంగా మిగిలింది. డాక్టర్ తో పాటు సిబ్బంది కొరత, మందుల కొరత ఉండటంతో పాడి రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. పశువులకు వింత వ్యాధి (లంఫీ స్కిన్ వ్యాధి ) సోకుతుంది. మూగజీవులకు ఏదైనా జరగరానిది జరిగితే పాడి రైతు కంట కన్నీరే తప్ప చేసేదేం లేకుండా పోతుంది. భవనం కూడా పూర్తిగా శిధిలావస్థలో ఉంది.

అత్యవసర సమయంలో ప్రైవేట్ వైద్యులను సంప్రదించి పశువుల ప్రాణాలను కాపాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు దాదాపు అందరూ జంతు ప్రేమికులే కానీ ఏ రోజు పశువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. నెల క్రితం ఇద్దరు రాజకీయ నాయకులు పశువుల ఆసుపత్రి పై శ్రద్ధ వహించి ఉన్నత  అధికారులతో మాట్లాడితే రెండు, మూడు రోజులు డాక్టర్ ను పశువైద్యశాలకు పంపించారు. మళ్లీ ఇప్పుడు పాత పరిస్థితే కొనసాగుతుంది. పశు వైద్య శాలలో ఉన్న ఒక్కరే అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి డాక్టర్ తో పాటు సిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలని సొనాల గ్రామ రైతులు కోరుతున్నారు.

ఆదిలాబాద్ లో ఘనంగా ఓనమ్ పండగ 

0

ఆదిలాబాద్ లో ఘనంగా ఓనమ్ పండగ 

చిత్రం న్యూస్, అదిలాబాద్:  ఆదిలాబాద్ మండలంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఓనమ్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా వారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన హిందూ ధర్మం గొప్పదనం గురించి ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. భారత దేశంలోనే గుళ్ళు గోపరాలు నిర్మించి, యాగాలు జరిగేవని, ప్రస్తుతం సౌదీ అరేబియా లాంటి వివిధ దేశాలలో సైతం పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించి యాగాలు చేపట్టడం మన హిందూ ధర్మం చాటి చెప్పిన గొప్ప శాంతి మంత్రం అన్నారు. ఇతర దేశాలు సైతం మన అడుగు జాడల్లో నడుస్తున్నారంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పయో అర్థం చేసుకోవచ్చన్నారు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవడం మన దేశ గొప్పదనం అని పేర్కొన్నారు.

రెడ్డి బాలల గణేష్ మండలిలో మంగళ హారతులతో  మహిళల ప్రత్యేక పూజలు

0

రెడ్డి బాలల గణేష్ మండలిలో మంగళ హారతులతో  మహిళల ప్రత్యేక పూజలు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా  ఇచ్చోడ మండల కేంద్రంలోని  రెడ్డి బాలల గణేష్ మండలి వద్ద శుక్రవారం పదో రోజు విశేషంగా పూజలందుకున్నాడు. మహిళలు ఓకే రంగు దుస్తులు ధరించి మంగళ హారతులతో గణనాథునికి  ప్రత్యేక పూజలు చేపట్టారు. కాలనీవాసులు అందరూ కలిసి గణనాథునికి  పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులు ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. కుంకుమ పూజ నిర్వహించారు. సకల శుభాలు కలగాలని మహిళలందరూ మంగళ హారతులతో  ప్రత్యేక పూజలు చేస్తూ, పాటలు పాడుతూ ఆ దేవ దేవుణ్ణి వేడుకున్నారు.

నేరడిగొండ ఎస్సైకి ఘన సన్మానం

0

నేరడిగొండ ఎస్సైకి ఘన సన్మానం 

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామ యాదవ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎస్సై ఇమ్రాన్ ఖాన్ కు ఘనంగా సన్మానం చేశారు. యాదవ సంఘ యువకులు, పెద్దలు, కుమారి గ్రామంలో గల హనుమాన్ గణేష్ నిమజ్జనానికి డ్యూటీ పై వచ్చిన ఆయన్ను సంఘ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించారు.  ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ కి యూత్ సభ్యులు ,పెద్దలు, కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ..శాంతియుత వాతావరణంలో గణపతిని నిమజ్జనం చేసుకోవాలని డీజీలు సౌండ్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా భజనలతో జరుపుకోవాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో యాదవ సంఘం సభ్యులు వొర్స భూమన్న. వొర్స చంద్రశేఖర్. బుస రమణ, బండారి శ్రీనివాస్, ఎట్టం రమణ, పుర్రె లక్ష్మణ్, వొర్స రవి, మాజీ ఉప సర్పంచ్ గడ్డం నరేష్ రెడ్డి, యూత్ సభ్యులు అగ్గు శ్రీనివాస్,  వొర్స వివేక్, పుర్రె నితిన్, తదితరులు పాల్గొన్నారు.

బై  బై….గణేశా 

0

భైంసాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు

*వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన  ఎమ్మెల్యే, కలెక్టర్

*బందోబస్తును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర కొనసాగుతుంది. తొమ్మిది రోజులపాటు వివిధ గణేష్ మండలీల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి ఉదయం, సాయంత్రం సమయాల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్,  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఉత్సవ సమితి సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జోత్సవ శోభాయాత్ర వెళ్లే మార్గంలో నాలుగు డ్రోన్లు, 120 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 600 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రను పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అల్పాహారం పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనోత్సవం పురస్కరించుకొని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. యువకులు, చిన్నారులు శోభాయాత్రలో చేస్తున్న నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణపతి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం పూర్తవడంతో అనేక ప్రాంతాలలో భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. జై గణేష్ మహారాజ్ అంటూ నినాదాలతో, డీజే పాటలతో, వాహనాలలో విగ్రహాలను ఊరేగిస్తూ, భక్తిశ్రద్ధలతో  గణపయ్య ..మళ్ళీ రావయ్యా అని కోరుకుంటూ నిమజ్జనం చేశారు.

లోకమాన్య గణేష్ మండలి వద్ద వినాయకునికి 25 రకాల నైవేద్యం

0

లోకమాన్య గణేష్ మండలి వద్ద వినాయకునికి 25 రకాల నైవేద్యం

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండలంలోని లోకమాన్య గణేష్ మండలి వద్ద కాలనీవాసులు అందరూ కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి 25 రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులు అందరూ కలిసి ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. మరియు గోరింటాకు పెట్టుకున్నారు. బోథ్ మండలంలోని పోచమ్మ కాలనీలో గణపతి వద్ద కుంకుమ పూజ చేశారు. మహిళలందరూ కలిసి గాజులు వేసుకున్నారు. పూజా కార్యక్రమాలతో  మండలి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.