Home Blog Page 126

బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరామర్శ

0

బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరామర్శ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన బొడ్డు నవీన్ (మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి)  మామ  సంటి నర్సింలు ప్రమాదానికి గురైన విషయాన్ని నవీన్ ద్వారా తెలుసుకున్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన రిమ్స్ డైరెక్టర్, వైద్యాధికారులతో మాట్లాడి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.  శ్రీకాంత్ రెడ్డి వెంట మావల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్

0

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్

*గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్ మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు కిసాన్ మోర్చా మండల కార్యదర్శి ఉయిక గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గస్కంటి సంజీవ్, బీజేపీ నాయకులు చెట్పల్లి సంతోష్, రవి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా  మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం చెట్పల్లి వెంకటేష్ మాట్లాడుతూ..రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని అనిల్ జాదవ్ నాయకత్వంలొనే బోథ్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ విజయడంఖా మోగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త కంకణం కట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, దేవేందర్ రెడ్డి, నాయకులు సాబ్లే సంతోష్ రాథోడ్ రాజశేఖర్, రాథోడ్ సురేందర్, గులాబ్, లక్ష్మణ్, గణేష్ నాయక్, మాజీ సర్పంచ్ మురళి, గోపి, వెంకటరమణ, చవాన్ రాంకుమార్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రిని కలిసిన సామ రూపేష్ రెడ్డి

0

తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక,పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదారాబాద్ లోని అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉన్నా సిబ్బంది లేక ఎందరో మంది క్రీడాకారులు ప్రతిభ ఉన్న ముందుకు వెళ్ళలేకపోతున్నారని ఆయనకు తెలిపారు. ఆదివాసీల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆటల పోటీల్లో ముందుండే యువకులు ఉన్నా కోచ్ లు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆయనకు తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ ని నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు ఉందని,  ఇంటర్మీడియట్ వరకు పెంచాలని ఆయన్ను కోరారు. అదేవిధంగా క్రికెట్ ఆడడానికి స్టేడియం కూడా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

0

రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా మండలంలోని గిర్నూర్ గ్రామములో రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. బతుకమ్మ సంబరాలు అనగానే గుర్తుకు వచ్చేది గౌరమ్మ పూజ. అలాంటి గౌరమ్మకి పూజా చేసి విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సామల స్వర్ణలత మాట్లాడుతూ..బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ పండగకి ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి  పుట్టింటికి చేరుకొని పువ్వుల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న నీటి కుంటలలో నిమజ్జనం చేస్తారని విద్యార్థులకి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఆధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రైవేట్ బస్సు బోల్తా

0

ప్రైవేట్ బస్సు బోల్తా

*బెంగుళూరు నుండి నేపాల్ కు పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం సాకేరా గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. బెంగుళూరు నుండి నేపాల్ కు పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. పక్కనే ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారి కాకుండా చిన్న రహదారిగుండా ట్రావెల్స్ బస్సు ప్రయాణించడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. RTO తనిఖీ కేంద్రాలు, స్టేట్ పర్మిట్ లు తప్పించేందుకు ట్రావెల్స్ సంస్థలు చిన్న దారులను ఎంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కీర్గుల్ (కే) లో తొలిసారిగా దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన  

0

కీర్గుల్ (కే) లో తొలిసారిగా దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన  

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసర మండలంలో కీర్గుల్ (కే) గ్రామంలో తొలిసారిగా వీడిసి ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అమ్మవారికి అంగరంగ వైభవంగా సోమవారం రోజు శ్రీ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, కట్టె పొంగలి సమర్పించారు. అనంతరం తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. భక్తులు దుర్గా మాతమాల ధారణ గావించారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కుమారిలో కొలువు తీరిన దుర్గమ్మ

0

కుమారిలో కొలువు తీరిన దుర్గమ్మ

*విగ్రహ దాత వోర్స రాజు యాదవ్_ప్రవళిక దంపతులకు గ్రామస్తుల సన్మానం

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో ఆడపడుచులు, పెద్దలు, చిన్న తేడా లేకుండా భాజా భజంత్రీలతో డప్పుల చప్పుళ్లతో మంగళహారతులతో దుర్గామాతకు స్వాగతం పలికారు. ఊరిలోని ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఊరేగింపులో పాల్గొని నియమనిష్టలతో దుర్గాదేవిని ప్రతిష్టాపన చేశారు. విగ్రహ దాత వొర్స రాజు యాదవ్, ప్రవళిక దంపతులను గ్రామస్తులు శాలువాతో సన్మానం చేశారు.  గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు  

0

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, విద్యార్థిని, విద్యార్థులకు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగులందరి సమక్షంలో RGUKT, బాసర కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సోమవారం ఘనంగా  నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో ఉపకులపతి ఆచార్య ఎ.గోవర్థన్, కల్చరల్ కమిటీ కన్వీనర్ డా.కె.రాములు, అసోషియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్, అసోషియేట్ డీన్ ఆఫ్ సైన్స్ & హుమానిటీస్, ఆల్ HoD లు, కల్చరల్ కమిటీ డ్యాన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ సిరసాని పవన్ కుమార్, కల్చరల్ కమిటీ సభ్యులు, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొన్నారు.  ఉపకులపతి ఆచార్య ఎ.గోవర్థన్ మాట్లాడుతూ.. బతుకమ్మను మనం ఏవిధంగా అందంగా పేర్చుతామో విద్యార్థులు తమ జీవితాలను కూడా అంత అందంగా నిర్మించుకోవాలని చెబుతూ.. తెలంగాణ సంప్రదాయాలలో శిఖరప్రాయమైనది బతుకమ్మ పండుగ అని సందేశమిచ్చారు. బతుకమ్మ తయారు చేసిన అధ్యాపకులకు, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కల్చరల్ డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బతుకమ్మ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మా గోస ఎవరూ పట్టించుకోరా?

0

మా గోస ఎవరూ పట్టించుకోరా?

*15 రోజుల నుంచి బాసరకు రాకపోకలు బంద్  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాలు ఓని, కీర్గుల్ (కె), కౌఠ, సాలాపూర్ గ్రామస్థుల గోస అంతా ఇంతా కాదు. ఈ గ్రామాల ప్రజలకు బాసరకు రాకపోకలు పదిహేను రోజుల నుండి నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఓని నుంచి బాసర వెళ్లే రహదారి మధ్యలో వంతెన ఉండటంతో వంతెన పైనుండి వరద ఉధృతంగా ప్రవహించడంతో పదిహేను రోజుల నుండి ఆయా గ్రామ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం,  ఎస్బీఐ బ్యాంకు, రైల్వే స్టేషన్, ఆర్జేయూకేటీ, రెవెన్యూ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కు రావాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి లో లెవల్ వంతెన ఉందని అధికారులకు చెప్పిన ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు

విజ్ఞాన్ స్కూల్ లో  ఘనంగా విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు

0

విజ్ఞాన్ స్కూల్ లో  ఘనంగా విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు

*ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ స్కూల్ ఫర్ డిస్సబ్లెడ్ చైల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో  దేవీ నవరాత్రుల సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి  హాజరయ్యారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఆదిలాబాద్ అర్బన్ ఛైర్మన్ గోపిడి సవీన్ రెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, హేమంత్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.