Home Blog Page 122

అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర 

0

అంగరంగ వైభవంగా దుర్గమ్మ శోభా యాత్ర 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కీర్గుల్ (కె) గ్రామంలో అంగరంగ వైభవంగా దుర్గమాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమాత అమ్మవారు తొమ్మిది రోజులు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తీరొక్క పూలతో వివిధ రకాల నైవేద్యం అమ్మవారికి సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం రోజున విశేషంగా ఆకట్టుకుంది.   అమ్మవారి శోభాయాత్రలో మహిళలు,  ఆడపడుచులు బతుకమ్మ కోలాటాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి డీజే నడుమ శోభాయాత్రను ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు చల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  వీడీసీ  పెద్దలు, సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు దుర్గమ్మ వెళ్ళి రావమ్మా అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు.

 

సోలార్  ఫెన్సింగ్ కు కాలు తగిలి ఒకరి మృతి

0

సోలార్  ఫెన్సింగ్ కు కాలు తగిలి ఒకరి మృతి

_దసరా పండగ రోజు విషాదం

చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి నారాయణరెడ్డి గురువారం పంటకు అమర్చిన సోలార్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరెడ్డి రెండు సంవత్సరాల నుండి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే వ్యవసాయ భూమిలో కోతుల బెడద నుంచి పంటను రక్షించడానికి సోలార్ ఫెన్సింగ్‌ను చేను చుట్టూ అమర్చాడు. గురువారం ఉదయం కోతులు చేనులోకి వచ్చాయన్న సమాచారం రావడంతో చేనులోకి వెళ్లి కోతులను తరిమే క్రమంలో పంటకు అమర్చబడి ఉన్న సోలార్ వైర్‌ను చూసుకోకపోవడంతో వైర్లకు కాలు తట్టుకొని సోలార్ షాక్ తగిలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సొనాలలో విజయదశమి వేడుకలు 

0

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సొనాలలో విజయదశమి వేడుకలు 

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాలలో  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సొనాలలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కే.గణేష్, వక్తగా జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజాన్ని సంఘటితం చేస్తూ దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని, దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన ఆర్ఎస్ఎస్ ముందుండి తన సహాయక చర్యలు నిర్వహిస్తుందని, పంచ పరివర్తన సూత్రాలను పాటించాలన్నారు. స్వదేశీ స్వావలంబన దిశగా మనందరం అడుగులు వేయాలని, అందరూ సంఘటితoగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కండ కార్యవహా కోస్మెట్ శుద్ధోధన్, జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ ఉత్తర్వార్ నాగేందర్, స్వయం సేవకులు, గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పిల్లలు, యువకులు, పాల్గొన్నారు.


బాసర నుంచి మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టండి

0

బాసర నుంచి మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టండి

*ఎమ్మెల్యేకు లేఖ రాసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర నుంచి మహోర్ హిమాయత్ నగర్ వరకు రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు లేఖ ద్వారా వివరించారు. గత మే నెల 5 న ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. జాతీయ రహదారిని అనుసంధానం చేస్తే బాసర అమ్మ వారి క్షేత్రం నుండి మహోర్ రేణుక మాత టెంపుల్ కు ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని విన్నవించారు.  స్పందించినందుకు ఎమ్మెల్యే రామారావు పటేల్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

0

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ 

చిత్రం న్యూస్, జైనథ్:  త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం  జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల Stage -2 రిటర్నింగ్ అధికారులు,  stage-1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జైనథ్ మండల కేంద్రములోని రైతు వేదికలో సోమవారం శిక్షణ తరగతులు చేపట్టారు.  ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, గుర్తుల కేటాయింపు,  ఎన్నికల నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఉపసర్పంచ్ ఎన్నికల నిర్వహణ అనే అంశాలపై రిసోర్స్ పర్సన్లు పసుల ప్రతాప్, శ్రీహరి బాబు, జైనథ్ MPDO మహేష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బేల Mpdo శ్రీనివాస్, భోరజ్  MPDO వేణు, సాత్నాల MPDO రాజు, నాలుగు మండలాల ఉద్యోగులు పాల్గొన్నారు.

గ్రూప్-1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికైన కరెండే మహేందర్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే

0

గ్రూప్-1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికైన కరెండే మహేందర్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన SI కరెండే మహేందర్  ఇటీవల విడుదల అయిన గ్రూప్ – 1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. సోమవారం భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  బోస్లే నారాయణరావు పాటిల్  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముత్యం రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓం ప్రకాష్ లడ్డ, బాసర మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగం రమేష్, మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి, యువ నాయకుడు పురంశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు 51 రకాల నైవేద్యాలు

0

దుర్గమ్మకు 51 రకాల నైవేద్యాలు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో గల దుర్గమ్మకు పోతాగంటి బాపు ఆధ్వర్యంలో 51 రకాల నైవేద్యాలను సోమవారం సమర్పించారు. నిత్యం నియమనిష్టలతో పూజలు చేస్తూ గ్రామస్తులు హారతి, సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  పాడిపంటలు, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని  భక్తి ప్రవత్తులతో  అమ్మవారిని  కొలుస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

కోట కలిదిండిలో అమ్మవారిని దర్శించుకున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

0

కోట కలిదిండిలో అమ్మవారిని దర్శించుకున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

చిత్రం న్యూస్, కైకలూరు: శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కలిదిండి మండలం కోట కలిదిండి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. కోరుకొల్లు DC చైర్మన్ పేటేటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన 7వ రోజు సరస్వతి దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నానన్నారు. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు

0

కనకదుర్గమ్మను దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు

చిత్రం న్యూస్, విజయవాడ: మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ స్లాట్ సమయంలో సతీ సమేతంగా వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు.  శాలువా కప్పి సన్మానం చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం

0

శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం

*మూల నక్షత్రం సందర్భంగా బాసరలో భక్తుల సందడి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.  శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి మూల నక్షత్రం శుభదినం సోమవారం  కావడంతో అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపిస్తుంది. శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజు శ్రీ మహా గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వైదిక బృందం అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. ఆలయానికి భక్తులు వేకువజాము నుంచి గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. క్యూలో నిలబడ్డ వారికీ ఆలయ అధికారులు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మంచి నీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవి,  ముథోల్ సీఐ మలేష్, ఎస్సై బి.శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.