రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
చిత్రం న్యూస్, బోథ్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెడ్డి మహిళ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేపట్టారు. ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడారు. పార్వతి దేవిని ఆరాధించడానికి, ఆమె ఆశీర్వాదాలు పొందడానికి ఈ పండుగ జరుపుకుంటామని మహిళలు పేర్కొన్నారు. ఈ పండగలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మ (పువ్వుల గుట్ట)ను అలంకరించి, దాని చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అనంతరం భక్తితో బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. బతుకమ్మా.. మళ్ళీ రావమ్మా అంటూ వేడుకున్నారు.
రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
నిరుపేదలకు అన్నదానం చేసిన ఆంజనేయులు
నిరుపేదలకు అన్నదానం చేసిన ఆంజనేయులు
చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ఓ కార్యక్రమంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించిన ఫుడ్ బ్యాంక్ భైంసా వ్యవస్థాపకులు ఆంజనేయులు ఆ ఆహార పదార్థాలను లోకేశ్వరం మండలంలోని లక్ష్మీ నగర్ గ్రామంలోని దాదాపు 130 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా నిరుపేదలకు చేసే అన్నదాన కార్యక్రమాన్ని ఆపేది లేదని అదేవిధంగా ఎక్కడైనా ఫంక్షన్లలో ఆహార పదార్థాలు మిగిలిపోతే పారవేయకుండా 9912267973 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు.
బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ
బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ప ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ శనివారం పరామర్శించారు. వడూరు గ్రామంలోని ఉప్పు పోశెట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తేజపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించారు.తేజపూర్ గ్రామంలోని రెండు రోజుల క్రితం సోలార్ ఫెన్సింగ్ కారణంగా మరణించిన ఏలేటి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు. ఎంపీ వెంట సీనియర్ నాయకులు గాదె శంకర్, మండల ఉపాధ్యక్షులు సురేష్, సీనియర్ నాయకులు కొప్పుల గంగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ ధ్రువరాజు, మాజీ రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బోథ్ మండల ఆధ్యక్షులు బోరే రవీందర్, సీనియర్ నాయకులు చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత
విగ్రహ ప్రతిష్ఠాపనకు సతీష్ పవార్ నగదు అందజేత
భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపనకు, మహా అన్నదాన కార్యక్రమానికి రూ.10,100. నగదు అందజేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో శాతవాహనుల కాలంలో నిర్మించిన భైరందేవ్ ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 12న నిర్వహించే కార్యక్రమానికి తన వంతు సహాయంగా అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్ రూ.5,100 నగదును, మహా అన్నదాన కార్యక్రమానికి మరో రూ.5 వేలు శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సతీష్ పవార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయంగా నగదు అందజేసిన సతీష్ పవార్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొరంగే శ్యాంరావు, ఉప అధ్యక్షులు మెస్రం వాసుదేవ్, జనరల్ సెక్రటరీ సిడం ఖుశాల్, భీంరావుకొడప, సంజయ్ నిపుంగే, మరాఠా తిరిలే కున్భీ సమాజ్ అధ్యక్షులు విఠల్ రౌత్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
బాసర గోదారమ్మ ఒడికి దుర్గామాతలు
బాసర గోదారమ్మ ఒడికి దుర్గామాతలు
*తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అమ్మవారికి వీడ్కోలు పలుకుతున్న భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం గల గోదారమ్మ ఒడికి దుర్గామాతలు చేరాయి. వివిధ అలంకారాల్లో కొలువుదీరిన అమ్మవారు తొమ్మిది రోజులు విశేషంగా పూజలు అందుకన్నారు. భక్తులు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. గోదావరి వంతెనపై వివిధ ప్రాంతాల నుండి నిజామాబాదు, కరీంనగర్, కామారెడ్డి, బైంసా ఇతర ప్రాంతాల నుంచి గోదావరి నదికి భారీగా నిమజ్జనం కోసం దుర్గాదేవి విగ్రహాలు తరలివచ్చాయి. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఘాట్లు బురదమయంగా మారడంతో భక్తులు చాలా ఇబ్బందిపడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర
చిత్రం న్యూస్: కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోట వాస్తవ్యులు మద్దాల సుబ్బలక్ష్మి- శ్రీనివాసరావుల ద్వితీయ కుమార్తె వివాహానికి కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర హాజరయ్యారు.నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. వీడీసీ చైర్మన్ బిక్క గంగాధర్ మాట్లాడుతూ..గాంధీ ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా ఆయనకు చాలా చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. గాంధీజీ భారత దేశ స్వతంత్ర పోరాటంలో గొప్ప నాయకుడు అని అహింసా సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఉప్పు సత్యగ్రహం దీక్ష చేశారన్నారు. అహింస పరమో ధర్మ అని ఆయన పుట్టిన రోజున ఏ జీవిని హింసించకుండా మద్యం, మాంసం దుకాణాలు అందుకే బంద్ నిర్వహించాలని ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ బిక్క గంగాధర్, వైస్ చైర్మన్ జడల భోజన్న, క్యాషియర్ బూతి తులసీదాస్, రైటర్ దూర్కి రాజు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్, మాజీ సర్పంచ్ రాజు యాదవ్, వీడీసీ సభ్యులు విఎన్ రాజేశ్వర్, డి.బ్రహ్మం గౌడ్, ఎరేకర్ రాజేశ్వర్, మండల్ నవీన్, కొత్తపెల్లి భూమన్న, జి.రాకేష్, గజ్జల గంగయ్య, తెడ్డోజీ శంకర్, సి.నీలేష్, బండారి శ్రీనివాస్, మండల ప్రవీణ్, భీమ లింగు, వొర్స రవీందర్, రామేల్లి చిన్నయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దమ్మ చక్ర పరివర్తన్ దివస్
ఘనంగా దమ్మ చక్ర పరివర్తన్ దివస్
చిత్రం న్యూస్, బాసర:బినిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో సిద్ధార్థ యువజన సంఘం ఆధ్వర్యంలో దమ్మ చక్ర పరివర్తన్ దివస్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచశీల్ సామూహికంగా పాడుతూ..పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్ధార్థ యువజన సంఘం అధ్యక్షుడు గైని బాబు, సొంటకే సందీప్, సంఘం యువకులు జాజోళ్ల ప్రకాష్, నవీన్, పోతన్న, శ్రీనివాష్, అశోక్, గైని రోయిదాష్. గైని గంగన్న. లంబాడి గౌతమ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు
పేదింటి బిడ్డకు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసామండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన కంమ్లె శైలజ నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తండ్రి పరుశురాం మోటార్ మెకానిక్ చేస్తూ తల్లి అనిత బీడీ కార్మికురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కంమ్లె శరత్ ఇంటర్ చదువుతున్నాడు. కూతురు కంమ్లె శైలజ పట్టుదలతో చదివి నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సిటు సాధించడంతో ఆమెకు యువకులు, కంమ్లె సాయినాథ్, సిహెచ్ ఎల్లన్న, కారోబారి భూమన్న, ఎమ్మార్పీఎస్ కుంటాల మండల అధ్యక్షుడు కత్తి బాబు, కదం మారతి, దగ్డే దీపక్, కదం ఆనంద్, శాలువాతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకొని గ్రామస్తులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.
కారు బోల్తా.పలువురికి గాయాలు
కారు బోల్తా.పలువురికి గాయాలు
చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కారు డివైడర్ కు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని గమనించి తక్షణమే అంబులెన్స్ కి సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.










