Home Blog Page 12

కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

0

చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ప్రచార రథాలను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంమన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆసిఫాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు ప్రతి వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం_లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎల్మెలవార్ అర్చనరాంకుమార్ నుభారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి కోరారు. 38వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎల్మెలవార్ అర్చన రాంకుమార్ ను గెలిపించాలంటూ ఆ వార్డులో లోక ప్రవీణ్ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల్లో అర్చన రాంకుమార్ ను గెలిపించాలని ప్రజలను ఓటు అభ్యర్తించారు. కాలనీ అభివృద్ధి జరగాలంటే చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కాలనీ ప్రజలను కలుస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను మద్దతు కోరారు. పార్టీ  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

42 వార్డు కౌన్సిలర్ గా స్వాతి మంగేష్ ను గెలిపించండి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 42వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్తి స్వాతి మంగేష్ ను  భారీ మెజార్టీ తో గెలిపించాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఓటర్ల ను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 42 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వాతి మంగేష్ కు మద్ధతుగా బుధవారం గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.

సిర్సన్న సింగపూర్ హనుమాన్ మందిరంలో చోరీ

0

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న సింగపూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ మందిరంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తుతెలియని దుండగులు మందిరం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు. బుధవారం ఉదయం మందిరానికి వచ్చిన భక్తులు, మందిర పూజారి తలుపులు తెరిచి ఉండటం, హుండీ పగిలిపోయి ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే గ్రామస్తులు, పూజారి పోలీసులకు సమాచారం అందించారు.

నాసిరకం పనులు..నాణ్యతలో నిర్లక్ష్యం

0

*కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామన్న ఉప సర్పంచ్ సాగర్

చిత్రం న్యూస్ బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో ఐటీడిఏ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం కోసం  ప్రభుత్వం రూ. 2.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆదిలాబాద్ కు చెందిన ఓ కాంట్రాక్టర్  టెండర్ పనులను దక్కించుకొని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు పునాది, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో  పిల్లర్ల పెచ్చులు ఊడిపోతున్నాయి.  గ్రామ సర్పంచ్ దౌలత్ మేస్రం, ఉప సర్పంచ్ సాగర్ స్థానికులతో కలిసి సంబంధిత పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ మాట్లాడుతూ. గిరిజన బాలుర వసతి గృహం కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. పనులను పర్యవేక్షించే ఐటీడీఏ అధికార యంత్రాంగం నిఘా సైతం పూర్తిగా కొరవడడంతో కాంట్రాక్టర్ తనకు నచ్చినట్లు పనులు నిర్వహిస్తున్నాడు అని ఆందోళన వ్యక్తం చేశారు.బిల్డింగ్ సంబందించిన నాసిరకం పనులు గురించి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికి ఇప్పటివరకు సంబంధిత అధికార యంత్రాంగం స్పందించడం లేదన్నారు. నిర్మాణ పనులు నాసిరకం ఉంటే తరువాత ఏదైనా జరిగితే దీనికి బాధ్యులు  ఎవరని విచారం వ్యక్తం చేశారు. ఈ పనుల గురించి జిల్లా కలెక్టర్ కు సర్పంచ్ తో కలిసి పిర్యాదు చేస్తామన్నారు.

 

 

శబరిమాత ఆలయ రెండో వార్షికోత్సవం

0

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామంలో శబరిమాత ఆలయ 2వ వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఉదయం అరు గంటలకు గీతా పారాయణం, హారతి, మంత్రపుష్పం, యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భజన బృందాల సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు. పల్లకీ ఊరేగింపు పురవీధుల గుండా చేపట్టగా భజన బృందం  సభ్యులుభక్తి పాటలతో నృత్యాలతో శబరిమాత వార్షికోత్సవాన్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంన్నారు.  ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

బేలలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, బేల: విశ్వ సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను శనివారం బేల మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేదని వక్తలు పేర్కొన్నారు. కులస్తులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.. కార్యక్రమంలో బేల ఎస్ఐ ప్రవీణ్, బేల సర్పంచ్ భాగ్యలక్మి, సర్పంచుల సంఘం  మండల అధ్యక్షులు అశోక్ టాక్రె, మాజీ సర్పంచులు మస్కె తేజ రావు, దేవన్న, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విలాస్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండవార్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, నాయకుడు సుధాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి, భారాసా మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, భాజపా నాయకులు దత్తానికం, నవీన్, సందీప్, రాము బర్కాడే,  కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.సంతోష్, మండల అధ్యక్షుడు అభయ్, వెంకటి, వివిధ గ్రామాల సర్పంచులు, కులస్తులుత దితరులు పాల్గొన్నారు.

 

 

మున్సిపల్ కౌన్సిలర్ కు నామినేషన్ దాఖలు చేసిన అబ్రర్ అలీ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అన్సారీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్సార్ సోదరుడు అబ్రర్ అలీ శుక్రవారం  నామినేషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున 34 వార్డ్ శాంతినగర్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యూర్ డెయిరీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  అన్సారీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆన్సర్ తన చేతుల మీదుగా నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్యూర్ డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో” పుడమి తల్లి”గా వృక్షానికి పట్టాభిషేకం

0

చిత్రం న్యూస్,ఇచ్చోడ: గ్రామ పొలిమేరల నుండి పట్టణ వీధుల వరకు పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా “కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్” మరియు “కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్” సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఏపుగా పెరిగిన ఒక మహా వృక్షాన్ని “పుడమి తల్లి”గా నామకరణం చేస్తూ, దానిని తమ ‘తల్లి వృక్షం’గా భావించి సంరక్షిస్తామని విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమించడం, వృక్షాలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. పల్లె నుండి పట్టణం దాకా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి విద్యార్థి ఒక హరిత సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ కోఆర్డినేటర్ వి.మధు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సరస్వతి విద్యార్థులకు జీవవైవిధ్యం (Biodiversity) యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతరించిపోతున్న వృక్ష సంపదను కాపాడుకోవడం ద్వారానే రేపటి తరానికి సురక్షితమైన వాతావరణాన్ని అందించగలమని వారు స్పష్టం చేశారు. వృక్షానికి హారతి ఇచ్చి, పర్యావరణ ప్రతిజ్ఞ చేయడంతో కళాశాల ప్రాంగణమంతా నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతామని ప్రతినబూనారు.

గుబిడిలో భజన పోటీల కరపత్రాల విడుదల

0

చిత్రం న్యూస్, భీంపూర్:భీంపూర్ మండలం గుబిడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం, శబరిమాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న భజన పోటీల కరపత్రాలను గ్రామ పెద్దలు విడుదల చేశారు. ఈ పోటీలను ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 06:25 నుండి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పోటీ వివరాలు: ప్రథమ బహుమతి: రూ.15,111 (కీ॥శే॥ శ్రీ బొలిపెల్లి సంతోష్ యాదవ్ గారి స్మారకార్థం), ద్వితీయ బహుమతి: రూ.11 వేలు (కీ॥శే॥ శ్రీమతి అన్నం మల్లుబాయి రాములు గారి స్మారకార్థం), తృతీయ బహుమతి: రూ.7 వేలు ( మేకల ప్రవీణ్ యాదవ్, గుబిడి గ్రామ సర్పంచ్), నాల్గవ బహుమతి: రూ. 5 వేలు (కీ॥శే॥ తూడి చిన్నయ్య స్మారకార్థం), అయిదో బహుమతి: రూ. 3 వేలు ( గేడం పురుషోత్తం), ఉత్తమ గాయకుడు, ఉత్తమ హార్మోనియం కళాకారుడు, ఉత్తమ తబలా కళాకారుడు: రూ. వేయి చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

నియమ నిబంధనలు: ప్రతి భజన మండలిలో ఏడుగురు (7) సభ్యులు ఉండాలి. భజన పాటలు చూసి పాడకూడదు, ప్రతి పాటకు అంకితం రావాలి. ప్రదర్శించే భజన బృందమునకు 30 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. బృందంలో పాడే ప్రతి పాట యొక్క కాపీని న్యాయ నిర్ణేతలకు ప్రదర్శనకు ముందుగా ఇవ్వాలి. భజన సామాగ్రి (హార్మోనియం, తబలా, తాళాలు) ఎవరికి వారే వెంట తెచ్చుకోవాli తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలదేనని, భజన కళాకారులకు భోజన సౌకర్యం కలదని నిర్వాహకులు తెలిపారు.

సంప్రదించవలసిన నెంబర్లు: తూడి రాకేష్ యాదవ్: 9989541931, అంగ గణేష్ యాదవ్: 9110323148