Home Blog Page 117

వికసిత్ కృషి సంకల్ప అభియాన్ వ్యవసాయ ,ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం

వికసిత్ కృషి సంకల్ప అభియాన్
వ్యవసాయ ,ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం

చిత్రం న్యూస్, ఓదెల:

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తలు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వానాకాలంలో వేసుకోవలసిన వ్యవసాయ ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమము జూన్ 12వ తారీకు వరకు వివిధ మండలాల్లోని గ్రామాల్లో జరుగుతున్నందున రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని రానున్న వానాకాలంలో వేస్తున్న పంటలపై అవగాహన పెంచుకోవాలని శాస్త్రవేత్తలను అడిగి వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్. బి. భాస్కరరావు మాట్లాడుతూ.. రైతు సోదరులు ప్రతి సంవత్సరం ఏక పంటగా వరి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. ఒకే పంటను సాగు చేయడం వలన చీడపీడల వలన గాని, వాతావరణంలోని మార్పుల వలన గాని, మార్కెట్లో సరైన ధర లభించకపోవడం వలన రైతు మొత్తం గా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.  రైతులు సమగ్ర పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల పంటలను కూడా సాగు చేసుకుని అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని ఆ పంటల సాగులో మెలకువలను వివరించారు. తదనంతరం నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్. యోగేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తో పాటు పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలను కూడా పెంచుకొని అధిక ఆదాయం పొందవచ్చని వాటి మెలకువలను వివరించారు. ఉద్యాన అధికారి మహేష్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో అమలవుతున్న వివిధ రకాల సబ్సిడీలు, ఆయిల్ పంట సాగు గురించి వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారిని సంధ్య వ్యవసాయ పంటలలో అమలవుతున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ శంకర్ రైతు సోదరులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు

వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

హుజురాబాద్ లోని స్కూల్ గ్రౌండ్ మైదానంలో  నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు. 700 నుంచి 800 మీటర్ల వాకింగ్ ట్రాక్ సంబంధించిన ప్రదేశమును వాకింగ్ చేసుకుంటూ  పక్కనే ఉన్న గ్రంథాలయమును కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,  వాకర్స్, కాంగ్రెస్  పార్టీ  నాయకులు, ఇతరులు ప్రజాసంఘాల నాయకులు ,అందరూ పాల్గొన్నారు.

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

ఓదెలలో పోచమ్మ తల్లి  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన 

చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోచమ్మ తల్లి నూతన విగ్రహ  ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళ వాయిద్య పూర్వక గంగ సేకరణ, యాగశాల ప్రవేశం ,గణపతి గౌరీ పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, పంచచార్యా, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, జలాధివాసం వంటి కార్యక్రమాలను పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనీకిరెడ్డి సతీష్ మాట్లాడుతూ.. శనివారం రోజున విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేయగలరన్నారు. ఈ కార్యక్రమంలో కనకిరెడ్డి సురేష్, సదానందం, సారయ్య, పరుశురాం, కిరణ్ ,సాయి రమణ, రాజ్ కుమార్ ,రాజయ్య, అనిల్, ప్రభాకర్ , కనకయ్య , మల్లమ్మ, వనజ, తిరుమల, కీర్తి, లావణ్య, రాధా .మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ

రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ

చిత్రం న్యూస్, పెద్దాపురం:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నందున కార్డు దారులు రేషన్ దుకాణాల వద్దకే వెళ్లాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్ర శేఖర రెడ్డి చెప్పారు. శుక్రవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియలో పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతుందని ప్రభుత్వం గుర్తించి ఆ వాహనాలను రద్దు చేయడం తో పాత విధానాన్ని పునరుద్ధరించారన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ అన్ని రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు. వృద్దులు, దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఎటూ కదలలేని వారికి ఆయా రేషన్ డిపో నిర్వాహకులు నేరుగా కార్డుదారుడి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా డీటీ వై. శ్రీనివాస్, ఎంఎస్ఓ కమల కుమారి, కార్యాలయ ఏవో పద్మ, డీలర్లు పాల్గొన్నారు.

అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, పెద్దాపురం:

రాణి అహల్యాభాయి హోల్కర్ తృతీయ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు, మహారాణి అహల్యా భాయి హోల్కర్ యొక్క స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు ఆదర్శనీయంగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, లూతరన్ హై స్కూల్ ఎదురుగా నిర్వహించనున్న  ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు అందరూ పాల్గొని, జాతీయ భావ ఐక్యతను పెంపొందించాలని బిజెపి పెద్దాపురం పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్ కోరారు.

అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి

అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి

చిత్రం న్యూస్, ఓదెల:  పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మాజీ వార్డ్ మెంబర్ బోగే కనకమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. గత రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ వార్డ్ మెంబర్లు పరామర్శించారు.

ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి

ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి
*సహాయ కార్మిక అధికారి డి.రవీందర్

చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపెల్లి జిల్లా మంథని పరిధిలో కొరియర్ హోమ్ సర్వీసెస్ ,ఫుడ్ డెలివరీ, ఏసి టెక్నీషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, వంటి విధులు చేసేవారు ఈ శ్రమ్ పోర్టల్ లో వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి డి. రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శక్తి అమెజాన్, ఫ్లిప్ కార్డ్, జోమాటో, స్విగ్గి వంటి సంస్థలో పనిచేసే వారిని కార్మికులుగా గుర్తిస్తూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 14434 కు ఫోన్ చేసి సందేహాలను పరిష్కరించుకోవాలని సూచించారు.

తరోడ వాగులో గలంతైన దత్తు మృతదేహం లభ్యం

తరోడ వాగులో గల్లంతైన దత్తు మృతదేహం లభ్యం

చిత్రం న్యూస్, భోరజ్: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు భోరజ్ మండలం తరోడ వాగులో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా వాగు ఉధృతికి గల్లంతయిన విషయం విధితమే… పోలీసులు జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం పూసాయి వాగులో మృతదేహం లభ్యమయ్యింది.  మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.

చిత్రం న్యూస్, కేశపట్నం
జర్నలిస్టు రంగానికి వన్నెతెచ్చిన సీనియర్ పాత్రికేయుడు గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి అని శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరేం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలను బుధవారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి తహసిల్దార్ సురేఖ,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్, ఏఎస్ఐ సుధాకర్, మాజీ ప్రజా ప్రతినిధులు రాములు, గట్టు తిరుపతి గౌడ్,గాండ్ల తిరుపతి,మోత్కూరి సమ్మయ్య, జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కొరిమి వెంకటస్వామి,,దేవునూరి రవీందర్,, బూర్ల వెంకటేష్, నేరెళ్ల సంతోష్, కొరిమి సంతోష్, కత్తెరమళ్ళ కిరణ్,చింతం వెంకటేష్, గొర్ల అనిల్, తాళ్లపల్లి సాగర్, ఎల్కపల్లి సుధీర్, సంపత్ రెడ్డి, రాకేష్, తుమ్మ సుధాకర్, సురేష్, ప్రణదీప్, రంజిత్, తిరుపతి, అనిత్, పెద్ది గట్టయ్య, నరేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు

ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు

చిత్రం న్యూస్, సామర్లకోట: ఘనంగా "రాణి అహల్యా బాయి హోల్కర్" 300 జయంతి ఉత్సవాలు

కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయం లో కేంద్ర, రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు ” రాణి అహల్య భాయ్ హోల్కర్” 300 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ  కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు వల్లూరి బుల్లియ్య , కూనం శెట్టి అర్జునుడు, జనీ మోజెస్, తుమ్మల పల్లి శివ, చుక్క వెంకటరమణ, విజయలక్ష్మి, రఘు సాయి,. చిట్టిబాబు,, N. శ్రీను, S.వెంకటేశ్వరరావు పుప్పాల నాగ గోవిందు, సామర్లకోట టౌన్ బిజెపి ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.