ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ఆర్జేయూకేటీ బాసర, సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు ‘ రోడ్డు భద్రత – పౌరుల విధి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు శాంతి జగదీశ్వరి మాట్లాడుతూ..జీవితం ఎంతో విలువైందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు నడిపే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాహనాలు నడిపే సమయంలో బండికి సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నడపరాదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటిస్తే వారి కుటుంబానికి వారు ఆసరాగా ఉండొచ్చని వారి జీవితాలకు ఒక భరోసా ఉంటుందని అన్నారు. విద్యార్థుల చేత రోడ్డు భద్రతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు, ల్యాబ్ స్టాఫ్ బలరాం తదితరులు పాల్గొన్నారు.
ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆలయ అర్చకుల వైదిక బృందం ఘన సన్మానం
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆలయ అర్చకుల వైదిక బృందం ఘన సన్మానం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర నూతన బాసర మండల ప్రెస్ క్లబ్ TUWJ (IJU) నూతన కార్యవర్గానికి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకుల వైదిక బృందం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పాదాల వద్ద పూజలు నిర్వహించారు. ఆలయ AEO సుదర్శన్ గౌడ్, ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్, వేద పండితులు నవీన్ శర్మ ఉన్నారు. అనంతరం రవీంద్ర పూర్ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తించి పదోన్నతి పొంది బాసరలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న మమ్మయి శ్రీనివాస్ ను బాసర టియుడబ్ల్యూజే (ఐజేయు) నూతన కార్యవర్గం తరఫున సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాసరలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలను అందజేశారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్ బేల: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో గల నూతన బైరందేవ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల బీఆర్ఎస్ నాయకులతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సదల్పూర్ లో ఉన్నటువంటి బైరందేవ్, మహాదేవ్ దేవాలయ ఆవరణలో రూ. 2 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటు పాడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షలు ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్కే తేజ్రావు , అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్, మాజీ సర్పంచులు విపిన్ ఖోడే, విట్టల్ వరాడే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప, ముఖ్యనాయకులు విట్టల్ రౌత్ ,బత్తుల సుదర్శన్, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో పురుగుమందు తాగి యువకుడు (20) ఆత్మహత్య చేసుకున్నట్లు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..వడూర్ గ్రామానికి చెందిన కడారి వినోద్ ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నాడు. గమనించిన కుటుంబీకులు బోథ్ ఆసుపత్రికి తరలించారన్నారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఘనంగా గాజుల పండగ
ఘనంగా గాజుల పండగ
వంటా వార్పు, ఆట, పాటల నడుమ దోస్తుల గాజులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండగ ట్రెండ్ గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళలు గ్రాండ్ గా ఈ గాజుల పండుగ జరుపుకుంటున్న విషయం విధితమే. ఆదివారం బాసర మండలంలోని కీర్గుల్( కె) గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండగను కనుల పండువగా నిర్వహించుకున్నారు. మహిళలందరు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ సౌడలమ్మ అమ్మవారిని దర్శించుకొని అనంతరం దేవి సన్నిధిలో ఏకరూప దుస్తులను ధరించి, ముందుగా గోరింటాకును ఒకరినొకరు పెట్టుకొన్నారు. అందరు పసుపు, కుంకుమ, పూలు ధరించి సాంప్రదయ బద్దంగా ఒకరినొకరు వారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ వదిన మరదలు, అక్క చెల్లెల్లు గాజులు వేసుకొన్నారు. అనంతరం వంటలు వండుకొని భోజనాలు చేశారు. తదనంతరం కాలక్షేపానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని డీజే పాటలతో బతుకమ్మ పాటలతో, ఆటలను ఆడారు. అంత్యక్షరీ, పాటలు పాడుతూ ఆనందోత్సహల నడుమ గాజుల పండగను రోజంతా అక్కడే గడిపారు.
బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్రమైన పుణ్యక్షేత్రం అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కనిపించింది . ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. అమ్మవారిని దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి పాదాల వద్ద ప్రత్యేక అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు .ఆలయ ఈఓ అంజనీదేవి, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బాసరలో అయ్యప్ప భక్తుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
బాసరలో అయ్యప్ప భక్తుల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం నుండి అయ్యప్ప సన్నిధికి వెళ్లే భక్తుల పాదయాత్ర ను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర లో 40 మంది అయ్యప్ప మాలదారులు పాల్గొంటున్నారు. యాత్రలో రాష్ట్రాల సరిహద్దుల వద్ద అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ స్వాగతం పలికి ఏర్పాట్లు చేస్తుందన్నారు. అయ్యప్ప సన్నిధిలో అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ స్వాగతం పలుకుతారన్నారు. పాద యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని సరస్వతి అమ్మవారిని మొక్కుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన అయ్యప్ప భక్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని బ్రాహ్మణగావ్ గ్రామంతో పాటు ఆయా గ్రామాల నుండి అయ్యప్ప దీక్షాపరులు ఆదివారం బ్రాహ్మణగావ్ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రగా బయలుదేరారు. సుమారు 20 మంది స్వాములు 45 రోజులు పాదయాత్ర చేసి స్వామివారి సన్నిధానం చేరుకుంటారని తెలిపారు. ముథోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం మహా పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో బయలుదేరారు.
IMA ADILABAD జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్.కళ్ళెం వెంకట్ రెడ్డి
IMA ADILABAD జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కాలే సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కళ్లెం వెంకట్ రెడ్డి, కోశాధికారిగా బండి సాయికృష్ణతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ నూతన అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను డాక్టర్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు
ADILABAD MLA PAYAL SHANKAR: రాజకీయాల కతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు
* లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలకతీతంగా పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేసేలా చేపడుతున్న ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం భోరజ్ మండలంలోని పూసాయి, మాండగడ గ్రామాలలో ఇందిరమ్మ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇండ్లకు స్థానిక నాయకులు, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎవ్వరు ఉండకూడదని సదుద్దేశంతో ఇప్పటికే 4 కోట్ల 80 లక్షల ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మరో 2 కోట్ల 40 లక్షల ఇండ్ల నిర్మాణ కార్యక్రమం జరుగుతోందన్నారు. పేదల సొంతింటి కలను సహకారం చేసేలా భూమి పూజ చేసిన ఇండ్లకు అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అశోక్ రెడ్డి, రమేష్, గంగాధర్ సంజు,గణేష్, శ్రీనివాస్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










